Brahmamudi, November 28th episode: అప్పూపై బయటపడిన కళ్యాణ్ ప్రేమ.. అరుణ్ కోసం కావ్య వేట!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కళ్యాణ్ తో అప్పూ పెళ్లి చేయాలని సలహా ఇమ్మని అక్క అన్నపూర్ణని అడుగుతుంది కనకం. ఇది విన్న అన్నపూర్ణ అమ్మో ఇంకేమైనా ఉందా.. ఈ విషయం నీ మొగుడికి తెలిస్తే.. నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు. అస్సలు తెలీనివ్వకు. అయినా నీకైమైనా మతి పోయిందా.. ఇప్పటికే నీ వల్ల కావ్య అందరికీ మాటలు పడుతుంది. అలాగే నిన్ను కూడా ఎన్నెన్ని మాటలు అంటున్నారో మర్చి పోయావా.. ఇప్పుడు అప్పూని అక్కడికి పంపిస్తావా అని తిడుతుంది అన్న పూర్ణ. కానీ అప్పూ ఎప్పటికీ సంతోషంగా ఉండదని.. అప్పూ ఆశ పడుతుంది..

Brahmamudi, November 28th episode: అప్పూపై బయటపడిన కళ్యాణ్ ప్రేమ.. అరుణ్ కోసం కావ్య వేట!
Brahmamudi
Follow us
Chinni Enni

|

Updated on: Nov 28, 2023 | 11:06 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కళ్యాణ్ తో అప్పూ పెళ్లి చేయాలని సలహా ఇమ్మని అక్క అన్నపూర్ణని అడుగుతుంది కనకం. ఇది విన్న అన్నపూర్ణ అమ్మో ఇంకేమైనా ఉందా.. ఈ విషయం నీ మొగుడికి తెలిస్తే.. నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు. అస్సలు తెలీనివ్వకు. అయినా నీకైమైనా మతి పోయిందా.. ఇప్పటికే నీ వల్ల కావ్య అందరికీ మాటలు పడుతుంది. అలాగే నిన్ను కూడా ఎన్నెన్ని మాటలు అంటున్నారో మర్చి పోయావా.. ఇప్పుడు అప్పూని అక్కడికి పంపిస్తావా అని తిడుతుంది అన్న పూర్ణ. కానీ అప్పూ ఎప్పటికీ సంతోషంగా ఉండదని.. అప్పూ ఆశ పడుతుంది.. దాని కోసమైనా ఏదైనా చేద్దామని ప్లాన్ వేయాలనుకుంటుంది కనకం. నువ్వు మళ్లీ మొదటికి వచ్చావ్ వద్దు అని అన్న పూర్ణ హెచ్చరిస్తుంది.

అప్పూ కోసం ప్లాన్ సిద్ధం చేస్తోన్న కనకం.. కృష్ణ మూర్తి ఫైర్:

అప్పుడే వచ్చిన కృష్ణ మూర్తి ఇదంతా విని.. కనకంపై ఉవ్వెత్తున లేస్తాడు. ఏం మాట్లాడుతున్నావే.. దీన్ని కూడా ఆ ఇంటికే కోడలిగా పంపుతావా.. నువ్వు అసలు ఆడదానివేనా.. మళ్లీ అబద్ధాలు.. మాయలు.. మోసాలు మొదలు పెడతావా.. ఇప్పుడు పడిన కష్టం చాలాదా.. ఆ ఇంటికి వెళ్తుంటే నిన్నూ నన్ను పురుగుల్లా చూస్తున్నారు. ఈ విషయం తెలిస్తే మనల్ని అక్కడికి రానివ్వరు కదా.. అక్కడున్న వారిద్దర్ని కూడా కొట్టి పుట్టింటికి తరిమేస్తారు. దౌర్భాగ్యురాలా.. ఎంత ధైర్యమే నాకు.. ఇంటి పెత్తనం ఇస్తే.. ఒకసారి ఇంటినే తాకట్టు పెట్టావ్.. ఇప్పుడు కుటుంబాన్ని రోడ్డున పడేస్తావా.. అప్పూ గురించి నాకు తెలుసు. దానికి చెప్పడం మానేసి.. నువ్వే గాలిలో మేడలు కడుతున్నావా అని సీరియస్ అవుతాడు కృష్ణ మూర్తి.

