Bigg Boss Telugu: అందుకే నా భర్తతో విడిపోయా.. బిగ్‌బాస్‌లోకి రావడానికి కారణమిదే: దివ్వల మాధురి
బిగ్ బాస్ తెలుగు సీజన్ మూడో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా దివ్వల మాధురి ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా భర్తతో విడిపోవడం, దువ్వాడ శ్రీనివాస్ తో కలిసుండడం తదతర విషయాలపై ఓపెన్ అయ్యిందామె. అలాగే బిగ్ బాస్ కు రావడానికి గల కారణాన్ని కూడా వెల్లడించింది.

మూడో వైల్డ్ కార్డ్‌గా దివ్వెల మాధురి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది దివ్వెల మాధురి. ‘ఆకాశంలో ఆశల హరివిల్లు’ అనే పాటతో ఎంట్రీ ఇచ్చిన ఆమె చిన్నప్పటి నుంచి తాను ఎదుర్కొన్న కష్టాలు, ఇబ్బందులను చెబుతూ ఎమోషనల్ అయ్యింది. ‘ఇంటర్మీడియట్ లో ఉండగానే నాకు పెళ్లయిపోయింది. ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. కానీ మొదటి నుంచి భర్తతో నాకు అండర్ స్టాండింగ్ తక్కువ. అర్థం చేసుకోవడానికి చాలా ట్రై చేశాను. కానీ కుదర్లేదు. అందుకే మా ఆయనతో విడిపోవాల్సి వచ్చింది. గత నాలుగేళ్ల నుంచి మాత్రం శ్రీనివాస్ అంటే మాధురి, మాధురి అంటే శ్రీనివాస్‌గా జీవిస్తున్నాం. కానీ ప్రతిరోజూ సోషల్ మీడియాలో నా గురించి వస్తున్న కామెంట్స్ చూస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది. చివరికి నా కూతుళ్లను కూడా ట్రోల్ చేస్తున్నారు. జీవితంలో చాలా నెగెటివిటీని చూశాను. సమాజం ఒక వైపు, నేను మొత్తం ఒక వైపు అన్నట్లు సాగింది. నా గురించి నిజం తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడుతున్నాను’ అని చెప్పుకొచ్చింది మాధురి.
ఈ సందర్భంగా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరు బెస్ట్ అని నాగార్జున మాధురిని ప్రశ్నించగా ఇమ్మాన్యుయేల్ బెస్ట్ అని ఆన్సరిచ్చింది. ఇక మిగిలిన వాళ్లందరూ మాస్క్‌లు పెట్టుకుని ఉంటున్నారని చురకలు అంటించింది. కాగా మాధురికి గోల్డెన్ బజర్ పవర్ స్టోన్ ఇచ్చారు. దీనిని ఉపయోగించి ఓ ఎలిమినేషన్‌ని రద్దు చేసే అవకాశముంది అని నాగార్జున చెప్పాడు. అయితే దీనిని ఎప్పుడు ఉపయోగించాలన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
నా గురించి అందరికీ తెలియాలనే..
Grace with grit. Fire with flair. 💫#DuvvadaMadhuri walks into the Bigg Boss house to set Season 9 ablaze with her unstoppable energy! 🔥⚡#BiggBossFireStorm
Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar pic.twitter.com/jo9bDhTYXG
— Starmaa (@StarMaa) October 12, 2025
తనపై ఉన్న నెగెటివిటీని పోగొట్టుకోవడానికే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నానని మాధురి చెప్పుకొచ్చింది. మరి ఆమె లక్ష్యం ఏ మేర నెరవేరుతుందో చూడాలి.. లెట్స్ వెయిట్ అండ్ సీ.. అంతకు ముందు మాధురికి ఆల్ ద బెస్ట్ చెబుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు దువ్వాడ శ్రీనివాస్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
