AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmamudi, February 21st episode: బావతో కావ్య.. కుళ్లుకుంటున్న రాజ్.. రుద్రాణి ప్లాన్ ఫెయిల్!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్ లోపల ఉన్న ప్రేమను బయట పెట్టడానికి కావ్య, ఇందిరా దేవి మాస్టర్ ప్లాన్ వేస్తారు. అన్నట్టుగానే బావను రంగంలోకి దించుతారు. ఈ క్రమంలోనే ఎయిర్ పోర్టు నుంచి తన బావను నేరుగా ఆఫీస్‌కి తీసుకొస్తుంది. వాళ్లను చూసిన రాజ్ చాలా ఫ్రస్ట్రేట్ అవుతాడు. కావాలనే శ్వేతతో చనువుగా ఉన్నట్టు నటిస్తూంటాడు. శ్వేత డివోర్స్ తీసుకున్నందుకు కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేస్తాడు. శ్వేత, రాజ్‌లు ఇద్దరూ తినిపించుకుంటారు. ఆ తర్వాత కావ్య..

Brahmamudi, February 21st episode: బావతో కావ్య.. కుళ్లుకుంటున్న రాజ్.. రుద్రాణి ప్లాన్ ఫెయిల్!
Brahmamudi
Chinni Enni
|

Updated on: Feb 21, 2024 | 12:22 PM

Share

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్ లోపల ఉన్న ప్రేమను బయట పెట్టడానికి కావ్య, ఇందిరా దేవి మాస్టర్ ప్లాన్ వేస్తారు. అన్నట్టుగానే బావను రంగంలోకి దించుతారు. ఈ క్రమంలోనే ఎయిర్ పోర్టు నుంచి తన బావను నేరుగా ఆఫీస్‌కి తీసుకొస్తుంది. వాళ్లను చూసిన రాజ్ చాలా ఫ్రస్ట్రేట్ అవుతాడు. కావాలనే శ్వేతతో చనువుగా ఉన్నట్టు నటిస్తూంటాడు. శ్వేత డివోర్స్ తీసుకున్నందుకు కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేస్తాడు. శ్వేత, రాజ్‌లు ఇద్దరూ తినిపించుకుంటారు. ఆ తర్వాత కావ్య.. తన బావకు తినిపిస్తుంది. బావ కూడా కావ్యకు తినిపిద్దామని ఆగిపోతాడు. పర్వాలేదు బావా.. మా ఆయనది బ్రాడ్ మైండ్.. అబ్రాడ్‌లో చదువుకున్నాడు అని చెప్తుంది. నెక్ట్స్ ఇద్దరూ కేక్ తినిపించుకుంటూ.. పాత జ్ఞాప‌కాల్ని గుర్తు తెచ్చుకుంటారు.

కావ్య – బావ చిలిపి చేష్టలు.. ఉక్రోశంలో రాజ్..

రాజ్ ఉడుక్కోవడం చూసి.. కావ్య మరింత డోస్ పెంచుతుంది. మేము బయటకు వెళ్తామని కావ్య.. రాజ్‌తో అంటుంది. మీరు బయట షికార్లు చేస్తే.. ఇక్కడ పని ఎవడు చేస్తాడు కుదరదని రాజ్ ఖచ్చితంగా చెప్పేస్తాడు. ఎందుకు కుదరదు.. నేను మా బావతో షికారు చేస్తే.. మీరేమన్నా జెలసీ ఫీల్ అవుతారా అని కావ్య అడుగుతుంది. అలాంటిదేమీ లేదని కవర్ చేసుకుంటాడు రాజ్. మీరు పర్మిషన్ ఇవ్వకుంటే జాబే మానేస్తా అని కావ్య అంటుంది. దీనికి రాజ్ షాక్ అవుతాడు. నీది ఎంత మంచి మనసు బుజ్జీ.. నా కోసం జాబ్ వద్దనుకుంటున్నావా.. అని పొగడ్తల వర్షం ముంచెత్తుతాడు. ఆ తర్వాత చివరకు రాజ్ పర్మిషన్ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు.

దిగాలుగా ధాన్య లక్ష్మి – అనామికలు..

