Brahmamudi, January 16th episode: కావ్య రొమాన్స్.. కంగారులో రాజ్.. సైకోలా మారిన అనామిక!
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో రుద్రాణి తల బాదుకుంటూ ఉంటుంది. అక్కడికి వచ్చిన రాహుల్.. ఏంటి మమ్మీ అని అడుగుతాడు. అది నన్ను టార్చర్ పెడుతుందిరా అని బాధతో చెప్తుంది. దాన్ని అలానే వదిలేస్తే.. పుట్ట బోయే బిడ్డ ముడ్డీ, మూతి కూడా కడగమంటుంది. పాయసంలో పాయిజన్ కలిపి ఇచ్చేస్తా అని రుద్రాణి అంటే.. అలా చేయకే మనం లోపల కూర్చోవాలి అని అంటాడు రాహుల్. ఏంటి బయట మాటలు అని స్వప్న గట్టిగా మాట్లాడగానే.. రుద్రాణి, రాహుల్‌లు అక్కడి..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో రుద్రాణి తల బాదుకుంటూ ఉంటుంది. అక్కడికి వచ్చిన రాహుల్.. ఏంటి మమ్మీ అని అడుగుతాడు. అది నన్ను టార్చర్ పెడుతుందిరా అని బాధతో చెప్తుంది. దాన్ని అలానే వదిలేస్తే.. పుట్ట బోయే బిడ్డ ముడ్డీ, మూతి కూడా కడగమంటుంది. పాయసంలో పాయిజన్ కలిపి ఇచ్చేస్తా అని రుద్రాణి అంటే.. అలా చేయకే మనం లోపల కూర్చోవాలి అని అంటాడు రాహుల్. ఏంటి బయట మాటలు అని స్వప్న గట్టిగా మాట్లాడగానే.. రుద్రాణి, రాహుల్‌లు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఈ లోపు రాజ్ అనామిక, కళ్యాణ్‌ల శోభనం గదిలి వెళ్తాడు. అక్కడున్న వ్యక్తిని చూసి ఏంటి నువ్వు ఉన్నావ్ అని అడుగుతాడు. కావ్య అమ్మ గారు ఈ డెకరేషన్ చేయమన్నారు అని చెప్పగానే. ఎక్కడికి వెళ్లింది? ఇప్పటిదాకా తనే చేస్తాను అంది కదా అని రాజ్ బయటకు వస్తాడు.
శోభనం గది డెకరేషన్‌కు దూరంగా ఉన్న కావ్య..
అప్పుడే కావ్య బాల్కానీలో బాధ పడుతూ నిలబడి ఉంటుంది. ఇక్కడ ఉన్నావేంటి? శోభనం గది డెకరేట్ చేయవా? అని అడుగుతాడు. ఎవరు చేస్తే ఏంటి? పని జరుగుతుంది కదా అని అంటుంది కావ్య. సాధారణంగా ఇలాంటివన్నీ నీ చేతుల మీదే జరిపిస్తావ్ కదా అని రాజ్ అంటూ ఉంటే.. అనామిక వస్తుంది. నాకు సంబంధించినవి కదా.. ఆవిడకు చేయడం ఇష్టం లేదేమో బావగారూ అని అనామిక అంటే.. అలాంటిదేం లేదు అని కావ్య అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఆ మాటల్లోనే తెలుస్తుంది ఎంత కోపంగా ఉందో అని అనామిక అంటుంది. సరిగ్గా అప్పుడే కళ్యాణ్ అటుగా వచ్చి మాటలు వింటూ ఉంటాడు.
కన్నింగ్ ప్లాన్‌లో అనామిక.. ఇరుక్కుపోయిన కావ్య..
చూశారా.. మీరు చెప్పినా వినలేదు. నేను ఏం పాపం చేశాను బావగారు. నా మీద కోపం కావ్యకు ఎప్పుడ తగ్గుతుందో ఏమో అని అక్కడి నుంచి వెళ్లి పోతుంది. కళ్యాణ్ అన్నీ విని అక్కడి నుంచి వెళ్తాడు. కావ్య కిచెన్‌లో కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది. కళ్ల నిండా కన్నీళ్లు పొంగుతూ ఉంటాయి. టమాటాలు కట్ చేసినా కన్నీళ్లు వస్తాయా వదినా మన ఇంట్లో అని అంటాడు కళ్యాణ్. అయ్యో అదేం లేదు కవి గారు. అయినా వాళ్లు అన్నది కూడా నిజమే కదా నేను కొన్ని పనులకు దూరంగా ఉంటేనే మీరు ఆనందంగా ఉంటారు అని కావ్య అంటే.. మీరు నా పనులకు దూరంగా ఉండటమే చాలా బాధగా ఉంది. మీరు ఎప్పటిలాగే ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను.