స్వప్న కంగారు.. కావ్య చివాట్లు:

ఈ సీన్ కట్ చేస్తే.. స్వప్న అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అప్పుడే వచ్చిన కావ్య.. స్వప్నకి చివాట్లు పెడుతుంది. కానీ స్వప్న అసలే చిరాకులో ఉన్నాను.. ఇంకా చికాకు పెట్టకు అని అంటుంది. నీ సమస్య కూడా నాది అని ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావ్ అక్కా.. నువ్వు ఏ తప్పు చేసినా.. అది నా మెడకు కూడా చుట్టుకుంటుంది. నీతో పాటు నన్ను కూడా తప్పు పడతారని కావ్య అంటుంది. అయితే ఇప్పుడు అందరి దగ్గరకు వెళ్లి.. కావ్య తప్పు లేదని బ్రతిమలాడమంటావా.. అని స్వప్న అంటుంది. నేను మాట్లాడుతుంటే నీకు కోపం వస్తుంది కానీ.. నువ్వు ఎంత ధీనమైన స్థితిలో ఉన్నావో తెలుసా అని కావ్య అంటే.. తెలుసని స్వప్న అంటుంది.

ఇవి కూడా చదవండి

నా కోసం పెళ్లి క్యాన్సిల్ చేశాడు.. ఇలా ఎలా చేస్తాడు: స్వప్న

తెలీదు నీకు తెలీదు.. నువ్వు కడుపుతో ఉన్న విషయం తెలియగానే తల్లితో పాటు చుట్టూ ఉన్న వాళ్లు కూడా ఎంత సంతోషిస్తారో తెలుసా.. కానీ నువ్వు ఈ విషయం చెప్పగానే.. అందరూ అయోమయంలో ఉన్నారు. నువ్వు అరుణ్ కి డబ్బులు ఇచ్చిన విషయం చెప్తే.. నాకే నమ్మకం కలగడం లేదు. ఇక ఇంట్లో వాళ్లకు ఎందుకు నమ్మకం కలుగుతుంది. ఆ అరుణ్ విషయంలో నువ్వు ఏం చేసినా.. చెప్పమని చెప్పాను కదా.. మరి నాకు తెలీకుండా నువ్వు ఎందుకు డబ్బులు ఇచ్చావ్.. అని కావ్య అడుగుతుంది. డబ్బులు ఇస్తే వాడు నా జోలికి రాడు అనుకున్నా.. డబ్బులు ఇస్తే నువ్వు దోషివి అవుతావ్ కదా ఆ లాజిక్ ఎందుకు ఆలోచించలేదు అక్కా అని కావ్య ప్రశ్నిస్తుంది. అయినా వాడు అలా చేస్తాడని నేను కల కన్నానా.. అయినా వాడు కాలేజ్ డేస్ నుంచి తెలుసు. నన్ను ప్రేమించి, ఇంట్లో వాళ్లను ఒప్పించి, పెళ్లి వరకూ తీసుకొచ్చాడు. కానీ నాకు ఇష్టం లేదని చెప్పగానే పెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు. ఆ తర్వాత రాహుల్ పెళ్లి ఆపడానికి నేను కడుపుతో ఉన్నట్టు ఫేక్ సర్టిఫికేట్ కూడా ఇచ్చాడు. అలాంటి వాడు ఇలా చేస్తాడని నువ్వు మాత్రం నమ్ముతావా అని కావ్యని అడుగుతుంది స్వప్న.

అరుణ్ వెనుక ఎవరో ఉన్నారని కనిపెట్టిన కావ్య:

