Brahmamudi, June 11th Episode: బయట పడిపోయిన రహస్యం.. చావు బతుకుల మధ్య అపర్ణ..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. పెళ్లి దగ్గరకు రమ్మని అపర్ణ అడిగితే.. రానని సుభాష్ అంటాడు. ఎందుకండి అని అపర్ణ అడిగితే.. ఈ పెళ్లి ఎలా ఆపాలని ఆలోచిస్తున్నా అని చెప్తాడు. దీంతో అపర్ణ షాక్ అవుతుంది. ఎందుకు నా మీద మీకు కోపంగా ఉందా? అని అపర్ణ అడిగితే.. లేదు జాలి వేస్తుందని చెప్తాడు. నా గురించి నీకు తెలిసిపోయిన మరుక్షణం నువ్వు ప్రాణాలతో ఉండవు అని మనసులో అనుకుంటాడు. నేను రాలేనను అపర్ణా..

Brahmamudi, June 11th Episode: బయట పడిపోయిన రహస్యం.. చావు బతుకుల మధ్య అపర్ణ..
Brahmamudi
Follow us

|

Updated on: Jun 11, 2024 | 12:34 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. పెళ్లి దగ్గరకు రమ్మని అపర్ణ అడిగితే.. రానని సుభాష్ అంటాడు. ఎందుకండి అని అపర్ణ అడిగితే.. ఈ పెళ్లి ఎలా ఆపాలని ఆలోచిస్తున్నా అని చెప్తాడు. దీంతో అపర్ణ షాక్ అవుతుంది. ఎందుకు నా మీద మీకు కోపంగా ఉందా? అని అపర్ణ అడిగితే.. లేదు జాలి వేస్తుందని చెప్తాడు. నా గురించి నీకు తెలిసిపోయిన మరుక్షణం నువ్వు ప్రాణాలతో ఉండవు అని మనసులో అనుకుంటాడు. నేను రాలేనను అపర్ణా అని సుభాష్ అంటాడు. అదేంటి అన్నయ్యా నువ్వు దూరంగా ఉన్నంత మాత్రాన ఈ పెళ్లి ఆగిపోతుందా.. నువ్వు చేయాల్సినవి చేయాలి కదా అప్పుడు రాజ్‌తో కావ్య పెళ్లి జరిగినప్పుడు వదిన పక్కన లేదు.. ఇప్పుడైన వదిన ముచ్చట తీరుతుందని రుద్రాణి అంటుంది. ఈ పెళ్లి జరగాలని మీ వదిన కంటే నువ్వే ఎక్కువగా కోరుకుంటున్నావ్? అది ఎందుకో నీ మనస్సాక్షికే తెలియాలి. ఎందుకో అర్థం కావడం లేదని సుభాష్ అంటాడు. ఇక అపర్ణ బలవంతంగా సుభాష్‌ని తీసుకెళ్తుంది.

ఒంటరి అయిపోయిన కళావతి..

మరోవైపు మాయ మెలకువలోకి వస్తుందేమోనని కళావతి ఎదురు చూస్తుంది. ఇంతలో డాక్టర్ వచ్చి మాయ కోమాలోకి వెళ్లిందని చెప్తుంది. దీంతో కావ్య, అప్పూలు షాక్ అవుతారు. దీంతో కావ్య మౌనంగా ఏడుస్తూ వెళ్తుంది. అప్పుడే సాడ్ సాంగ్ ప్లే అవుతుంది. ఇక అప్పుడే ఇంటికి వస్తుంది. అప్పటికే కావ్య కోసం సుభాష్, స్వప్న, కళ్యాణ్, ఇందిరా దేవిలు ఎదురు చూస్తారు. ఏమైందని అడిగితే.. కావ్య మౌనంగా ఉంటుంది. ఇక కావ్య లోపలికి వెళ్లగానే.. ఏమైందని రాజ్ అడుగుతాడు. కావ్య మౌనంగా దణ్ణం పెడుతుంది. దీంతో రుద్రాణి, రాహుల్, చిత్రలు సంతోషంగా ఉంటూ తాళి కట్టించండి అని అంటుంది. అప్పుడే తాళి కట్టమని పంతులు కూడా చెప్తాడు.

సుభాష్ విశ్వరూపం..

