Amala Paul: ‘ఆ కారణంతోనే సినిమాలను పూర్తిగా వదిలేశాను’.. అమలాపాల్ షాకింగ్ కామెంట్స్..

2010లో తమిళ సినిమా మైనాతో సూపర్ హిట్ అందుకుంది. అయితే తాను కెరీర్ ఆరంభంలోనే బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది.

Amala Paul: 'ఆ కారణంతోనే సినిమాలను పూర్తిగా వదిలేశాను'.. అమలాపాల్ షాకింగ్ కామెంట్స్..
Amala Paul
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Sep 12, 2022 | 2:38 PM

దక్షిణాది చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికలలో అమలాపాల్ (Amala Paul) ఒకరు. అత్యంత తక్కువ సమయమంలో వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 2019లో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అయితే తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన అమలాపాల్ తాను సినిమాలను పూర్తిగా వదిలేయాలని అనుకున్నానని.. ఇండస్ట్రీలో పూర్తిగా అలిపోయానంటూ చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ ఆంగ్లపత్రిక ఇంటర్వ్యూలో పాల్గోన్న అమలాపాల్ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. 17ఏళ్ల వయసులో నీలతామర అనే మలయాళ చిత్రంలో సినీరంగ ప్రవేశం చేసింది. 2010లో తమిళ సినిమా మైనాతో సూపర్ హిట్ అందుకుంది. అయితే తాను కెరీర్ ఆరంభంలోనే బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది.

నా సినిమాలు ప్లా్ప్స్ అవుతున్నాయని.. ఆఫర్స్ రావడం లేదని సినిమాల నుంచి తప్పుకోవాలనుకోలేదు. ఆ సమయంలోనే నేను నా కెరీర్ లోనే చాలా ఆఫర్స్ పొందాను. కానీ కాస్త విరామం తీసుకోవాలనుకున్నాను కాబట్టి పలు చిత్రాలకు నో చెప్పాను. 17 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. ఇప్పుడు నాకు 30 ఏళ్లు. దాదాపు 13 ఏళ్లుగా బ్రేక్ లేకుండా పనిచేశాను. దీంతో పూర్తిగా అలసిపోయాను. మరోవైపు వ్యక్తిగత సమస్యలు ఇబ్బంది పెట్టాయి. నాన్న చనిపోవడం.. కరోనా సంక్షోభం రావడం.. ఇంట్లోనే ఉండిపోవడంతో సినిమాలు లేవు. నన్ను నేను కనుగొనడానికి నా భావోద్వాగాలను.. ప్రయాణాన్ని ప్రాసెస్ చేసుకోవడానికి ఆ విరామ సమయం నాకు చాలా ఉపయోగపడింది. నన్ను నేరు పూర్తిగా మార్చుకున్నాను. సినిమాలు చేసే సమయం నాకు లేకు లేదని అనుకున్నాను. కానీ విరామ సమయంలో నన్ను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది.

నేను సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నట్లు నా కుటుంబంతో చెప్పాను. వారు నాకు మద్దతునిచ్చారు. సినిమాలకు దూరం కావడం వలన ప్రేక్షకులు నన్ను మర్చిపోతారు అనుకున్నాను. కానీ నాకు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరముందని అనిపించింది అని తెలిపింది. చాలా కాలం తర్వాత గతేడాది కుట్టిస్టోరీ చిత్రంతో తిరిగి రీఎంట్రీ ఇచ్చింది అమాలా. ప్రస్తుతం ఆమె టీచర్, క్రిస్టోఫర్, ఆడు జీవితం చిత్రాల్లో నటిస్తోంది.