AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siri Hanmanth, Shrihan: చాలా రోజుల తర్వాత ఒకే షోలో సిరి, శ్రీహాన్.. రొమాన్స్ మాములుగా లేదుగా.. వీడియో

సిరి హన్మంత్- శ్రీహాన్.. తెలుగు ఆడియెన్స్ కు ఈ లవ్ బర్డ్స్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యూట్యూబ్ వీడియోలు, కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ తో వీళ్లిద్దరు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యారు. ఆన్ స్క్రీన్‌పై ఎంతో అందంగా కనిపించే ఈ జంట నిజ జీవితంలోనూ ప్రేమలో ఉన్నారు

Siri Hanmanth, Shrihan: చాలా రోజుల తర్వాత ఒకే షోలో సిరి, శ్రీహాన్.. రొమాన్స్ మాములుగా లేదుగా.. వీడియో
Siri Hanmanth, Shrihan
Basha Shek
|

Updated on: Jun 10, 2024 | 9:11 PM

Share

సిరి హన్మంత్- శ్రీహాన్.. తెలుగు ఆడియెన్స్ కు ఈ లవ్ బర్డ్స్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యూట్యూబ్ వీడియోలు, కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ తో వీళ్లిద్దరు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యారు. ఆన్ స్క్రీన్‌పై ఎంతో అందంగా కనిపించే ఈ జంట నిజ జీవితంలోనూ ప్రేమలో ఉన్నారు. అయితే ఆ మధ్యన బిగ్ బాస్ షోలో సిరి హన్మంతు కాస్త ఓవర్ యాక్షన్ చేసినట్లు. షణ్ముఖ్ జస్వంత్ తో లిమిట్స్ దాటి ప్రవర్తించింది. దీంతో సిరి- శ్రీహాన్ ల ప్రేమ బంధం అటకెక్కినట్టేనని ప్రచారం జరిగింది. అయితే అదేమీ జరగలేదు. పైగా వీరి ప్రేమ బంధం మరింత బలపడింది. అప్పుడప్పుడు టీవీ షోస్ కి వచ్చి సందడి చేస్తూనే ఉంటారీ లవ్ బర్డ్స్. తాజాగా జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న సర్కార్ సీజన్ 4కి జోడీగా వచ్చారీ ప్రేమ పక్షులు. తమ ఆటాపాటలతో ఫ్యాన్స్ కు మంచి సర్ ప్రైజ్ ఇచ్చారు. మొదట సిరి హన్మంతు షోలోకి ఎంట్రీ ఇవ్వగా.. ఆ తర్వాత శ్రీహాన్ తనదైన స్టైల్ లో అడుగు పెట్టాడు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి యాంకర్ సుధీర్ పై పంచులు, కౌంటర్ల వర్షం కురిపించారు. ఇక షోలో సిరి, శ్రీహాన్ ల రొమాన్స్ చూసి సుడిగాలి సుధీర్ షాక్ అయ్యాడు.

ఇక రీల్ లైఫ్ అయినా, రియల్ లైఫ్ లో అయినా ఎంతో సరదాగా ఉంటాడు శ్రీహాన్. తాజాగా సర్కార్ సీజన్ 4 షోలోనూ తన అల్లరి చేష్టలతో అలరించాడు. ముఖ్యంగా తన లవర్ సిరి ముందే.. మరో అమ్మాయికి లవ్ లెటర్ రాయడమే కాకుండా.. చదివి వినిపించాడు. అయితే ఇది సిరిని ఆట పట్టించడానికేనని అర్థమైంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మళ్లీ పాటలు పాడుతూ డ్యాన్స్ లు చేశారు. శ్రీహాన్ అయితే సిరి కోసం సుందరి అంటూ పాట కూడా పాడాడు. షోలో భాగంగా సిరి నుదుటి మీద ఒక ముద్దు కూడా పెట్టాడు. ఇప్పుడీ దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది ఆహా. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇప్పటికే ఓటీటీ టాప్ షోల్లో ఒకటిగా సర్కార్ సీజన్ 4 ఉంది. ఇప్పుడు సిరి, శ్రీహాన్ ల ఎపిసోడ్ తో ఈ ఓటీటీ షో క్రేజ్ నెక్ట్స్ లెవెవ్ కు వెళ్లుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

సర్కార్ సీజన్ 4 లో షోలో సిరి, శ్రీహాన్

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.