AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mirzapur Season 3 OTT: ఇట్స్ అఫీషియల్.. మీర్జాపూర్ సీజన్ 3 స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. టీజర్ చూశారా?

ఓటీటీలో మోస్ట్‌ పాపులర్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ల్లో 'మీర్జాపూర్‌' ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌ నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్ నుంచి ఇప్పటికే రెండు భాగాలు వచ్చాయి. ఆడియెన్స్ ను బాగా అలరించి బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ముఖ్యంగా ఇందులోని మున్నా భయ్యా, గుడ్డు భయ్యాల పేర్లు బాగా ఫేమస్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ మీర్జాపూర్ సిరీస్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

Mirzapur Season 3 OTT: ఇట్స్ అఫీషియల్.. మీర్జాపూర్ సీజన్ 3 స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. టీజర్ చూశారా?
Mirzapur 3
Basha Shek
|

Updated on: Jun 11, 2024 | 4:24 PM

Share

ఓటీటీలో మోస్ట్‌ పాపులర్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ల్లో ‘మీర్జాపూర్‌’ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌ నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్ నుంచి ఇప్పటికే రెండు భాగాలు వచ్చాయి. ఆడియెన్స్ ను బాగా అలరించి బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ముఖ్యంగా ఇందులోని మున్నా భయ్యా, గుడ్డు భయ్యాల పేర్లు బాగా ఫేమస్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ మీర్జాపూర్ సిరీస్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. వీరంతా మూడో సీజన్ కోసం ఆడియెన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వీరి నిరీక్షణకు తెర పడనుంది. మీర్జాపూర్ సీజన్ 3 కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్‌ గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేసిన చిత్ర బృందం స్ట్రీమింగ్ డేట్ ను కూడా అధికారికంగా ప్రకటించింది. జులై 5 వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్ కు రానుంది. స్ట్రీమింగ్ డేట్ తో పాటు పోస్టర్, టీజర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

గుర్మీత్‌సింగ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మీర్జాపూర్ సిరీస్ లో పంకజ్‌ త్రిపాఠి, శ్రియ పిల్గోంగర్‌, శ్వేతా త్రిపాఠి,అలీ ఫజల్‌, దివ్యేందు శర్మ,హర్షిత గౌర్‌, విజయవర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 2018 నవంబరు 16న మీర్జాజూర్ సీజన్ 1 రిలీజైంది. దానికి సీక్వెల్‌గా 2020 అక్టోబరు 23న రెండో సీజన్‌ విడుదలైంది. ఇప్పుడు సుమారు నాలుగేళ్ల తర్వాత జులై 5న మీర్జాపూర్‌-3 ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మీర్జాపూర్ సీజన్ 3 కోసం రంగం సిద్ధమైంది. తేదీని గుర్తు పెట్టుకోండి. నాలుగు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత, ‘మీర్జాపూర్ 3’ జూలై 5, 2024 న విడుదల కానుంది . ఇందులో కాలిన్ భయ్యా పాత్రలో పంకజ్ త్రిపాఠి కనిపించనున్నాడు. ఇక గుడ్డు భయ్యా పాత్రలో అందరికీ ఇష్టమైన అలీ ఫజల్ కనిపించనున్నాడు. ఇది కాకుండా ప్రైమ్ షేర్ చేసిన పోస్టర్‌లో రసిక దుగ్గల్, విజయ్ వర్మ, శ్వేతా త్రిపాఠి, ఇషా తల్వార్, అంజుమ్ శర్మ తదితరులు కనిపించారు.

ఇవి కూడా చదవండి

జులై 5 నుంచి స్ట్రీమింగ్..

మీర్జాపూర్ సీజన్ 3 టీజర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
3kW లేదా 5kW.. మీ ఇంటికి ఏ సోలార్ సిస్టమ్ ఉత్తమమైనది?
3kW లేదా 5kW.. మీ ఇంటికి ఏ సోలార్ సిస్టమ్ ఉత్తమమైనది?
భారత భూభాగాన్ని ఆక్రమించాం.. నేపాల్ ప్రధాని ప్రకటనతో తీవ్ర దుమారం
భారత భూభాగాన్ని ఆక్రమించాం.. నేపాల్ ప్రధాని ప్రకటనతో తీవ్ర దుమారం
త్వరలో అరుదైన దుష్టగ్రహాల కలయిక.. పెద్ద శుభ వార్తలు వినబోతున్నారు
త్వరలో అరుదైన దుష్టగ్రహాల కలయిక.. పెద్ద శుభ వార్తలు వినబోతున్నారు
నిన్నటి మ్యాచ్‌లో ఇవి గమనించారా.. అస్సలు మిస్సవ్వొద్దు ఈ 5 వింతలు
నిన్నటి మ్యాచ్‌లో ఇవి గమనించారా.. అస్సలు మిస్సవ్వొద్దు ఈ 5 వింతలు
విమానాలు అంటార్కిటికా మీదుగా ఎందుకు వెళ్లవు? షాకింగ్ రహస్యాలు!
విమానాలు అంటార్కిటికా మీదుగా ఎందుకు వెళ్లవు? షాకింగ్ రహస్యాలు!
జూన్‌ నెలలో 11 రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..!
జూన్‌ నెలలో 11 రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..!
అంతా కోల్పోయామని బాధపడుతున్నారా? చాణక్య నీతి చెప్పిన పరిష్కారం!
అంతా కోల్పోయామని బాధపడుతున్నారా? చాణక్య నీతి చెప్పిన పరిష్కారం!
కొత్త హీరోయిన్ల రాకతో సీనియర్ భామలకు కష్టాలు
కొత్త హీరోయిన్ల రాకతో సీనియర్ భామలకు కష్టాలు
ఆ పాట వల్లనే తెలుగులో మంచి పేరు వచ్చింది..
ఆ పాట వల్లనే తెలుగులో మంచి పేరు వచ్చింది..
మహిళల చేతి గాజుల వెనుక ఇంత పెద్ద కథ ఉందా.. 99శాతం మందికి తెలియదు
మహిళల చేతి గాజుల వెనుక ఇంత పెద్ద కథ ఉందా.. 99శాతం మందికి తెలియదు