AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmamudi, February 22nd episode: పెద్దావిడ డ్రామా షురూ.. కక్కలేక మింగలేక రాజ్ కష్టాలు..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్యను వదిలించుకుందామని చూస్తున్న రాజ్‌కు బుద్ధి చెప్పేందుకు ఇందిరాదేవి, కావ్యలు కలిసి మాస్టర్ ప్లాన్ వేస్తారు. ఈ క్రమంలోనే కావ్య బావను రంగంలోకి దించుతారు. అనుకున్నట్టుగానే.. కావ్య, కావ్య బావలు కలిసి ప్లాన్ మొదలు పెడతారు. కావ్య బావ రావడం.. కళావతితో క్లోజ్‌గా ఉండటంతో రాజ్‌లో మంట మొదలవుతుంది. దీంతో ఏం చేయాలో తెలీక ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవతూ ఉంటాడు. నువ్వు ఎలాగో కావ్యను వదిలించుకుందాం అనుకుంటున్నావ్ కదా..

Brahmamudi, February 22nd episode: పెద్దావిడ డ్రామా షురూ.. కక్కలేక మింగలేక రాజ్ కష్టాలు..
Brahmamudi
Chinni Enni
|

Updated on: Feb 22, 2024 | 11:26 AM

Share

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్యను వదిలించుకుందామని చూస్తున్న రాజ్‌కు బుద్ధి చెప్పేందుకు ఇందిరాదేవి, కావ్యలు కలిసి మాస్టర్ ప్లాన్ వేస్తారు. ఈ క్రమంలోనే కావ్య బావను రంగంలోకి దించుతారు. అనుకున్నట్టుగానే.. కావ్య, కావ్య బావలు కలిసి ప్లాన్ మొదలు పెడతారు. కావ్య బావ రావడం.. కళావతితో క్లోజ్‌గా ఉండటంతో రాజ్‌లో మంట మొదలవుతుంది. దీంతో ఏం చేయాలో తెలీక ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవతూ ఉంటాడు. నువ్వు ఎలాగో కావ్యను వదిలించుకుందాం అనుకుంటున్నావ్ కదా.. ఎవరితో తిరిగితే నీకేంటి? అని శ్వేత కూడా వారిస్తుంది. అయినా రాజ్‌కు తెలియకుండా ఇరిటేట్ అవుతూ ఉంటాడు.

ఇలాగే కావ్య, కావ్య బావ కారులో బయటకు వెళ్తారు. దీంతో మరింత జెలసీ ఫీల్ అవుతాడు రాజ్. కావ్య వాళ్ల బావతో తిరుగుతోందని చెప్పి.. ఇంట్లో గొడవ చేద్దాం అనుకుంటాడు. కానీ అప్పటికే పెద్దావిడ ప్లాన్ ప్రకారం..కావ్య, కావ్య బావలు దుగ్గిరాల ఇంటికి వెళ్తారు. వెళ్లి ఇందిరా దేవికి కంప్లైంట్ ఇస్తాడు. బటయ తిరిగితే అందరూ అలా అనుకుంటారనే.. ఇక్కడికే వచ్చారురా అని పెద్దావిడ షాక్ ఇస్తుంది. భోజనం చేస్తున్నారు పదా.. వెళ్దాం అని వెళ్తారు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. కావ్య, కావ్య బావను చూసిన రాజ్ మరింత జెలసీ ఫీల్ అవుతాడు.

ఆ తర్వాత అందరూ కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. స్వప్న వడ్డిస్తూ ఉంటుంది. అవును బావ.. నువ్వు ఎక్కడ స్టే చేస్తున్నావ్ అని అడుగుతుంది. బయట హోటల్‌లో ఉంటున్నా అని చెప్తాడు బావ. అదేంటి.. ఈ ఇంటి కోడలు బంధువు మాకూ బంధువే కదా.. బయట హోటల్‌లో ఉండటం ఏంటి? ఈ ఇంట్లోనే ఉండు అని ఇందిరా దేవి ఝలక్ ఇస్తుంది. పెద్దావిడ మాటలకు రాజ్ లోపల తిట్టుకుంటూ ఉంటాడు. ఇక్కడెందుకు నాన్నమ్మా.. అని అంటాడు. నేను ఉండటం అన్నయ్యకు ఇబ్బందిగా ఉందేమో.. అని అంటాడు కావ్య బావ. అలాందేమీ లేదు బాబూ.. ఏరా రాజ్ నీవ్వేం అంటావ్ అని ఇందిరా దేవి అడిగితే.. ఒప్పుకోలేక.. ఓకే చెప్తాడు రాజ్.

ఇవి కూడా చదవండి

భోజనం చేశాక.. కావ్య, కావ్య బావ, ఇందిరా దేవి గెస్ట్ రూమ్‌కి వెళ్తారు. నాకెందుకో ఇబ్బందిగా ఉందండి.. మేము చేసేది తప్పు అనిపిస్తుంది. అన్నయ్య అనుమాన పడితే ఏం జరుగుతుందో అని కావ్య బావ అంటాడు. నా మనవరాలికి మోసం జరుగుతుంటే.. న్యాయం చేస్తున్నాం అని పెద్దావిడ అంటే.. మీరు చెప్తుంది నిజమే అమ్మమ్మ గారూ.. కానీ ఈ విషయం అందరికీ తెలిస్తే.. ఏం అవుతుందా అని నాకు కంగారుగా ఉందని కావ్య అంటుంది. ధర్మాన్ని గెలిపించడానికి.. కొన్ని సార్లు అధర్మమైన మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. అయినా విషయం బయటకు వస్తే రాజ్‌ని తప్పు బడతారు అని చెప్తుంది ఇందిరా దేవి. ఇలా ఈ రోజు ఎపిసోడ్‌ ప్రోమో రిలీజ్ అయింది.