అవును నువ్వు చెప్పింది కూడా కరెక్టే అక్కా.. మరి ఎందుకు వాడు ఇలా మారాడు.. వాడే మారాడా.. వాడి వెనక ఇంకెవరైనా ఉన్నారా.. తెలుసుకోవాలి.. అప్పటి వరకూ నువ్వు ఇంకేం పిచ్చి పని చేయకు.. అలాగే నీ ఆరోగ్యం గురించి కూడా సరిగ్గా చూసుకో. ఈ సమయంలో ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండు.. అలాగే ఈ విషయం అమ్మ వాళ్లకు చెప్పావా అని కావ్య అడుగుతుంది. ఏం చెప్పమంటావ్.. ఈ కడుపు మా ఆయన వల్ల వచ్చింది కాదని.. మా అత్తారింట్లో గొడవలు జరుగుతున్నాయని చెప్పమంటావా అని స్వప్న అడిగితే.. అలా అని చెప్పకుండా ఉంటావా.. సరేలే నేనే చెప్తాను అని కావ్య అంటుంది. వద్దు తల్లి.. నువ్వు చెప్పడం.. ఆవిడే ఏదేదో ఊహించుకుని వచ్చి మళ్లీ ఇక్కడ గొడవ చేయడం అవసరమా.. నేనే టైమ్ చూసుకుని చెప్తాను అని స్వప్న అంటుంది.

కావాలనే అక్కని ఇరికించడానికి ఎవరో ఇదంతా చేశారు: కావ్య

ఇక కావ్య స్వప్న గది నుంచి బయటకు వస్తుంది. కావాలనే అక్కని ఇరికించాలని చేసినట్టు ఉంది.. అలా చేస్తే వాడికి వచ్చిన లాభం ఏంటి? అని ఆలోచిస్తుండగా.. అప్పుడే రాహుల్, రుద్రాణిలు మాట్లాడటం గమనించి.. అక్కడికి వస్తుంది. ఏంటి రుద్రాణి గారూ.. ఫాలో అవ్వాలి అంటున్నారు. మా ఆయన్ని ఫాలో అవ్వమని చెబుతున్నారా అని కావ్య అంటే.. నాకు ఎవ్వర్నీ ఫాలో అవ్వాల్సిన పని లేదు.. నా టాలెంట్ నాకు ఉందని రాహుల్ అంటాడు. అవునవును.. సొంత బ్రాంచ్ ఇస్తే దాన్ని లాస్ చేసి.. ఇప్పుడు ఎంప్లాయిగా పని చేయడం అంటే మామూలు విషయం కాదు. దానికి చాలా టాలెంట్ కావాలి అని అంటుంది కావ్య. నా కొడుకు సంగతి తర్వాత.. ముందు మీ అక్క గురించి ఆలోచించుకో.. దాని లాగా ఇంకొకరితో కడుపు చేసుకుని ఇంకొకరి నెత్తి మీద రుద్దాలని చూస్తుంది. అంత టాలెంట్ అయితే మాకు లేదు.

అరుణ్ కోసం వేట మొదలు పెట్టిన కావ్య:

మా అక్క క్యారెక్టర్ గురించి మీరు చెప్తే తెలుసుకునే స్టేజ్ లో నేను లేనులే. తన గురించి బాగా తెలుస అని కావ్య అంటుంది. అవునవును ఇద్దరూ కలిసి లేని కడుపును ఉన్నట్టు నటించారు కదా.. బాగా తెలిసి ఉంటుందిలే. అన్నీ తెలిసి కాబట్టే అడుగుతున్నాను.. అరుణ్ కి మా అక్క డబ్బులు ఇచ్చిన సంగతి మీకెలా తెలుసని రుద్రాణి, రాహుల్ ని అడుగుతుంది కావ్య. దీంతో వారిద్దరూ ఒకరి మొఖాలను మరొకరు చూసుకుంటారు. అరుణే నాకు ఆ ఫొటోలను పంపించాడు.. కావాలంటే ఫోన్ నెంబర్ వాట్సాప్ చేశా చూస్తో అని చెప్తాడు రాహుల్. వాడి నెంబర్ ఎందుకు ఇచ్చావు రా అని రుద్రాణి అంటే.. ఏం కాదులే మామ్.. అని రాహుల్ అంటాడు. అది కావ్య రా.. ఆ నెంబర్ తో వాడి దాకా వెళ్లి నిజం రాబడితే.. ఈలోపు నువ్వు వాడిని జాగ్రత్తగా ఉండమని చెప్పు అని రుద్రాణి అంటుంది. ఇక నెంబర్ చూసి.. ఇది అరుణ్ నెంబరే. అరుణే.. రాహుల్ కే ఫొటోస్ పంపించాడన్న మాట. వాడిని పట్టుకుంటే మాత్రం ఇదంతా ఎందుకు చేశాడో తెలీదు.. పట్టుకుంటాను అని కావ్య అనుకుంటుంది.

