Bigg Boss Telugu 8: ముగిసిన బిగ్ బాస్ ఫస్ట్ వీక్ ఓటింగ్.. టాప్‌లోకి మణికంఠ.. ఆ బిగ్ కంటెస్టెంట్ ఇక బయటికే..

|

Sep 07, 2024 | 9:10 AM

వీకెండ్ లో బిగ్ బాస్ ఎంటర్ టైన్మెంట్ మరో లెవెల్ లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనికి తోడు ఈసారి వినాయక చవితి పండగ కూడా వచ్చింది. దీంతో శని, ఆదివారాల్లో బిగ్ బాస్ ఎంటర్‌ టైన్మెంట్ మంచి జోరు మీద ఉండనుంది. ఇక ఆదివారం ఫన్‌ తో పాటు ఎలిమినేషన్ కూడా ఉండనుంది.

Bigg Boss Telugu 8: ముగిసిన బిగ్ బాస్ ఫస్ట్ వీక్ ఓటింగ్.. టాప్‌లోకి మణికంఠ.. ఆ బిగ్ కంటెస్టెంట్ ఇక బయటికే..
Bigg Boss Telugu 8
Follow us on

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రసవత్తరంగా సాగుతోంది. గత సీజన్లతో పోల్చితే ఈసారి హౌస్ లోకి పెద్దగా పరిచయం లేని కంటెస్టెంట్స్ వచ్చినా తమ దైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారు. ఇక వీకెండ్ లో బిగ్ బాస్ ఎంటర్ టైన్మెంట్ మరో లెవెల్ లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనికి తోడు ఈసారి వినాయక చవితి పండగ కూడా వచ్చింది. దీంతో శని, ఆదివారాల్లో బిగ్ బాస్ ఎంటర్‌ టైన్మెంట్ మంచి జోరు మీద ఉండనుంది. ఇక ఆదివారం ఫన్‌ తో పాటు ఎలిమినేషన్ కూడా ఉండనుంది. కాగా ఈసారి ఫస్ట్ వీక్ లోనే షాకింగ్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. నిత్యం హౌస్ లో ఏడుపులతో సింపతీ కార్డ్ ప్లే చేస్తోన్న నాగ మణికంఠ టాప్-2 లోకి దూసుకురావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మణి దెబ్బకు సీరియల్ బ్యాచ్, యాంకర్లు, ఇతర సెలబ్రిటీలు కూడా వెనక్కి వెళ్లిపోవడం గమనార్హం. దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిగ్ బాస్ షో ప్రారంభమైనప్పటి నుంచే నాగ మణికంఠ పేరు బాగా వినిపిస్తోంది. నెట్టింట కూడా అతని పేరు బాగా వైరల్ అవుతూనే ఉంది. అదే ఇప్పుడు ఓటింగ్స్ లో కూడా కనిపిస్తోంది.

ఆర్జే శేఖర్ బాషా కూడా డేంజర్ జోన్ లో..

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ తొలి వారంలో విష్ణు ప్రియ, శేఖర్ బాషా, సోనియా ఆకుల, బెజవాడ బేబక్క, నాగ మణికంఠ, పృథ్వీరాజ్ నామినేషన్స్ లో నిలిచారు. వీరిక బుధవారం నుంచి ఆన్ లైన్ లో ఓటింగ్ ప్రారంభమైంది. శుక్రవారం రాత్రితో ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోయాయి. అలా ఈ వారం ఓటింగ్ సరళని ఒకసారి గమనిస్తే.. స్టార్ యాంకర్ విష్ణుప్రియ టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఈ సారి కంటెస్టెంట్స్ లో మోస్ట్ పాపులర్ ఆమె కాబట్టి ఆ ప్రభావం ఓటింగ్ లోనూ కనిపిస్తోంది. ఇక రెండో ప్లేస్ లో నాగ మణికంఠ కొనసాగుతున్నాడు. ఇక మూడో స్థానంలో పృథ్వీ రాజ్, నాలుగో స్థానంలో సోనియా ఆకుల, ఐదో స్థానంలో ఆర్జే శేఖర్ బాషా, ఆఖరి ప్లేస్ లో బెజవాడ బేబక్క ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ప్రస్తుతానికి వీళ్లిద్దరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఆర్జే శేఖర్ బాషా కొంచెం దూకుడుతో ఆట ఆడుతున్నాడు కాబట్టి బెజవాడ బేబక్క పెట్టె సర్దుకోవాల్సి వస్తుందేమోనని తెలుస్తోంది.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.