టమాటా కోసినా కన్నీళ్లు వస్తాయా వదినా.. కళ్యాణ్ ధైర్యం..
మీరు చేస్తే నష్టం కలుగుతుంది అన్న వాళ్లే.. తమ తప్పుని తెలుసుకునేలా చేయండి వదినా.. అంతే కానీ ఆగి పోవద్దు.. నన్ను బాధ పెట్టొద్దని కళ్యాణ్ అటాంటాడు. కళ్యాణ్ మాటలకు కావ్య కూల్ అవుతుంది. కన్నీళ్లను తుడుచుకుని నవ్వుతుంది. సరే కవి గారు.. మీ ఆనందమే నాకు ముఖ్యం. ఎవరు ఏమన్నా నేను చూసుకుంటారు. మీరు వెళ్లండి అని అంటుంది. మరి అన్నయ్య సహాయం చేస్తాడా.. అలిగాడు కదా అని కళ్యాణ్ అంటే.. మీ అన్నయ్యను ఎలా పిలవాలో నాకు తెలుసు అని కావ్య అంటుంది. రాజ్ ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు కావ్య వెళ్లి.. మీకు సామాజిక బాధ్యత ఉందా? అని మొదలు పెడుతుంది. నాకు సామాజిక బాధ్యత లేకపోవడం ఏంటే అని రాజ్ కోపడతాడు. సరే పదండి శోభనానికి వెళ్దాం అని కావ్య కావాలనే అంటుంది. హేయ్ ఛీ ఛీ ఏం మాట్లాడుతున్నావ్? అని రాజ్ నోటిపై చేయి అడ్డం పెట్టుకుంటాడు. అదేనండి ఆ శోభనం గదిని రెడీ చేయడానికి వెళ్దాం అని కావ్య అంటుంది. నీ తెలుగు తగలయ్యా.. అలా చెప్పు.. అని రాజ్ అంటాడు.
మన మధ్య నో రొమాన్స్.. గుర్తు చేస్తున్న కళావతి..
హా పిలిస్తే మాత్రం ఏం లాభం.. అసలు ఎన్ని రాత్రలు.. ఎన్ని పగళ్లు ఇదే రూమ్‌లో ఉన్నాం. ఒకే మంచంపై పడుకున్నాం. అదెప్పుడూ జరగని పని.. ఇప్పుడు జరుగుతుందా ఏంటి? అని కావ్య చురకలు వేస్తుంది. ఇక ఇలా రాజ్, కావ్యల మధ్య కామెడీ ట్రాక్ నడుస్తుంది. మొత్తానికి రాజ్‌ని.. శోభనం గదికి తీసుకు వస్తుంది కళావతి. ఇదిగో బాబు ఏంటి ఇలా గిజిబిజిగా చేస్తున్నావ్? నువ్వు వెళ్లు.. నీ బదులు మరో ఆయన వచ్చాడులే అని కావ్య అంటే.. హేయ్ పనోడు నేనూ ఒకటేనా.. అని కోపంగా అంటాడు రాజ్. అయ్యో నేను అలా అనలేదండి.. మరొకరు వచ్చారు అని మాత్రమే కదా చెప్పాను అని కవర్ చేస్తుంది.
రాజ్ కంగారు.. కావ్య పంచ్‌లు..
నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావ్ అని రాజ్ అంటాడు. ఆ.. ఆ.. నాకే అన్ని తెలివి తేటలు ఉంటే.. నా శోభనం స్టోర్ రూమ్‌లో ఎందుకు జరిగేది? అని అంటుంది కావ్య. దానికి రాజ్ షాక్ అయి.. అంటే మనకు శోభనం జరిగి పోయిందా అని కంగారు పడతాడు. మీరు అలా అనకండి నాకు సిగ్గేస్తుంది.. అంటూ కావ్య మెలికలు తిరుగుతూ ఉంటుంది. ఓసేయ్ చెప్పవే అంటాడు రాజ్ కోపంగా.. ఊహూ నేను చెప్పను. నాకు సిగ్గు అంటూ కావ్య అంటుంది.
ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోదామన్న కావ్య..
నేను నీతో ఈ పని చేయను పో అంటూ రాజ్ వెళ్లి పోతుంటే.. హా.. ఈ ముక్కేదో కవి గారికి చెప్పండి అని అంటుంది కావ్య. వెంటనే రాజ్ ఆగిపోయి.. వెర్రి నవ్వు నవ్వి.. అంటే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి మొదలు పెడదాం అని అంటాడు. మొత్తానికి కావ్య శోభనం గదిని రెడీ చేస్తుంది. ఆ మంచాన్ని చూసి రాజ్ మురిసి పోతూ ఉంటాడు. రాజ్‌ని చూసిన కావ్య బాగుందా? అని అడుగుతుంది. హా చాలా బాగుంది అని రాజ్ అంటే.. మరి ఈ రాత్రికి ఇక్కడే ఉండి పోదామా అని కావ్య అడిగితే.. హా సరే ఉండిపోదాం అని ఫ్లోలో చెప్పేస్తాడు రాజ్. దానికి కావ్య తెగ సంతోష పడిపోతూ ఉంటుంది. హే ఆపవే ఎప్పుడూ అదే గోల.. పదా వెళ్దాం అని ఆ గదిలో నుంచి కావ్యని తీసుకెళ్తాడు.
శోభనం గదిని చూసి మురిసి పోతున్న కళ్యాణ్..
ఈ సీన్ కట్ చేస్తే.. కళ్యాణ్ రెడీ అయి శోభనం గదిలోకి వస్తాడు. స్వీట్స్, మంచాన్ని చూసి మురిసి పోతాడు. మంచం మీద పువ్వులను వాసన చూస్తాడు కళ్యాణ్. వెంటనే తుమ్ము వస్తుంది. అమ్మో శోభనం ఆగి పోతుందా ఏంటి? అని అనుకుంటాడు. సరిగ్గా అప్పుడే అనామికను తీసుకుని వస్తారు. అందరి ముందు అనామిక సిగ్గును నటిస్తుంది. అనామికను గదిలోకి తోసేసి వాళ్లందరూ వెళ్లి పోతారు. ఇప్పుడు అనామిక అసలు క్యారెక్టర్‌లోకి వచ్చేసి.. ఈ తోసేయడం పద్దతి ఏంటి? ఎన్ని సినిమాలు చూసినా అర్థమై చావదు.. హలో నిలబడి చూస్తావేంటి? తలుపు గడియ పెట్టు అని అంటుంది పోగరుగా.. నేనా అని బిత్తర పోతాడు కళ్యాణ్.. అవును అని అంటుంది.
సైకోలా మారి పోయిన అనామిక.. పాపం కళ్యాణ్..
ఇక అనామిక మొదలు పెడుతుంది. నాకు ఈ పాలంటే అస్సలు నచ్చదు. సగం తాగేంత సీన్ కూడా లేదు. నువ్వు తాగుతావా అని అనామిక గట్టిగా అడిగితే.. పెద్ద వాళ్లు సెంటి మెంట్ అని చెప్పారు కదా.. కొంచెం కొంచెం తాగుదాం అని అంటాడు కళ్యాణ్. నేనైతే తాగను బాబూ.. నువ్వు తాగితే తాగు అని అంటుంది అనామిక. వెంటనే అనామిక మంచం మీద కూర్చుంటుంది. రా కూర్చో అని కళ్యాణ్ అని అంటుంది. కళ్యాణ్ పక్కనే కూర్చుంటాడు. ఏంటి? సైలెంట్ గా ఉన్నావ్ అని అనామి అడిగితే.. వింటున్నాను అని కల్యాణ్ అంటాడు. ఇదిగో పూల భాష అని కవి ఎమోషన్‌గా అంటే.. ఇప్పుడు ఈ కవిత్వం అవసరమా.. టైమ్ వేస్ట్ అని అంటుంది అనామిక. కళ్యాణ్ బిత్తర పోతాడు.. ఇంకేదైనా మాట్లాడు అని అనామిక అంటే.. ఈ గదిని బాగా రెడీ చేశారు కదా.. ఎవరో తెలుసా? అని కళ్యాణ్ అంటాడు. ఎవరు? అని అనామిక అంటే.. మా వదిన అని కళ్యాణ్ అంటాడు. దీంతో లోలోపల రగిలి పోతుంది అనామిక.