నాకు అప్పూనే గొప్ప అని చెప్పేసిన కళ్యాణ్:

ఈ సీన్ కట్ చేస్తే.. కళ్యాణ్, అనామికలు ఇద్దరూ కలిసి కారులో వెళ్తూ ఉంటారు. ఓల్డ్ సిటీలో షాపింగ్ చేయాలి అంటే అప్పూ ఎందుకు.. నాకు అన్నీ తెలుసు కళ్యాణ్.. అని అనామిక అంటే.. మనకు షాప్స్ మాత్రమే తెలుసు. కానీ మన బ్రోకి అక్కడ మనుషులు కూడా తెలుసు. ఎవరితో మాట్లాడాలో అలానే మాట్లాడుతుంది. నిన్నూ నన్నూ చూస్తే 10 రూపాయల వస్తువు.. 100కి ఇస్తాడని కళ్యాణ్ అంటాడు. అంటే మనం అంత రిచ్ గా కనిపిస్తామ్.. అప్పూ అలా కనిపించదని చెప్తున్నావా.. అని అనామిక అంటే.. మనల్ని చూస్తే అమాయకులు వచ్చారు మోసం చేద్దాం అనిపిస్తుంది. అదే బ్రోని చూస్తే.. భయపడైనా నిజం చెప్తాడు. 10 గంటలు చేసే షాపింగ్.. కేవలం రెండు గంటల్లోనే అయిపోతుందని అంటాడు కళ్యాణ్. నీకు ఎప్పుడూ అప్పూనే గొప్ప కదూ అని అనామిక అంటే.. అలానే అనుకో ఎందుకుంటే.. ఈ ఏంజల్ ని నా లైఫ్ లోకి కారణం రావడానికి కారణం తనే కదా అని అంటాడు కళ్యాణ్. కవి గారు కదా మాటలతో మాయ చేస్తారని అనామిక అంటుంది.

అప్పూ కోసం ఇంటికి వచ్చిన కళ్యాణ్:

ఇక పరధ్యానంగా ఉన్న కనకం దగ్గరకు అన్న పూర్ణ వచ్చి.. ఏంటే ఇంకా కృష్ణ మూర్తి మాటల గురించి ఆలోచిస్తున్నావా అని అంటే.. లేదు అప్పూ అంతగా కళ్యాణ్ ని ప్రేమించిందని తెలిసి.. తల్లిగా ఏం చేయలేక పోతున్నా అని కనకం అంటుంది. అప్పుడే కళ్యాణ్ వచ్చి.. అప్పూని అడుగుతాడు. అది గదిలో ఉంది బాబూ.. ఈ మధ్య అసలు ఏదో దిగాలుగా ఉంటుంది.. ఏంటో నువ్వైనా కనుక్కో బాబూ అని అంటుంది కనకం. గదిలో చీకట్లో కూర్చుంటుంది అప్పూ.. ఏది బ్రో ఇది నువ్వేనా.. ఇంత చీకట్ల కూర్చున్నావ్.. ఎప్పుడూ ఉషారుగా ఉండే నువ్వు.. ఇలా మారి పోయావేంటి బ్రో.. నీకు చీకటి అంటే ఇష్టం ఉండదు కదా.. అని అంటాడు.

నువ్వు బాధ పడుతూ ఉంటే.. నేను ఎలా ఎంజాయ్ చేస్తాను:

