Bigg Boss 6 Telugu: రెండోవారం నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే.. ఆరోహి V/s ఆదిరెడ్డి..
అయితే గత సీజన్లకు భిన్నంగా.. ఈ వారం ప్రతి ఒక్క ఇంటి సభ్యులకు నామినేట్ చేయడానికి కేవలం ఒక్క ఓటు మాత్రమే లభిస్తుందని ట్విస్ట్ ఇచ్చాడు.
బిగ్ బాస్ సీజన్ 6 (Bigg Boss 6 Telugu) రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. తొలివారం ఎలిమినేషన్ లేదంటూ ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇనయ.. అభినయ శ్రీలు ఎలిమినేషన్ అంచుల వరకు వెళ్లొచ్చారు. తాజాగా విడుదలైన ఈరోజు ఎపిసోడ్ ప్రోమోలో నామినేషన్స్ ప్రక్రియ షూరు అయినట్లు చూపించారు. లేటేస్ట్ ప్రోమోలో కంటెస్టెంట్స్ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచినట్లుగా తెలుస్తోంది. ఆరోహి, ఆదిరెడ్డి… కీర్తిభట్, సింగర్ రేవంత్ మధ్య బిగ్ ఫైట్ నడిచినట్లుగా తెలుస్తోంది. అయితే గత సీజన్లకు భిన్నంగా.. ఈ వారం ప్రతి ఒక్క ఇంటి సభ్యులకు నామినేట్ చేయడానికి కేవలం ఒక్క ఓటు మాత్రమే లభిస్తుందని ట్విస్ట్ ఇచ్చాడు.
తాము నామినేట్ చేయాలనుకుంటున్న ఇంటి సభ్యుడు ఫేస్ కలిగిన కుండలను బావిలో వేయాలని సూచించినట్లుగా తెలుస్తోంది. ఇందులో ముందుగా ఆరోహి.. ఆదిరెడ్డితో తనకు బాండ్ లేదంటూ నామినేట్ చేసింది. దీంతో ఆదిరెడ్డి రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. ఈ ఇంట్లో ఆట ఆడని వాళ్లు వెళ్లిపోవాలా ? నీతో ర్యాపో లేనివాళ్లు వెళ్లిపోవాలా ? అని ఆదిరెడ్డి అడగ్గా.. ఆట ఆడని వాళ్లు అంటూ చెప్పుకొచ్చింది ఆరోహి. నా పర్ఫామెన్స్ కనిపించలేదా ? మీ కంటే అని ఆది రెడ్డి అనగా.. నా కంటే నాకంటే అంటూ ఆరోహి ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. ఏం ఇరగదీశావ్ అని ఆశ్చర్యపోతున్నావ్ అంటూ రివర్స్ అటాక్ చేశాడు ఆదిరెడ్డి.
ఇక ఆతర్వాత నేహా చౌదరీ.. గీతూ గలాటను.. శ్రీహాన్.. గీతూను నామినేట్ చేసినట్లుగా తెలుస్తోంది. అబ్బాయిలకు బుద్దిలేదు అని గీతూ స్టేట్మెంట్ ఇవ్వడం నచ్చలేదని చెప్పుకొచ్చాడు శ్రీహాన్. ఇక చివరగా.. సింగర్ రేవంత్.. కీర్తి భట్ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడించింది. ఒకరిపై మరొకరు సహనం కోల్పోయి అరుచుకున్నారు. మెరీనా, రోహిత్ జంట ఒక్కటే అయిన.. వాళ్లది రెండు మైండ్స్ పనిచేస్తున్నాయని ఆదిరెడ్డి అనగా.. ఇది బిగ్ బాస్ డెసిషన్ అని అన్నాడు రోహిత్. దీంతో బిగ్ బాస్ డెసిషన్ ను నామినేట్ చేస్తున్నట్లు చెప్పాడు ఆదిరెడ్డి. మొత్తానికి ఈ రెండోవారం నామినేషన్స్ రచ్చ ఎక్కువగానే జరిగినట్లుగా తెలుస్తోంది.
ఇక రెండోవారం నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా మెరీనా &రోహిత్, రేవంత్, గలాటా గీతూ, ఆదిరెడ్డి, రాజశేఖర్, అభినయ శ్రీ, పైమా, షానీ సాల్మన్ నామినేట్ అయినట్లుగా తెలుస్తోంది.