నాని ‘V’ సినిమాకు అమెజాన్ బంప‌రాఫ‌ర్..విడుద‌ల‌కు ముందే..!

నాని 'V' సినిమాకు అమెజాన్ బంప‌రాఫ‌ర్..విడుద‌ల‌కు ముందే..!

నాచురల్ స్టార్ నాని హీరోగా మోహన‌కృష్ణ ఇంద్రగంటి డైరెక్ష‌న్ లో ‘V’ మూవీ తెరకెక్కిన విష‌యం తెల‌సిందే. నాని, సుధీర్ బాబు ఈ చిత్రంలో హీరోలుగా న‌టించారు. అయితే ఉగాది సంద‌ర్భంగా మూవీని మార్చి 25న రిలీజ్ చేస్తున్న‌ట్టు అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది మూవీ యూనిట్. అయితే క‌రోనా నేప‌థ్యంలో వాయిదా వేయ‌క తప్ప‌లేదు. అయితే ఈ సినిమాపై మంచి బ‌జ్ ఉన్న నేప‌థ్యంలో వాటిని క్యాచ్ చేసుకునేలా అమెజాన్‌ ప్రైమ్ సంస్థ ఈ మూవీ రైట్స్ […]

Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

Apr 11, 2020 | 7:51 PM

నాచురల్ స్టార్ నాని హీరోగా మోహన‌కృష్ణ ఇంద్రగంటి డైరెక్ష‌న్ లో ‘V’ మూవీ తెరకెక్కిన విష‌యం తెల‌సిందే. నాని, సుధీర్ బాబు ఈ చిత్రంలో హీరోలుగా న‌టించారు. అయితే ఉగాది సంద‌ర్భంగా మూవీని మార్చి 25న రిలీజ్ చేస్తున్న‌ట్టు అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది మూవీ యూనిట్. అయితే క‌రోనా నేప‌థ్యంలో వాయిదా వేయ‌క తప్ప‌లేదు. అయితే ఈ సినిమాపై మంచి బ‌జ్ ఉన్న నేప‌థ్యంలో వాటిని క్యాచ్ చేసుకునేలా అమెజాన్‌ ప్రైమ్ సంస్థ ఈ మూవీ రైట్స్ ను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఇక్క‌డో లొసుగు ఉంది. థియేట‌ర్స్ లో రిలీజ్ కాడానికి ముందుగానే త‌మ ఫ్లాట్‌ఫామ్‌లో ‘V’ చిత్రాన్ని విడుద‌ల చేసుకునేలా మేక‌ర్స్ తో సంప్ర‌దింపులు జరుపుతోందట అమెజాన్. ఇందుకోసం ఏకంగా రూ.35 కోట్లు ఆఫ‌ర్ చేసింద‌ని తెలుస్తోంది.

త్వ‌ర‌లోనే ఈ డీల్ పై ఒక స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. నాని సినిమా కావ‌డంతో ఫ్యామిలీ ఆడియెన్స్ మంచి ఇంట్రెస్ట్ చూపుతారు. అలా త‌మ సంస్థ బ్రాండ్ ను ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో మ‌రింత ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు అమెజాన్ ప్లాన్ చేస్తోంద‌ట‌. కెరీర్ లో 25వ సినిమాగా రాబోతున్న ఈ మూవీలో నాని నెగటీవ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ఈ సినిమాలో నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి హీరోయిన్లుగా నటించారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu