AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 9: బిగ్‌బాస్‌లో బిగ్ ట్విస్ట్! ఈ వారం డబుల్ ఎలిమినేషన్! ఆ ఇద్దరూ కంటెస్టెంట్స్ బయటికే

బిగ్ బాస్ సీజన్ 9 సెకండ్ వీక్ ఎలిమేషన్ కి రంగం సిద్ధమైంది. నామినేషన్స్ లో నిలిచిన ఏడుగురికి శుక్రవారంతోనే ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోగా ఆదివారం వీరిలో ఒకరు హౌస్ నుంచి బయటకు రానున్నారు. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనుందని తెలుస్తోంది.

Bigg Boss Telugu 9: బిగ్‌బాస్‌లో బిగ్ ట్విస్ట్!  ఈ వారం డబుల్ ఎలిమినేషన్! ఆ ఇద్దరూ కంటెస్టెంట్స్ బయటికే
Bigg Boss Telugu 9
Basha Shek
|

Updated on: Sep 21, 2025 | 8:29 AM

Share

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో రెండో వారం ముగింపునకు వచ్చేసింది. మొదటి వారంలో శ్రేష్టి వర్మ ఎలిమినేట్ కాగా.. ఈ ఆదివారం (సెప్టెంబర్ 21) మరొకరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రానున్నారు. రెండో వారం లో సుమన్ శెట్టి, ఫ్లోరా సైనీ, ప్రియా, మర్యాద మనీష్, భరణి, డెమోన్ పవన్, హరిత హరీష్ నామినేషన్స్ లో ఉన్నారు. శుక్రవారంతో వీరికి ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోయాయి. ఓటింగ్ సరళిని బట్టి కామనర్స్ ప్రియా శెట్టి, మనీష్ మర్యాద అలాగే నటి ఫ్లోరా డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. గత వారం తక్కువ ఓటింగ్ తో త్రుటిలో తప్పించుకున్న ఫ్లోరాకు ఈ వారం కూడా తక్కువ ఓట్లు వచ్చాయి. కాబట్టి ఈ ముగ్గురిలో ఫ్లోరానే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చాలామంది భావిస్తున్నారు. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ వారం హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ ఉండనుందని తెలుస్తోంది. ఫ్లోరాతో పాటు ప్రియా శెట్టి లేదా మనీష్ మర్యాద హౌజ్ నుంచి ఎలిమినేట్ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిలో ఒకరిని సీక్రెట్ రూమ్ కి పంపించే ఛాన్స్ కూడా ఉందని టాక్ వినిపిస్తోంది.

ఇక శనివారం (సెప్టెంబర్ 21) బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ ఆసక్తికరంగా జరిగింది. ముఖ్యంగా హౌస్ లో ప్రేమ పక్షులు గా మారిన రీతూ చౌదరి, డీమాన్ పవన్ లకు ఊహించని షాకిచ్చారు హోస్ట్ నాగార్జున. ‘రంగు పడుద్ది’ కెప్టెన్సీ టాస్క్ లో సంచాలకుడిగా రీతూ ఆటతీరును నాగ్ తప్పు పట్టారు. భరణి విషయంలో తన డెసిషన్ తప్పని వీడియోలతో సహా బయటపెట్టారు. దీంతో రీతూ పాప మొహం మాడిపోయింది. మరోవైపు డిమాన్ పవన్ కెప్టెన్సీ గెలిచిన తీరు సరైనది కాదని.. అతడి కెప్టెన్సీ రద్దు చేశారు నాగ్. మరి ఈ వీకెండ్ ప్రోగ్రామ్ ఎలా సాగనుందో.. ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నారో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

ఇవి కూడా చదవండి

1633894,1633803,1632882,1633777

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..