Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmamudi, January 18th Episode: రాజ్, కావ్యలను కాపాడిన స్వప్న.. ఇందిరా దేవికి తెలిసిపోయిన నిజం!

కావ్య నగలు తాకట్టు పెట్టిన విషయాన్ని బయట పెడుతుంది రుద్రాణి. దీంతో రుద్రాణిపై సీరియస్ అవుతాడు. ఆ తర్వాత తానే కావ్యని నగలు తాకట్టు పెట్టమని చెప్పానని అపర్ణ అంటుంది. ఆ తర్వాత రుద్రాణికి, ధాన్యలక్ష్మికి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఆ నెక్ట్స్ అసలు ఏం జరిగిందని కావ్యని నిలదీస్తుంది అపర్ణ. కానీ కావ్య ఏమీ సమాధానం చెప్పదు..

Brahmamudi, January 18th Episode: రాజ్, కావ్యలను కాపాడిన స్వప్న.. ఇందిరా దేవికి తెలిసిపోయిన నిజం!
BrahmamudiImage Credit source: Disney Hotstar
Follow us
Chinni Enni

|

Updated on: Jan 18, 2025 | 1:19 PM

ఈ రోజు బ్రహ్ముముడి ఎపిసోడ్‌లో.. కావ్య నగలు తాకట్టు పెట్టిన విషయం బయట పెట్టినందుకు రుద్రాణిపై సీరియస్ అవుతాడు రాజ్. నలుగురు కలిసి నవ్వుకోవడం, ఇంటిల్లపాది సంతోషంగా ఉండటం నీకు ఎప్పటికీ నచ్చదు. ఇన్ని రోజులూ ఎన్ని గొడవలు పుట్టించినా చూసీ చూడనట్టు ఊరుకున్నానని రాజ్ అంటే.. రుద్రాణి గొడవ పుట్టిస్తుంది సరే.. కానీ ఎలాగో ఆ సంగతి బయట పెట్టిందని తెలుసు కదా.. ఆస్పత్రి బిల్ కట్టడానికి నగలు తాకట్టు పెట్టేంత దుస్థితిలో ఉన్నామా.. అది తేలాలి ముందు అని ధాన్యలక్ష్మి అంటే.. ఏం తేలాలి ముందు చెప్పు.. అకౌంట్స్ విషయమా.. నగలు తాకట్టు పెట్టిన విషయమా.. రుద్రాణికి నీకూ ఏదీ తేడా లేదని రుజువు అవుతూనే ఉంది. కానీ రుద్రాణి కనిపెట్టిన అద్భుతమైన విషయానికి నేను సమాధానం చెబుతాను. నేను చెబితేనే కావ్య నగలు తాకట్టు పెట్టిందని అపర్ణ అనే సరికి అందరూ షాక్ అవుతారు.

కావ్యని కాపాడిన అపర్ణ..

ఏంటి వదినా నువ్వు ఐదు లక్షల కోసం నగలను తాకట్టు పెట్టించావా అని రుద్రాణి అడిగితే.. అవును నేనే తాకట్టు పెట్టించానని అపర్ణ అంటుంది. ఎందుకు మనకు అంత కష్టం వచ్చిందని ఇందిరా దేవి అడిగితే.. కష్టం కాదు అత్తయ్యా.. అవసరం వచ్చింది. అకౌంట్స్ హోల్డ్‌లో పెట్టారు అనేసరికి.. ఆస్పత్రి బిల్ కట్టకపోతే పరువు పోతుందని నేనే కావ్య నగలు తాకట్ట పెట్టి కట్టమని చెప్పానని అపర్ణ అంటే.. నువ్వు చాకచక్యంగా నీ కొడుకు, కోడల్ని కాపాడుకుంటున్నావని అర్థమైందని రుద్రాణి అంటే.. అవునా అయితే ఏంటి? ఇప్పుడు.. నేను చెబుతుంది అబద్ధమని ఫ్రూవ్ చేయి.. ఇంటి విషయాలను బయట పెట్టి చాలా చీప్‌గా బిహేవ్ చేయడం అలవాటే కదా.. నన్నూ నా కొడుకును, నా కోడల్ని, ఈ కనకం కుటుంబాన్ని అసలు నువ్వు ఏ హక్కుతో నిలదీస్తున్నావ్ రుద్రాణి? నువ్వెంత? నీ లెక్క ఎంత? ఈడ్చి పెట్టి కొడితే.. నడి రోడ్డు మీద బ్రతికే బ్రతుకే నీది నోరు మూసుకో అని అపర్ణ సరైన సమాధానం చెబుతుంది. అక్కా రుద్రాణి నోరు మూయించావు కానీ.. ఇందాక రుద్రాణి కావ్య నగలు ఏమయ్యాయని అడిగినప్పుడు ఎందుకు నిజం చెప్పలేదని ధాన్యలక్ష్మి అడుగుతుంది.

ధాన్యలక్ష్మి, రుద్రాణి నోరు మూయించిన అపర్ణ..

