Brahmamudi, December 24th Episode: కావ్య ఆర్డర్స్‌కి రుద్రాణి, ధాన్యలక్ష్మి హడల్.. రాజ్ సపోర్ట్!

డబ్బు విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా మారుతుంది కావ్య. ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇకపై డబ్బు విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని.. ఖర్చు పెట్టిన డబ్బులకు బిల్స్ చూపించాలని ఆర్డర్ వేస్తుంది. కావ్య చేసిన పనికి రాజ్ సపోర్ట్‌గా నిలుస్తాడు. ఏం చేయాలో తెలీక రుద్రాణి, ధాన్యలక్ష్మిలు అసూయ పెంచుకుంటారు..

Brahmamudi, December 24th Episode: కావ్య ఆర్డర్స్‌కి రుద్రాణి, ధాన్యలక్ష్మి హడల్.. రాజ్ సపోర్ట్!
BrahmamudiImage Credit source: Disney hot star
Follow us
Chinni Enni

|

Updated on: Dec 24, 2024 | 1:52 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. డబ్బులు అడిగిన ప్రతి వాళ్లు ఖచ్చితంగా బిల్స్ తీసుకు రావాలని చెబుతుంది. డబ్బు ఖర్చు పెట్టే విషయంలో.. ఎందుకు ఉపయోగిస్తున్నారో చెప్పాలని అంటుంది. ఇది నా రిక్వెస్ట్ కాదని.. ఆర్డర్ అందరూ పాటించాలని చెబుతుంది కావ్య. అత్తయ్య గారు ఇంతేనా.. ఆవిడ అలా రెచ్చిపోయి మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరే అని ధాన్యలక్ష్మి అడిగితే.. ధాన్యలక్ష్మి నువ్వు ఎప్పుడు నా పెద్ద రికాన్ని నిలబెట్టావు? నీ మూలంగా నా భర్త ఆస్పత్రి పాలయ్యాడు. ఆయన చావు బతుకుల మధ్య పోరాడుతుంటే.. ఇక్కడ ఇంటి కోడలిగా నువ్వు ఏం చేశావు? నన్ను ఓదార్చావా? అన్నం కూడా తిననివ్వలేదు. ఆయన ఆస్తి మొత్తం మనవరాలి మీదనే రాశారు. నా పేరు మీద కూడా రాయలేదు. కాబట్టి ఇక నుంచి నీకు ఏం కావాలన్నా కావ్యనే అడుగు అని ఇందిరా దేవి అంటుంది. ఆ తర్వాత అక్కా నీ కోడలు అలా మాట్లడటం అస్సలు సమంజసంగా లేదని ధాన్యలక్ష్మి అంటే.. నిజమే అస్సలు సమంజసంగా లేదు కావ్య.. తనకు కూడా ఖర్చులు ఉంటాయి కదా అని అపర్ణ అంటుంది.

నువ్వు ఇంత స్ట్రిక్ట్‌గా ఉంటే అనుమానం వస్తుంది..