ఈ సీన్ కట్ చేస్తే.. అనామిక, ధాన్య లక్ష్మిలు దిగాలుగా.. మౌనంగా హాలులో కూర్చుంటారు. వారిని చూసిన రుద్రాణి.. అయ్యయ్యో ఏంటి ధాన్య లక్ష్మి ఇంత మౌనంగా కూర్చున్నారు అంటూ తన మాటలతో దెప్పిపొడుస్తుంది. అధికారం కోసం విప్లవం రాజేసి.. పెద్దరికం ఐ డోంట్ కేర్ అనేసరికి.. రాజీకి రాలేక.. పుట్టింటికి పోలేక.. చెప్పుకోవడానికి ఎవరూ లేక.. గుండెల్లో అగ్ని పర్వతాన్ని మోస్తున్నారా! నువ్వు ఎంత ప్రయత్నం చేసినా.. నీ తోడి కోడలు కంచు.. కదలదు.. బెదలదని రుద్రాణి అంటుంది. ఇప్పుడేం చేయాలో మేము బుర్రలు బద్ధలు కొట్టుకుంటే.. నువ్వేంటి? మధ్యలో.. నీ చెప్పుడు మాటలు వినే కదా పరువు తీసుకున్నాం. తెగేదాకా లాగకూడదని లేకపోతే వాటాలు దాకా వెళ్లేదాన్ని అని ధాన్య లక్ష్మి అంటుంది.

ఇవి కూడా చదవండి

రుద్రాణికి ఝలక్ ఇచ్చిన స్వప్న..

వాటాల దాకానా.. వాటాలు వేసుకుని వేరు పడితే చివరికి ఈ ఇంటికే పనిమనుషులుగా తిరిగొస్తారు. మీ ఆయనకి మతి మరుపు.. కళ్యాణ్‌కి ఏమో కవితల పిచ్చి.. ఇచ్చిన ఆస్తిని కూడా పోగొట్టుకుని మళ్లీ ఇక్కడికే రావాల్సిన పరిస్థితి వస్తుంది. సుభాష్ అన్నయ్య ఉన్నాడు కాబట్టి.. తమ్ముడి మీద మమకారంతో ఇప్పటిదాకా లాక్కొస్తున్నాడు. అలా కాకుండా.. అపర్ణ వదినకు కావ్య, మీ అత్తకి అపర్ణ వదినల మధ్య చిచ్చు పెడితే సరిపోతుందని ఐడియా ఇస్తుంది. అప్పడే స్పప్న వచ్చి రుద్రాణికి ఝలక్ ఇస్తుంది. అపర్ణ గారూ కానీ, కావ్య కానీ ఎప్పుడూ ఎవర్నీ తక్కువగా చూడలేదు. ఇలా మందర మాటలు వింటే.. మీరే నష్టపోతారు. ఈ సోది ఆపి.. ముందు అర్జెంట్‌గా నాకు జ్యూస్ తీసుకురా అని అత్తకు చెప్తుంది స్వప్న.

అపార్థం చేసుకుంటే ఈ ప్రయత్నమే బెడిసి కొడుతుంది..

ఇక కారులో కావ్య, బావ బయటకు వెళ్తూ ఉంటారు. మీ ఆయన శ్వేతను పెళ్లి చేసుకుంటాను అని ఇన్ డైరెక్ట్‌గా చెప్తున్నాడని అంటాడు బావ. వాళ్ల మధ్య ఉంది కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే బావా. నాకు దూరం అవ్వడానికి మాత్రమే శ్వేతను అడ్డం పెట్టుకుంటున్నారు అని కావ్య చెప్తుంది. కానీ మీ ఆయనకు నీ మీద చాలా ప్రేమ ఉంది. మనిద్దరినీ చూసి తట్టుకోలేకపోతున్నాడని బావ అంటే.. నా కాపురాన్ని నిలబెట్టుకోవడానికే ఈ డ్రామా ఆడుతున్నాను కావ్య అంటుంది. కానీ నీ మీద రాజ్ అనుమాని పడి.. మనిద్దరి స్నేహాన్ని అపార్థం చేసుకుంటే మన ప్రయత్నం బెడిసికొడుతుందేమో అని బావ అంటాడు. చూడాలి ఇది నిజంగానే కత్తి మీద సాము లాంటిది. అమ్మమ్మగారి సపోర్ట్ ఉంది కాబట్టి.. నేను కూడా ఈ సాహసానికి పూనుకున్నా. దొరికిపోకుండా మనం జాగ్రత్తగా నాటకం ఆడాలి అని ఇద్దరూ మాట్లాడుకుంటారు.