నాకు కొంచెం కామన్‌సెన్స్ ఉంది కాబట్టి.. అప్పుడే బయట పెట్టి ఉంటే స్వప్న సీమంతం జరక్క ముందే.. రచ్చ చేస్తారని తెలుసు అందుకే అర్థమైందా? నోరు మూసుకుని తినమని అపర్ణ అంటుంది. ఆ తర్వాత అందరూ ఇంటికి చేరుకుంటారు. కావ్యని నిలదీస్తుంది అపర్ణ. చెప్పు అసలు ఏం జరిగింది? ఎందుకు నగలు తాకట్టు పెట్టాల్సిన అవసరం వచ్చింది? అసలు కారణం ఏంటి? అని అడుగుతుంది. కానీ కావ్య ఎలాంటి సమాధానం చెప్పదు. మీ నమ్మకాన్ని పోగొట్టుకునే పని నేను ఎప్పుడూ చేయనని కావ్య అంటే.. ఈ రోజుతో పోయింది. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? మాట్లాడు.. అసలు ఏం జరుగుతుందో చెప్పుని అపర్ణ గట్టిగా నిలదీసి అడుగుతుంది. అపర్ణ ఎందుకు అంత ఆవేశ పడుతున్నావు.. నీ ఎదురుగా ఉంది కావ్య. ఏం చేసినా ఆలోచించే చేస్తుందని ఇందిరా దేవి అంటుంది. ఇదేదో కీడులా ఉంది.. ఈ ఇంటికి ఏదో జరగబోతుందనే హెచ్చరికలా ఉందని అపర్ణ కంగారు పడుతుంది.

ఇవి కూడా చదవండి

ఇంట్లో ఈ సంక్షోభం ఎందుకు వచ్చింది..

ఈ ఇంటికి ఏదో కీడు చేయాలని ఏ క్షణం కూడా అనుకోవడం లేదని కావ్య అంటే.. లేదు నాకు ఆ నమ్మకం కుదరడం లేదు. నేను ఈ ఇంటి క్షేమం, భద్రత కోసం ఆరాటపడి అడుగుతున్నాను. ఎందుకు రసహ్యంగా ఆ పని చేయాలని అపర్ణ అంటుంది. అత్తయ్యా మీరు నా వ్యక్తిత్వాన్ని నమ్ముతున్నారా.. నేను వద్దు అన్నా నాపై ఇంత బాధ్యతను పెట్టి.. ఇప్పుడు ఇంతగా ఎందుకు నిలదీస్తున్నారు? మీరు ఇలా ప్రతీ విషయంలో జోక్యం చేసుకుంటారని తెలియక పిచ్చిదాన్ని.. మీరు చూపించిన దారిలోనే నడుస్తున్నా. నాకు ఏమీ తెలీదని చెప్పడం తప్ప మరో దారి లేదని కావ్య వెళ్తుంటే.. ఆగు.. నా మీదే నేరం మోపి.. తప్పించికు పోయినంత మాత్రాన నీకేమీ తెలీదని నమ్ముతాను అనుకున్నావా.. ఇంట్లో ఈ సంక్షోభం ఎందుకు వచ్చిందో చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అయినా నువ్వు తప్పించుకుని వెళ్లిపోతున్నావు.. సరే నా మాటకు విలువ ఇవ్వని మనిషితో ఇక మాటలు అనవసరం. నువ్వు నాతో మాట్లాడే ప్రయత్నం చేయవద్దని అపర్ణ వెళ్తుంది. అపర్ణ ఇంతలా అడుగుతున్నా కావ్య చెప్పడం లేదంటే.. ఏదో పెద్ద సమస్యే ఎదురైనట్లుంది. ఈ ఇంటి పెద్దగా ఆ సమస్య ఏంటో తెలుసుకోవాలని ఇందిరా దేవి అనుకుంటుంది.

కావ్య, రాజ్‌ల టెన్షన్..

మరోవైపు రాజ్, కావ్యలు టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక చేసేది ఏమీ లేదు.. ఈ నిజం వెంటనే ఇంట్లోని వాళ్లందరికీ చెప్పాలని రాజ్ అంటే.. సరే మీరు నిజం చెప్పగానే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించమని కావ్య అంటుంది. దీంతో రాజ్ ఊహించుకుంటూ ఉంటాడు. ఏంటి ఇదంతా నిజమా.. ఏవేవో స్టోరీలు చెబితే నమ్మేస్తాం అనుకుంటారా.. మా నాన్న కోట్ల ఆస్తి.. ఎవడో కోన్‌కీస్కా గొట్టం గాడికి శూరిటీ పెడితే.. వాడు ఎగరేసుకుని పోయాడా.. ఆస్తి అంతా కాజేసి.. మా నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నారా? అని రుద్రాణి.. అబ్బబ్బా ఆయన గారు సత్య హరిశ్చంద్రుడంట.. తరతరాలుగా ఇస్తున్న ఆస్తిని దానం చేస్తారా? మర్యాదగా మా వాటా ఆస్తి మాకు రాసి ఇచ్చి.. మీ వాటా దానం చేసుకుంటారో.. ధర్మం చేసుకుంటారో చేసుకోండి. లేదంటే మాత్రం కోర్టుకు వెళ్తామని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ తర్వాత రుద్రాణి, ధాన్యలక్ష్మిల మాటలు, ఇంట్లో జరిగే గొడవను గుర్తు చేసుకుంటాడు రాజ్. ఏంటి ఇంత జరుగుతుందా అని భయ పడుతూ.. నేనే ఈ నిజాన్ని దాచుకుంటానని రాజ్ అంటాడు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..