ఆ తర్వాత రుద్రాణి కూడా ఫైర్ అవుతుంది. మరేం చేయాలి రుద్రాణి. ఆస్తి మొత్తం నా కోడలి పేరు మీద ఉంది. నా కొడుకు కూడా ఏం కావాలన్నా తనపైనే ఆధార పడాలి అని అపర్ణ అంటుంది. అందుకు రాజ్ కూడా అవును అంటూ సారీ అత్తయ్యా నేనేం చేయలేనని రాజ్ అనేసి వెళ్తాడు. ఇక ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అని కావ్య అడిగితే.. లేదని ప్రకాశం అంటాడు. మరోవైపు రుద్రాణి.. ఏం చేయాలో అర్థం కాక కోపంగా చూస్తుంది. ఇక రాజ్, కావ్యలు గదికి వెళ్తారు. కళావతి నిన్ను ఒకటి అడగనా.. ఎప్పుడూ జాలి, దయగా ఉండే దానివి.. ఇప్పుడు ఏంటి ఇంత స్ట్రిక్ట్‌గా మాట్లాడావు? అని రాజ్ అడిగితే.. మీ దగ్గర నుంచే నేర్చుకున్నాను. మీరు ఆఫీస్‌లో ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటారో అదే ఇక్కడ పాస్ చేశానని కావ్య అంటుంది. నువ్వు మరీ ఇంత స్ట్రిక్ట్‌గా ఉంటే నిన్ను తిట్టుకుంటారని రాజ్ అంటే.. పర్వాలేదు.. కానీ నాకు కావాల్సింది కుటుంబ గౌరవం. అంతే నేనే అంతకు మించి ఏమీ ఆలోచించడం లేదని కావ్య అంటే… ఒక్కసారిగా వాళ్ల దగ్గర నుంచి ఫ్రీడమ్ ఇచ్చి లాగేసుకుంటే వాళ్లకు డౌట్ వస్తుందేమోనని రాజ్ అంటాడు. రాకుండా నేను చూసుకుంటా. ఇన్నాళ్లూ వీళ్ల కోసమే కదా తాతయ్య గారు కష్ట పడ్డారు. మరి ఇప్పుడు ఆ డబ్బును కాపాడుకోవాలి కదా.. డబ్బును ఖర్చు పెట్టడానికి నేను ఒప్పుకోనని కావ్య అంటుంది. దీంతో రాజ్ థాంక్స్ చెప్తాడు.

కావ్యకి థాంక్స్ చెప్పిన రాజ్..

కావ్య కూడా థాంక్స్ చెబుతుంది. ఎందుకు అని రాజ్ అంటే..పెళ్లాం చేసిన పనికి థాంక్స్ చెప్పే మొగుడు దొరికినందుకు అని కావ్య అంటుంది. ఇక తెల్లవారుతుంది రుద్రాణి, ధాన్యలక్ష్మిలు ఇద్దరూ హాలులో కోపంగా కాఫీ తాగుతూ ఉంటారు. ఇప్పుడు మన చేతికి డబ్బు రాదంటావా.. మన మాటకు ఇంక విలువే లేదంటావా.. ఇది నాకు మింగుడు పడటం లేదే. ఇంత అవమానం తట్టుకోవడం నా వల్ల కావడం లేదని రుద్రాణి అంటే.. నువ్వే అలా అంటే నా సంగతి ఏంటి అంటూ ధాన్యలక్ష్మి అంటుంది. అప్పుడే పని మనిషి శాంతా లోపలికి వస్తుంది. శాంతాని చూసిన రుద్రాణి.. ఏయ్ ఆగు అక్కడ అని అంటుంది. కానీ వినిపించుకోకుండా శాంతా లోపలికి వస్తుంది. ఎందుకు ఆగాలమ్మా వంట మనిషికి కూడా హారతి ఇచ్చి తీసుకొస్తారా అని శాంతా అంటుంది. మళ్లీ ఏం మొహం పెట్టుకుని వచ్చావు? అని అంటే.. నేనేం పరాయి పంచన పడి ఉండి బ్రతకడం లేదని శాంతా అంటుంది.

ఇవి కూడా చదవండి

కావ్య ఆర్డర్.. రుద్రాణి హడల్..

