Brahmamudi, August 19th Episode: రాహుల్‌కి కంపెనీ బాధ్యతలు.. సినిమా చూపిస్తానన్న కావ్య..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. ధాన్య లక్ష్మి అత్తయ్య గారి అహం చల్లార్చడానికి.. ఆధిపత్యాన్ని వదులుకోమని ఆయనకు చెప్పడం వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. అంతే కాకుండా ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చిన వాళ్లం అవుతామని కావ్య అంటే.. ఇందిరా దేవి సపోర్ట్ చేస్తుంది. నా ఇద్దరి కొడుకులు ఉన్నారు వాళ్లే చూసుకుంటారని పెద్దాయన అంటే.. మేము చూసుకుంటాం.. ఇప్పుడున్న డిజైన్స్, మోడల్స్ మేము చేయలేమని సుభాష్ అంటాడు. నా కొడుకు ఉన్నాడుగా..

Brahmamudi, August 19th Episode: రాహుల్‌కి కంపెనీ బాధ్యతలు.. సినిమా చూపిస్తానన్న కావ్య..
Brahmamudi
Follow us
Chinni Enni

|

Updated on: Aug 19, 2024 | 12:54 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. ధాన్య లక్ష్మి అత్తయ్య గారి అహం చల్లార్చడానికి.. ఆధిపత్యాన్ని వదులుకోమని ఆయనకు చెప్పడం వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. అంతే కాకుండా ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చిన వాళ్లం అవుతామని కావ్య అంటే.. ఇందిరా దేవి సపోర్ట్ చేస్తుంది. నా ఇద్దరి కొడుకులు ఉన్నారు వాళ్లే చూసుకుంటారని పెద్దాయన అంటే.. మేము చూసుకుంటాం.. ఇప్పుడున్న డిజైన్స్, మోడల్స్ మేము చేయలేమని సుభాష్ అంటాడు. నా కొడుకు ఉన్నాడుగా అని రుద్రాణి అంటే.. అందరూ షాక్ అవుతారు. బయట వ్యక్తుల కంటే ఇంటి మనిషే అయితే ఇంకా మంచిది కదా అని రుద్రాణి అంటుంది. అది ఇప్పుడు అర్థమయ్యింది. కంపెనీ బాధ్యతల కోసం ఇదంతా ఆవిడే చేసిందని.. నీ కొడుకు నా అక్క భర్తే కావచ్చు.. కానీ రాహుల్‌కి బాధ్యతల కంటే మిగతా వాటి పైనే శ్రద్ధ. అతన్ని కంపెనీకి పంపిస్తే.. కంపెనీ పతనం అయిపోవడం ఖాయమని కావ్య అంటుంది.

రాహుల్‌కు కంపెనీ బాధ్యతలు..

ఇదే నీ అసలు స్వరూపం. నీ భర్తే కంపెనీకి అధిపతిగా ఉండాలి. నా కొడుకు బాధ్యతలు చూసుకుంటే.. చేతిలో నుంచి పవర్ పోతుందని ఎద్దేవా చేస్తుంది. రుద్రాణి.. నా కొడుకు, కోడల మీద నింద వేస్తే నిలువ నీడ లేకుండా చేస్తానని అపర్ణ వార్నింగ్ ఇస్తుంది. నాన్నా.. అందరూ కలిసి నా కొడుకుని అణగదొక్కుతున్నారు. వాడికి ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడమని రుద్రాణి అంటే.. సరే చూద్దాం.. నీ కొడుకు సామర్థ్యం ఏంటో బయట పడుతుంది. వాడు బాగుపడితే.. స్వప్నకు కూడా మనశ్శాంతిగా ఉంటుందని పెద్దాయన అంటాడు. చాలు నాన్నా ఆ మాట ఇస్తే చాలని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత ధాన్య లక్ష్మికి వార్నింగ్ ఇచ్చి పంపిస్తుంది ఇందిరా దేవి.

కవితలు ఇప్పుడు ఎవరూ చదవడం లేదు..

కట్ చేస్తే.. కళ్యాణ్ ఓ పబ్లిషర్‌ దగ్గరకు వస్తాడు. నేను ఓ రచయితను.. తాను కవితలు రాస్తానని.. ఇంతకు ముందు నా కవితలు కూడా మీరు పబ్లిష్ చేశారని చెప్తాడు. ఓహో అది మీరేనా? మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలని చాలా ట్రై చేశాను. కానీ కుదరలేదని అంటాడు పబ్లిషర్. మీ దగ్గర రచయితగా అవకాశం ఉంటే చెప్తారా? అని అడుగుతాడు. సారీ ఇప్పుడు మేము కవితల్ని పబ్లిష్ చేయడం లేదు. ఇప్పుడు ఎక్కువగా కథలు.. సెలబ్రిటీల ఆటో బయోగ్రఫీలు చదవడానికి ట్రై చేస్తున్నారని అంటాడు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి.. నేను అందరికీ నచ్చేలా కవితలు రాస్తానని కళ్యాణ్ అంటే.. సారీ అండీ.. ఇప్పుడు జనాలు ఇష్టపడేవి చేస్తాను. ఒక పని చేయండి.. మీరు కథలు రాయడం ట్రై చేయమని పబ్లిషర్ అంటాడు. సరే అని కళ్యాణ్ వెళ్లబోతుండగా.. మీరు రాసిన కవితలకు నేను పేమెంట్ చేయలేదు. ఇప్పుడు తీసుకోమని పబ్లిషర్ అనగానే కళ్యాణ్ సంతోషిస్తాడు.

