ManiSharma : సినీ పరిశ్రమలో మరో విషాదం.. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మకు మాతృవియోగం..
సోమవారం చెన్నైలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా సరస్వతి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
తెలుగు చిత్రపరిశ్రమలో మరో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మకు (ManiSharma ) మాతృ వియోగం కలిగింది. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తల్లి సరస్వతి ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. సోమవారం చెన్నైలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా సరస్వతి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. మణిశర్మ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఇక మరోవైపు రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతిపై ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపగా..మరోవైపు పలువురు ప్రముఖులు ప్రభాస్ ఇంటికి చేరుకుంటున్నారు.