మేడమ్ ఫోన్ చేస్తేనే నేను వచ్చాను అని శాంతా అంటే.. నేనే పిలిచాను అని రుద్రాణి గారు అని కావ్య అంటుంది. ఎంత అహంకారం నీకు? నేను వద్దని వెళ్లగొట్టిన పనిమనిషిని మళ్లీ పిలుస్తావా? అని అడుగుతుంది. కావాలని కాదు.. వంట చేయడానికి ఒక మనిషి కావాలనే పిలిచాను. ఈ రోజు నుంచి నేను ఆఫీస్‌కి వెళ్తున్నా.. అందుకే శాంతాని పిలుస్తున్నా అని కావ్య చెబుతుంది. అంటే ఈ ఇంట్లో నా మాటకు విలువ లేదా అని రుద్రాణి అంటే.. అంటే అమ్మమ్మ గారి గురించి మీకు పట్టింపు లేదా? నేను ఇంతేనండి.. మా స్వప్న అక్క కంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివానని కావ్య అంటుంది. రుద్రాణి బయటకు వెళ్లమంటే.. కావ్య మాత్రం శాంతాని లోపలికి వెళ్లమని అంటుంది. శాంతాకు జీతం ఇచ్చేది నేను.. మీరు కాదు వెళ్లి వంట పని చూసుకోమని కావ్య ఆర్డర్ వేస్తుంది. ఏంటి వదినా నీ కోడలు అంత పొగరుగా మాట్లాడి వెళ్తే.. నువ్వేం మాట్లాడవా అని రుద్రాణి అడుగుతుంది. మీరు ఆ హక్కును ఎప్పుడో పోగొట్టుకున్నారని అపర్ణ అంటుంది.

పాత కక్ష్యలు తీర్చుకుంటుంది..

పాత కోపాలు, కక్ష్యలు అన్నీ తీర్చుకుంటుంది. రోజు రోజుకూ ఈ ఇంటి మీద మనం పట్టు పోగొట్టుకుంటున్నామని ధాన్యలక్ష్మితో అంటుంది రుద్రాణి. మరోవైపు డాక్టర్ గారు మా వారు ఎప్పుడు కోలుకుంటారని ఇందిరా దేవి అడుగుతుంది. ఆయన కోమాలోకి వెళ్లారని.. సమయం పడుతుందని డాక్టర్ చెబుతాడు. మరోవైపు రుద్రాణి, రాహుల్, ధాన్యలక్ష్మిలు టిఫిన్ దగ్గర కూర్చుంటారు. ఎందులో చూసినా ఇడ్లీలో కనిపిస్తాయి. ఏంటి అన్నీ ఇడ్లీలే చేశావని శాంతాని అడిగితే.. నాకు తెలీదు అమ్మా కావ్య మేడమ్ చెప్పారని శాంతా అంటుంది. నాకు అదంతా తెలీదు.. వేరే టిఫిన్ కావాలి తీసుకు రమ్మని రుద్రాణి చెబుతుంది. అప్పుడే కావ్య వస్తుంది. కావ్యని చూడగానే రోజుకు నాలుగైదు రకాలు ఉండేవి.. ఇవాళ ఏంటి ఈ తేడా అని రుద్రాణి, ధాన్యలక్ష్మిల అడుగుతారు. ఇక నుంచి రోజుకు ఒకే టిఫిన్ వస్తుందని కావ్య చెబుతుంది. ఇదేమన్నా హాస్టలా.. ప్రతి రోజూ అన్ని రకాల టిఫిన్స్ ఉండాలని రుద్రాణి అంటుంది.

ధాన్యలక్ష్మి బాధ..

అదే సమస్య.. ఇష్టమైనవి తినేసి.. మిగతావి వదిలేస్తున్నారు. అన్నింటినీ చెత్త బుట్టలో పడేస్తున్నారు. అందుకే ఇకపై కుదరదు.. డబ్బుల్ని, ఆహార పదార్థాలను దుబారా చేయడం నాకు నచ్చదని కావ్య అంటుంది. మాకేం అవసరం లేదు. మాకు నచ్చిన టిఫిన్స్ తింటామని రుద్రాణి, ధాన్యలక్ష్మిలు అంటారు. అదంతా అపర్ణ గమనిస్తూ ఉంటుంది. ఇక మొగుడు దగ్గరకు వెళ్లి తన బాధను చెప్పుకుంటుంది ధాన్యలక్ష్మి. ఇడ్లీ, కొబ్బరి చట్నీ బాగుందని ప్రకాశం అంటాడు. ఇదేనా మీ ధోరణి మార్చుకోరా అని ధాన్యలక్ష్మి తిడుతుంది. ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో.. మళ్లీ గొడవ మొదలవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