ప్రతి దానికి కారణం ఉండాలా.. ఇలా ఉండాలి అనిపించింది ఉంటున్నా అని అప్పూ అంటే.. నాకు నచ్చడం లేదని కళ్యాణ్ అంటాడు. అంటే నీకు నచ్చినట్టు ఉండాలా.. నా కోసం కాకపోయినా.. మీ అమ్మ గారి కోసమైనా ఉండొచ్చు కదా అని కళ్యాణ్ అంటాడు. అందరికీ నచ్చినట్టు ఉండబట్టే ఇలా మిగిలి పోయాను అని అప్పూ అంటాడు. లేచి బయటకి రా వెళ్దాం.. రా నువ్వు రా చెప్తాను అని కళ్యాణ్ బయటకి లాక్కొస్తాడు. నేను బాధ పడితే.. ఏడిస్తే నీకేంది రా భయ్ అని అప్పూ అంటే.. ఏంటి బ్రో నేను నీ ఫ్రెండ్ ని అలా ఎలా వదిలేస్తాను. నువ్వు ఇలా ఇంట్లోనే ఉంటే.. డిప్రెషన్ లోకి వెళ్తావ్.. నాతో అలా బయటకు రా.. అనామిక కూడా వచ్చింది. ముగ్గురం కలిసి ఓల్డ్ సిటీకి వెళ్లి షాపింగ్ చేసి.. చార్మి దగ్గర ఛాయ్ తాగితే డిప్రెషన్ అంతా పోతుందని కళ్యాణ్ అంటాడు. నేను డిప్రెషన్ లో ఉన్నానని నేను నీతో చెప్పానా.. నీ హెల్ప్ కావాలని నేను అడిగానా.. ఎందుకు విసిగిస్తున్నావ్.. నువ్వు వెళ్లి అనుకుంటే వెళ్లు.. అంతే కానీ నేను ఎక్కడికీ రాను అని అప్పూ అంటే.. నువ్వు వస్తేనే కానీ నేను వెళ్లను అని కళ్యాణ్ అంటాడు. వెళ్లకు ఇక్కడే కూర్చో అని లోపలికి వెళ్తుంది. కానీ కళ్యాణ్ మాత్రం అప్పూని పట్టుకుని కూర్చోబెట్టి.. ఏంటి బ్రో.. మనం ఎంత హ్యీపీగా ఉన్నాం.. ఇంతకు ముందు ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో.. నేనూ అలానే ఉండేవాడిని.

నేనేమన్నా పిచ్చిదాన్నా.. కారులో వెయిట్ చేయడానికి అనామిక ఫైర్:

కానీ నువ్వు పరిచయం అయ్యాకే నిజమైన ప్రపంచం ఏంటో తెలిసింది. అమ్మ వేలు పట్టుకుని నడక నేర్పించినట్టు నువ్వు.. నా చేయి పట్టుకుని ఇంటి నుంచి బయటకు తీసుకొస్తావ్.. కష్టం వస్తే తోడుగా ఉండాలని చెప్పావ్.. కన్నీళ్లు వస్తే నేను ఉన్నానని పక్కన నిలబడ్డావ్.. ఇన్ని చేసిన నువ్వు.. ఇలా ఉంటే నిన్ను వదిలి నేను ఎలా వెళ్లి పోతాను అనుకున్నావ్.. బ్రో నామాట విను.. నాతో బయటకు రావా వెళ్దాం.. పక్కాగా చెబుతున్నా.. నువ్వు బెటర్ గా ఫీల్ అవుతావ్.. నువ్వు ఇక్కడ బాధగా కూర్చుంటే నేను వెళ్లి ఎలా ఎంజాయ్ చేయగలుగు తాను. ఎక్కడికి వెళ్లినా నువ్వే గుర్తొస్తావ్ అని కళ్యాణ్ చెబుతుండగా.. చాలా బావుంది కళ్యాణ్.. నన్ను రోడ్లో నిల్చోబెట్టి నువ్వు నీ ఫ్రెండ్ తో ముచ్చట్లు చెబుతున్నావా అని అనామిక అంటుంది. అదేంటి అనామిక అలా అంటున్నావ్ పాపం అప్పూ ఫీల్ అవుతుంది. అంటే నువ్వు నీ ఫ్రెండ్ ఫీలింగ్స్ అర్థం చేసుకున్నావ్ కానీ.. నా ఫీలింగ్స్ అర్థం చేసుకోవా.. నేనేమన్నా పిచ్చిదాన్నా కారులో వెయిట్ చేయడానికి అని అనామిక అంటుంది. ఇప్పటివరకూ నా కోసమే అందరూ వెయిట్ చేశారు. కానీ నేను ఎవరి కోసం వెయిట్ చేయలేదని సీరియస్ అవుతుంది అనామిక.