రాజ్ రుసరుసలు.. కావ్య మీద ప్రేమ ఉందన్న శ్వేత.

చూశావా నేను అనుకున్నట్టే జరిగింది. వాళ్లు డ్రైవర్‌ని తీసుకెళ్లకుండానే వెళ్లారు. అలా ఎలా వెళ్తారు అని రాజ్ కారాలూ మిరియాలు నూరుతాడు. ఎందుకు వెళ్ల కూడదని శ్వేత అంటుంది. నేను ఉన్నా కదా.. నా ముందే తన బావతో షికారుకు వెళ్తుందా? అని రాజ్ అంటే.. ఏ నువ్వు నా ముందే కావ్యతో తిరుగుతున్నావ్ కదా. నువ్వేమన్నా తక్కువ చేస్తున్నావా.. నన్ను పెళ్లి చేసుకుంటున్నావ్ అని నీ భార్యతో చెప్పలేదా.. ఇంక ఎవరితో తిరిగితే నీ కెందుకు అలా అనుకోవచ్చు కదా అని శ్వేత అంటుంది. నువ్వెందుకు కళావతిలా లా పాయింట్లు మాట్లాడుతున్నావ్ అని రాజ్ అంటాడు. కానీ దుగ్గిరాల వంశానికి ఓ చరిత్ర ఉంది. నా భార్య ఇంకొకరితో తిరిగితే నా పరువు ప్రతిష్ట ఏం అవుతుందని రాజ్ అంటాడు. కావ్య మీద నీకు ప్రేమ ఉంది.. కానీ నీ అహం అడ్డు వస్తుంది. నాది ప్రేమ కాదని.. నిరూపించుకుంటా. ఇప్పుడే ఇంటికి వెళ్లి కళావతి తన బావతో తిరుగుతుందని చెప్తా అని రాజ్ అంటాడు. రాజ్.. నువ్వు మరీ దిగజారి పోతున్నావ్ అని శ్వేత చెప్తున్నా రాజ్ పట్టించుకోడు. నాతో కావ్య విడిపోవడం నాకు కావాలి అని రాజ్ ఇంటికి వెళ్తాడు.

రాజ్ కంప్లైంట్.. ఇందిరా దేవి షాక్..

మరోవైపు.. కనకం, కృష్ణమూర్తిల కామెడీ అదిరిపోతుంది. చాలా కోపంగా రాజ్ ఇంటికి వెళ్తాడు. అక్కడ బయట బాల్కానీలో పెద్దావిడ కూర్చుని ఉంటుంది. సైలెంట్‌గా ఇందిరా దేవి దగ్గరకు వెళ్లి కూర్చుంటాడు. ఏంట్రా మనవడా.. సగం కాలిన పెసరట్టులా రుసరుసలాడుతున్నావ్ ఏంటి? అని పెద్దావిడ అడుగుతుంది. నీ మనవరాలు పక్కన ఉంటే.. పెనం మీద కాదు నేరుగా స్టవ్ మీద కూర్చున్నట్టే ఉంటుంది. నా మనవరాలికి అన్ని తెలివి తేటలు ఉంటే.. మీ అమ్మ, నీతో ఎందుకు తిట్లు తింటుంది. సరేలే అంత పని నా మనవరాలు ఏం చేసిందని అంటుంది పెద్దావిడ. ఫారిన్ నుంచి వాళ్ల బావ వస్తే.. ఆఫీస్ ఎగ్గొట్టి వెళ్లిపోయింది. మన పరువు ఏం కావాలి అని రాజ్ అంటాడు. అవును అలా తిరిగితే పరువు పోతుంది కదా.. అందుకే ఇంటికి తీసుకొచ్చిందని ఇందిరా దేవి షాక్ ఇస్తుంది. ఏంటి ఇంటికి తీసుకొచ్చిందా.. అని రాజ్ బిత్తర పోతాడు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.