ఈ సీన్ ఎంతో ఉద్వేగభరితంగా ఉంటుంది. అప్పడే రాజ్ తాళి తీసుకుని కట్టబోతుండగా.. సుభాష్ ఆగు అని అరుస్తాడు. ముందుకు వెళ్లి.. చాలు రాజ్ ఇప్పటి వరకూ తల దించింది చాలు. హేయ్ పైకి లేవే లే.. అంటాడు సుభాష్. అప్పుడే స్వప్న వచ్చి బలవంతంగా లేపేస్తుంది. తాళి కట్టిన తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడుకుందామని రుద్రాణి అంటే.. హేయ్ అని గట్టిగా అరుస్తాడు సుభాష్. తాళి నేను కట్టనివ్వను అని అపర్ణ అంటే.. కావ్యకి ఎలాంటి న్యాయం చేయాలో చేద్దామని అపర్ణ అంటే.. ఈ పెళ్లి జరిగితే కావ్యకి మాత్రమే కాదు.. నా కొడుక్కి కూడా అన్యాయం జరుగుతుందని సుభాష్ అంటే.. అదేంటి? వాడు తప్పు చేశాడు కదా అని అపర్ణ అంటుంది. లేదు నా కొడుకు శ్రీరాముడు. అసలు ఏం జరిగిందో మీకెవరికీ తెలీదు మీకు తెలుసా? అని సుభాష్ అంటే.. కావ్య, రాజ్‌లు ఆపుతారు.

ఇవి కూడా చదవండి

కావ్య, రాజ్‌ని పక్కకు నెట్టేసిన సుభాష్..

రేయ్ నాన్నా ఏంటి ఏం చెప్పాలి అనుకుంటున్నావ్? ఎందుకు ఇంతలా తల్లడిల్లిపోతున్నావ్? ఏమైంది నాన్నా అని ఇందిరా దేవి అంటే.. నా కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు అమ్మా.. ఆ బిడ్డ రాజ్ బిడ్డ కాదని సుభాష్ చెప్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. అసలు ఈ ఆడది మాయే కాదు. డబ్బు కోసం మాయ పేరుతో ఇంట్లోకి అడుగు పెట్టింది. నన్నూ, నా కొడుకుని, కోడల్ని బ్లాక్ మెయిల్ చేసి ఇక్కడిదాకా తీసుకొచ్చింది. దేవత లాంటి నా కోడలి కాపురం ముక్కలు అయిపోవడానికి వీల్లేదని సుభాష్ అంటే.. మావయ్యా శాంతంగా ఉండమని కావ్య చెబుతుంది.

నిజం తెలిసి కుంగిపోయిన అపర్ణ..

మరి ఆ బిడ్డ ఎవరు? చెప్పరా.. అని అడుగుతుంది అపర్ణ. ఇప్పుడు నిజం బయట పడాల్సిన సమయం వచ్చింది. నీకు అన్యాయం చేసి నేను ప్రశాంతంగా బతకలేను. వాడు రాజ్ కన్న బిడ్డ కాదు. ఆ బిడ్డ నా బిడ్డే. వాడిని కన్న తండ్రిని నేనే. దీంతో అందరూ షాక్ అవుతారు. మీ కన్న కొడుకు మంచివాడు కాదు. ఒక బలహీన క్షణంలో వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చెప్పగానే.. అపర్ణ కంగారు పడి కుంగిపోతుంది. పెళ్లి చేసుకోకపోతే.. కుటుంబం పరువు తీస్తానని బ్లాక్ మెయిల్ చేసింది. అది భరించలేక నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా. అప్పుడు రాజ్ వచ్చి ఆ మాయకు న్యాయం చేస్తానని మాట ఇచ్చి.. తన బిడ్డగా తీసుకొచ్చాడు.

గుండె పోటు వచ్చిపోయిన అపర్ణ..

అప్పటి నుంచి నా కోసం ఎన్నో అవమానాలు భరించాడు. అది ఆసరాగా తీసుకుని ఈ మనిషి ఆస్తి కోసం ఇంట్లోకి వచ్చి తాళి కట్టించుకోవాలని చూసింది. ఈ నిజం బయట పెడితే.. నువ్వు తట్టుకోలేవు. అందుకే ఇన్నాళ్లూ ఈ నిజం ఎవరం చెప్పలేదు. కావ్యకు కూడా ఈ నిజం తెలుసు. కానీ ఎప్పుడూ బయట పెట్టలేదు. ఈ పెళ్లి ఆపాలని ఎంతో ప్రయత్నించి ఓడిపోయింది. ఆఖరికి తన భర్తకు పెళ్లి జరుగుతున్నా.. అత్తగారి కోసం అది కూడా తట్టుకుంది. ఇప్పుడు కూడా నేను మౌనంగా ఉంటే.. వాళ్లిద్దర్నీ దూరం చేసి పాపం కట్టుకునేవాడిని. అపర్ణా నన్ను క్షమించు. నీకు నేనే సర్వస్వం అని తెలుసు. కానీ నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేను. ఈ తప్పును మన్నించు. జీవితంలో ఇక నేను ఎలాంటి తప్పూ చేయలేను అపర్ణా మన్నించు అని సుభాష్ అనగానే.. అపర్ణకు గుండె పోటు వచ్చి పడిపోతుంది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్తారు. అయితే అపర్ణకు సీరియస్‌గా ఉందని చెప్తారు. దీంతో రాజ్.. కావ్యపై సీరియస్ అవుతాడు. ఇక దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ అవుతుంది.

ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!