AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmamudi, March 8th episode: ఇంటి గురించి పెద్దాయన చర్చ.. అనామికతో కళ్యాణ్ రచ్చ..

ఈ రోజు బ్రహ్మముడి సీరియల్‌లో.. స్వప్నను పక్కకు పిలిచి తిడుతుంది కావ్య. నాకు పని చేయడం ఏమన్నా సరదానా.. నా మొగుడిని, అత్తని ఎండు చేపల్లా ఎండ బెట్టినట్టు ఎండ బెట్టడానికి.. వాళ్ల బతుకులు ఏంటో అందరికీ తెలిసేలా చేయడానికి.. నేను డబ్బులు అడిగితే.. నాకేం సంబంధం లేనట్టు తప్పుకున్నారని స్వప్న అంటుంది. కానీ ఈ ఇంటి పరువును కూడా దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించాలి కదా అని కావ్య అంటే.. నువ్వు అందరి దృష్టిలో మంచిగానే ఉంటావ్..

Brahmamudi, March 8th episode: ఇంటి గురించి పెద్దాయన చర్చ.. అనామికతో కళ్యాణ్ రచ్చ..
Brahmamudi
Chinni Enni
|

Updated on: Mar 08, 2024 | 11:44 AM

Share

ఈ రోజు బ్రహ్మముడి సీరియల్‌లో.. స్వప్నను పక్కకు పిలిచి తిడుతుంది కావ్య. నాకు పని చేయడం ఏమన్నా సరదానా.. నా మొగుడిని, అత్తని ఎండు చేపల్లా ఎండ బెట్టినట్టు ఎండ బెట్టడానికి.. వాళ్ల బతుకులు ఏంటో అందరికీ తెలిసేలా చేయడానికి.. నేను డబ్బులు అడిగితే.. నాకేం సంబంధం లేనట్టు తప్పుకున్నారని స్వప్న అంటుంది. కానీ ఈ ఇంటి పరువును కూడా దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించాలి కదా అని కావ్య అంటే.. నువ్వు అందరి దృష్టిలో మంచిగానే ఉంటావ్.. మరి నీకు దక్కింది ఏంటి? నిన్నగాక మొన్న వచ్చిన ఆ జానా బెత్తుడు అనామిక కూడా నిన్ను ఆడుకుంటుంది. అదే నాజోలికి రమ్మను.. గుండు గీసి సున్నం బొట్లు పెడతాను. నిన్ను ఎవరు ఏమన్నా.. తల వంచుకుని పోతావ్ కాబట్టి.. అందరికీ నువ్వు చులకన అయిపోయావ్. మనం పేదింటి నుంచి వచ్చాం అనే కదా అందరూ మనల్ని చులకనగా చూస్తున్నారని అని సీరియస్ అవుతుంది స్వప్న.

ఇప్పటికైనా కళ్లు తెరువు కావ్య.. స్వప్న హితబోధ..

నువ్వు అందరి ముందూ ఎదిరించి మాట్లాడితే.. సమస్యకు పరిష్కారం దొరుకుతుందా అని కావ్య అంటే.. అదేం నాకు తెలీదు. కానీ ఇలానే సర్దుకు పోతూ ఉంటే.. ఇంకా ఆడిస్తారు. నీ అత్త నిన్ను సపోర్ట్ చేస్తుంది నీ మీద ప్రేమతో అనుకున్నావా.. వెర్రిదానా.. మీ అత్త తన తోడి కోడలి మీద ఉన్న అక్కసుతో నీకు సపోర్ట్ చేస్తుందే. ఆవిడ ముందు నువ్వు తగ్గకూడదని.. నిన్ను అడ్డం పెట్టుకుంటుంది. ఇప్పటికైనా కళ్లు తెరువు అని కావ్యకు హిత బోధ చేస్తుంది స్వప్న.

ఇంటి గురించి సీతా రామయ్య, ఇందిరా దేవిల భయం..

ఈ ఇంట్లో జరిగేవి చూస్తుంటే.. చాలా భయంగా ఉంది బావా అని ఇందిరా దేవి అంటే.. నాకూ అలానే ఉంది చిట్టీ. ఈ చిన్న చిన్న గొడవలే చిలికి చిలికి గాలి వానలా మారుతుందోమో అని కంగారుగా ఉంది. ఇప్పుడు స్వప్న చేసింది చూసి.. రేపు అనామిక చేసినా ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదని ఇందిరా దేవి అంటే.. స్వప్న చేసిన దానిలో అర్థం ఉంది చిట్టీ. రాహుల్ బాధ్యతగా లేకుండా తిరుగుతూ ఉంటే.. ఏ భార్య అయినా అలానే మాట్లాడుతుంది. తన భయంలో అర్థం ఉందని సీతారామయ్య అంటే.. మరి ఆ ధాన్యలక్ష్మికి ఏం తక్కువ అయిందని గొడవ చేస్తుందని పెద్దావిడ అంటుంది. ఈ రోజు నేరుగా సుభాష్ మీదనే ధాన్య లక్ష్మి నేరుగా నోరు పారేసుకుంది. దాంతో సుభాష్ చాలా బాధ పడ్డాడు. ఇవన్నీ ఇలాగే సాగితే ఈ ఇల్లు ముక్కలు అయిపోతుందని అపర్ణ అంటుందని ఇందిరా దేవి అంటుంది. ధాన్య లక్ష్మికి నువ్వు కాకుండా.. ప్రకాష్‌తో చెప్పిద్దాం అని సీతా రామయ్య అంటాడు. ఆ తర్వాత కళ్యాణ్ గురించి బాధ పడుతూ ఉంటారు ఇద్దరూ.

