OTT Movies: ఈ వారం ఓటీటీలో 20కు పైగా సినిమాలు.. విశ్వక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో సహా ఫుల్ స్ట్రీమింగ్ లిస్ట్
ఓటీటీలో మాత్రం పలు సూపర్ హిట్, క్రేజీ సినిమాలు సందడి చేయనున్నాయి. వీటిలో తెలుగువే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఈ వారం స్ట్రీమింగ్ కు వచ్చే సినిమాల విషయానికి వస్తే.. విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ హిట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పైనే అందరి దృష్టి ఉంది.
థియేటర్లలో పెద్ద సినిమాల సందడి మొదలైంది. ఎలక్షన్లు పూర్తి కావడంతో భారీ బడ్జెట్ సినిమాలు, పెద్ద హీరోల మూవీస్ ఒక్కొక్కటి థియేటర్లలోకి అడుగుపెడుతున్నాయి. అయితే ఈ వారం పెద్దగా బజ్ లేని యేవమ్, మ్యూజిక్ షాప్ మూర్తి, హరోంహర తదితర మూవీస్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరోవైపు ఓటీటీలో మాత్రం పలు సూపర్ హిట్, క్రేజీ సినిమాలు సందడి చేయనున్నాయి. వీటిలో తెలుగువే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఈ వారం స్ట్రీమింగ్ కు వచ్చే సినిమాల విషయానికి వస్తే.. విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పైనే అందరి దృష్టి ఉంది. అలాగే చైతన్య రావు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ పారిజాత పర్వం కూడా థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అలాగే పరువు తెలుగు వెబ్ సిరీస్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఇక ‘మహారాజ’ మూవీ, ‘ద బాయ్స్’ సిరీస్ పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. మరి జూన్ 2 వ వారంలో ప్రముఖ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు వచ్చే సినిమాలు, సిరీస్ లేంటో తెలుసుకుందాం రండి.
ఆహా ఓటీటీ
- పారిజాత పర్వం (తెలుగు సినిమా) – జూన్ 12
- కురంగు పెడల్ (తమిళ డబ్బింగ్ సిరీస్) – జూన్ 14
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
- ప్రొటెక్టింగ్ ప్యారడైజ్ (ఇంగ్లిష్ సినిమా) – జూన్ 10
- ద కలర్ ఆఫ్ విక్టరీ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూన్ 10
- నాట్ డెడ్ యెట్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూన్ 12
నెట్‌ఫ్లిక్స్ సినిమాలు, వెబ్ సిరీస్ లు
- టూర్ డే ఫ్రాన్స్ అన్ చైన్డ్ సీజన్ 2 (ఫ్రెంచ్ వెబ్ సిరీస్) – జూన్ 11
- కింగ్ ఆఫ్ కలెక్టబుల్స్ ద గోల్డిన్ టచ్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూన్ 12
- మై నెక్స్ట్ గెస్ట్ సీజన్ 5 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూన్ 12
- మిస్టరీస్ ఆఫ్ ద టెర్రకోటా వారియర్స్ (ఇంగ్లిష్ సినిమా) – జూన్ 12
- బిడ్జర్టన్ సీజన్ 3 పార్ట్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూన్ 13
- డాక్టర్ క్లైమాక్స్ (థాయ్ వెబ్ సిరీస్) – జూన్ 13
- అబంగ్ అధిక్ (మాండరిన్ సినిమా) – జూన్ 14
- గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (తెలుగు సినిమా) – జూన్ 14
- జోకో అన్వర్స్ నైట్ మేర్స్ అండ్ డే డ్రీమ్స్ (ఇండోనేసియన్ వెబ్ సిరీస్) – జూన్ 14
- మహారాజ్ (హిందీ సినిమా) – జూన్ 14
అమెజాన్ ప్రైమ్ వీడియో
- గ్రౌండ్ (తెలుగు సినిమా) – జూన్ 10
- ద బాయ్స్ సీజన్ 4 (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్) – జూన్ 13
ఆపిల్ ప్లస్ టీవీ
- ప్రెజూమ్డ్ ఇన్నోసెంట్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 12
- క్యాంప్ స్నూపీ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 14
జీ5
- లవ్ కీ అరేంజ్ మ్యారేజ్ (హిందీ సినిమా) – జూన్ 14
- పరువు (తెలుగు సిరీస్) – జూన్ 14
Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.