AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Shanti: ఆస్పత్రిలో జబర్దస్ట్ శాంతి తల్లి.. సర్జరీ కోసం ఇంటిని అమ్మేశానంటూ ఎమోషనల్‌!

జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ షోలోని కమెడియన్లు తమదైన శైలిలో జోకులు పేలుస్తూ కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు. ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోకు ఎందరో అభిమానులు ఉన్నారు. ఇక ఇందులో స్కిట్లు చేసిన కమెడియన్లు ఒక్కసారిగా పాపులర్‌ అయిపోయారు. నాన్ స్టాప్ ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు ఇండస్ట్రీకి ఎంతోమంది కమెడియన్స్‌ను కూడా అందించింది ఈ షో. ప్రస్తుతం వీరిని పలు సినిమా ఆఫర్లు వరిస్తున్నాయి. కొందరు ఏకంగా హీరోలు కూడా అయిపోయారు..

Jabardasth Shanti: ఆస్పత్రిలో జబర్దస్ట్ శాంతి తల్లి.. సర్జరీ కోసం ఇంటిని అమ్మేశానంటూ ఎమోషనల్‌!
Jabardasth Shanti
Srilakshmi C
|

Updated on: Mar 08, 2024 | 11:00 PM

Share

జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ షోలోని కమెడియన్లు తమదైన శైలిలో జోకులు పేలుస్తూ కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు. ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోకు ఎందరో అభిమానులు ఉన్నారు. ఇక ఇందులో స్కిట్లు చేసిన కమెడియన్లు ఒక్కసారిగా పాపులర్‌ అయిపోయారు. నాన్ స్టాప్ ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు ఇండస్ట్రీకి ఎంతోమంది కమెడియన్స్‌ను కూడా అందించింది ఈ షో. ప్రస్తుతం వీరిని పలు సినిమా ఆఫర్లు వరిస్తున్నాయి. కొందరు ఏకంగా హీరోలు కూడా అయిపోయారు. సుడిగాలి సుధీర్‌, హైపర్ ఆది, శాంతి, చమక్‌ చంద్ర.. వంటి పలువురు ఆర్టిస్టులకు బయట ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిలో జబర్దస్త్ శాంతి అలియాస్ శాంతిస్వరూప్ అందరికీ సుపరిచితమే. లేడి గెటప్‌లతో ప్రేక్షకులను అలరించే శాంతి స్వరూప్‌ జబర్దస్త్ శాంతిగానే గుర్తుండిపోయారు.

తన కామెడీ టైమింగ్ తో అందరినీ నవ్వించే జబర్దస్త్ శాంతి జీవితంలో మాత్రం అంతులేని విషాదం ఉంది. ఆర్ధికంగా, కుటుంబ పరంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. గతంలో తన తల్లికి సర్జరీ కోసం ఇంటిని అమ్మేయాల్సి వచ్చిందని ఓ వీడియోలో తెలిపిన సంగతి తెలిసిందే. శాంతి అమ్మ ఆస్పత్రి ఖర్చుల కోసం డబ్బులు లేకపోవడం వల్లనే తన ఇంటిని అమ్మకానికి పెట్టినట్లు ఆ వీడియోలో వెల్లడించారు. అమ్మ సర్జరీ కోసం ఆమెకు తెలియకుండానే ఇంటిని అమ్మేస్తున్నట్లు ఎమోషనలయ్యారు. అమ్మకు మించిన ఆస్తి, సంపద ఏది ఉండదని కన్నీరు పెట్టుకున్నారు. తాను అమ్మబోయే ఇంట్లోకి ఎవరు వచ్చినా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని గతంలో ఓ వీడియోలో శాంతి తెలిపిన సంగతి తెలిసిందే.

తాజాగా శాంతి అమ్మకు మోకాలి సర్జరీ చేయించినట్లు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వెల్లడించారు. నెల్లూరులోని అపోలో ఆస్పత్రిలో శాంతి అమ్మకు మోకాలి సర్జరీ విజయవంతంగా పూర్తైనట్లు ఆ వీడియోలో పేర్కొన్నారు. చికిత్స సమయంలో డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది తమను బాగా చూసుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం శాంతి అమ్మ ఆరోగ్యంతో ఉన్నారని, త్వరలో డిశ్చార్జ్‌ అయ్యి ఇంటికి వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.