ఇవి కూడా చదవండి

అనామిక రచ్చ.. కళ్యాణ్ బాధ..

ఈ సీన్ కట్ చేస్తే.. గదిలో నుంచి తలగడ తీసుకుని బయటకు వెళ్తూ ఉంటాడు కళ్యాణ్. ఎక్కడికి అవి.. ఈ గదిని నువ్వు జైలులా ఫీల్ అవుతున్నావా.. నేనే నిన్ను అర్థం చేసుకోవడం లేదా.. ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇందుకేనా.. నన్ను బాధ పెడుతూనే ఉంటావా అని అనామిక అంటుంది. నన్ను అర్థం చేసుకుంటావని.. ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోవని తెలిసిపోయింది. అందుకే బయటకు వెళ్లి ప్రశాంతంగా పడుకుంటాను అని కళ్యాణ్ అంటాడు. అంటే ఇప్పుడు మన మధ్య ఉన్న గొడవలు ఇంట్లో అందరికీ తెలిసేలా చేసి.. నా పరువు తీయాలి అనుకుంటున్నావా అని అనామిక అంటే.. మన మధ్య గొడవలు ఉన్నాయని అందరికీ తెలుసని కళ్యాణ్ అంటాడు. నువ్వు నన్ను అర్థం చేసుకున్నప్పుడే.. ఈ గదిలో నిన్ను హత్తకుని పడుకుంటా అని కళ్యాణ్ హాలులోకి వచ్చి పడుకుంటాడు. అప్పుడే పై నుంచి వచ్చిన ధాన్య లక్ష్మి.. కళ్యాణ్‌ని చూసి.. ప్రకాష్‌కి చెప్తుంది. వాడిని వెళ్లి పైన పడుకోమని చెప్పండి. ఇప్పుడు అక్క చూసిందంటే.. దెప్పి పొడుస్తుందని అంటుంది. ఇక కిందకు వచ్చిన ప్రకాష్.. కళ్యాణ్‌కు నచ్చజెప్పుతాడు. తన గురించి చెప్పి కళ్యాణ్ చాలా బాధగా మాట్లాడతాడు. ఏం చెప్పినా తను మారదని అంటాడు. ఇక తండ్రి మాటలకు.. లోపలికి వెళ్తాడు కళ్యాణ్.

కావాలనే కావ్యను ఆట పట్టించిన రాజ్..

మరోవైపు.. శ్వేతతో ఫోన్‌లో మాట్లాడతాడు రాజ్. కావాలనే ఆ బావ గాడి నుంచి కావ్యను దూరం చేసి.. కళావతిని ఇంటికి తీసుకొచ్చేసా. వాడి ఓవరాక్షన్ చూసి చాలా చిరాకుగా ఉంటుందని రాజ్ అంటే.. అంటే కావ్యతో క్లోజ్‌గా ఉన్నాడని నీకు చిరాకుగా ఉంది కదా అని శ్వేత అంటే.. వాడు నాకు నచ్చలేదని అంటాడు. చెప్పలేవా.. చెప్పడం ఇష్టం లేదా అని శ్వేత అడిగితే.. కళావతి వస్తుందని ఫోన్ పెట్టేస్తాడు రాజ్. కావ్యను చూసి ఏంటి మొహం మాడిపోయిన పెసరట్టులా ఉందని రాజ్ అడిగితే.. ఏమీ లేదు.. మా అక్క గురించి అని కావ్య అంటుంది. ఇక కావాలనే కావ్యను రెచ్చగొట్టేలా.. కావాలని ఆట పట్టిస్తాడు రాజ్. ఇక కిందకు వెళ్తుంది కావ్య. పాలు వేడి చేస్తూ ఉంటుంది. అప్పుడే వచ్చిన ఇందిరా దేవి.. ఏంటి? కావ్య నువ్వు చేసేది నాకేం నచ్చలేదని అంటుంది. పాడైపోతాయని పాలు వేడి చేస్తున్నా బామ్మగారూ అని చెప్తుంది కావ్య. నేను అడుగుతుంది పాలు గురించి కాదు.. మీ బావ గురించి అని పెద్దావిడ చెప్తుంది. నువ్వు మీ బావను తిరిగి ఇక్కడికి రప్పించు అని ఇందిరా దేవి అంటే.. అమ్మో మీ మనవడు అని కావ్య భయ పడుతుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.