ఇవి కూడా చదవండి

నాకు తోడుగా ఉండమని అడిగిన.. సీతారామయ్య..

ఈ తర్వాత పెద్దాయన బాధ పడుతూ ఉంటాడు. అక్కడికి వచ్చిన ఇందిరా దేవి తొందర పడి మాట ఇచ్చావని అంటుంది. ఇప్పుడు రాజ్‌ని ఆఫీస్‌కు వెళ్లడం ఆపకపోయి ఉంటే.. ధాన్య లక్ష్మి ఖచ్చితంగా ఆస్తి పంపకాలు చేయాలని పట్టుబట్టేది. అది అందరూ ఒప్పుకోవాలి కదా అని పెద్దావిడ అంటుంది. ధాన్య లక్ష్మి అన్న మాటల్లో కూడా నిజం ఉంది కదా.. ధాన్య లక్ష్మిని ఆపడానికి మరో మార్గం కనిపించలేదు. వీళ్లందరికీ సమస్య వస్తే విడిపోవడం, దూరంగా పారిపోవడమే తెలుసు. కానీ బయటకు వెళ్లాక మళ్లీ తిరిగి కలవడానికి చాలా కష్ట పడాలి. దీంతో శాశ్వతంగా దూరమై పోతారు. కంపెనీకి నష్టం జరిగినా కూడా అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాను. నేను పోయాక ఎలా ఉంటారో తెలీదు. కనీసం నేను బతికి ఉన్నప్పుడైనా కలిసి ఉంటారని అనుకుంటున్నా. మరి నాకు తోడుగా ఉంటావా అని సీతా రామయ్య అడిగితే.. తప్పకుండా అని పెద్దావిడ అంటుంది.

నేనేంటో చూపిస్తా కావ్య ఛాలెంజ్..

ఇక రాజ్ గదిలో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు కావ్య వస్తుంది. ఏంటి నీ కోపం తలుపు మీద చూపిస్తున్నావ్? అని రాజ్ అంటే.. నా మొగుడు దాన వీర శూర కర్ణుడు.. ఆయనకు ఎవరి గురించి అవసరం లేదని కావ్య వెటకారంగా అంటుంది. హేయ్ సూటిగా చెప్పమని రాజ్ అంటే.. ధాన్య లక్ష్మి అత్తయ్య కోసం తాతయ్య కంపెనీ బాధ్యతల నుంచి మిమ్మల్ని తప్పుకోమని మాట ఇచ్చారు. కానీ మీకు తెలీదా? కవి గారు అప్పుడే రారని.. ఆయన్ని పిలిచే వారు లేరు. కవి గారు రారు.. ఇదంతా ఎప్పుడు అవుతుంది? అప్పటి దాకా కంపెనీ పరిస్థితి ఏంటి? అని కావ్య అంటే.. మధ్యలో నీకేంటి? బాధ అని రాజ్ అడుగుతాడు. నేను మీ భార్యను అడిగే హక్కు ఉంది. ఎన్నో వందల మంది కంపెనీ మీద ఆధార పడి బతుకుతున్నారని కావ్య అంటుంది. వాళ్లు రోడ్డున పడితే ఎవరూ చూస్తే ఊరుకోరు. అంత దూరం రాదు. మా తాతయ్య నిర్ణయానికి మా నాన్న కూడా అడ్డు చెప్పలేదని రాజ్ అంటాడు. అందుకే రాహుల్ లాంటి జులాయిని తీసుకెళ్లి మీ స్థానంలో కూర్చోబెట్టారని కావ్య మెత్తుకుంటుంది. అసలు నీ బాధ ఏంటి? ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నావ్? కొంప తీసి మా పిన్ని అన్నట్టు.. నీకు ఆస్తులు, ఐశ్యర్యం మీద మోజు ఏమన్నా పెరిగిపోయిందా? అని రాజ్ అంటాడు. దీంతో కావ్య షాక్ అవుతుంది. చాలా బాధ పడుతూ.. తెలిసి పోయిందా? అర్థమై పోయిందా? మంచిదేలా.. మీరు అదే అభిప్రాయంతో ఉండండి.. రేపటి నుంచి నేను ఏంటో చూపిస్తానని కావ్య అంటుంది.

కళ్యాణ్, అప్పూ పాట్లు..

మరోవైపు కళ్యాణ్ కోసం వంట చేస్తుంది అప్పూ. కూర ఎలా ఉంటుందో ఏంటో.. కళ్యాణ్ ఎటా తింటాడో ఏంటో.. అని చూస్తూ వీడేంటి? ఇంకా రాలేదని అప్పూ అనుకుంటుంది. అప్పుడే కళ్యాణ్ వస్తాడు. అప్పూ అని పిలుస్తాడు. ఏంటి లేటు అయ్యింది.. అన్నం పెడతాను కాళ్లూ చేతులు కడుక్కోమని చెబుతుంది. కళ్యాణ్‌కి భోజనం వడ్డిస్తూ.. ఏమన్నా జాబ్ దొరికిందా? అని అడుగుతుంది. కానీ జీతం ముందుగానే వచ్చిందని.. ముందు నా కవితలు పబ్లిష్ చేసినందుకు.. డబ్బులు ఇచ్చారని చెబుతాడు కళ్యాణ్. మరి జాబ్ గురించి చెప్పాడా? అని అప్పూ అడిగితే.. కథలు రాయమని కళ్యాణ్ అంటాడు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.