Bigg Boss 6: రెమ్యునరేషన్ పై స్పందించిన అభినయ.. ఎలిమినేషన్ తర్వాత షాకింగ్ కామెంట్స్..
ఇక ఎలిమినేషన్ తర్వాత ఓ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడిన అభినయ రెమ్యునరేషన్ గురించి స్పందించింది. అంతేకాకుండా.. బిగ్ బాస్ వల్ల తనకు ఎలాంటి మేలు జరగలేదని వాపోయింది.
బిగ్ బాస్ సీజన్ 6 రెండవ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగిన సంగతి తెలిసిందే. శనివారం షాని ఎలిమినేట్ కాగా.. ఆదివారం అభినయ శ్రీ బయటకు వచ్చేసింది. అయితే వీరిద్దరి ఎలిమినేషన్ అనేది ముందుగానే ప్రేక్షకులకు తెలిసిన విషయమే. మొదటి వారమే ఎలిమినేషన్ చివరి వరకు వెళ్లి తృటిలో బయటపడిన అభినయ.. సెకండ్ వీక్ లో బయటకు వచ్చేసింది. ఇక ఎలిమినేషన్ తర్వాత ఓ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడిన అభినయ రెమ్యునరేషన్ గురించి స్పందించింది. అంతేకాకుండా.. బిగ్ బాస్ వల్ల తనకు ఎలాంటి మేలు జరగలేదని వాపోయింది.
మీకు రోజుకు రూ. 40 వేలు.. దాదాపు ఇప్పటివరకు రూ. 5 లక్షలు ఇచ్చారట కదా అని రిపోర్టర్ అడగ్గా.. అలాంటిదేం లేదని.. అవన్ని రూమర్స్ మాత్రమే అని చెప్పుకొచ్చింది. అలాగే వినర్ ఎవరవుతారని అనుకుంటున్నారని అడగ్గా.. గీతూ.. రేవంత్ ప్రతి వారం నామినేట్ అవుతున్నారు.. సేవ్ అవుతున్నారని. వీరిలో ఒకరు కావొచ్చని.. కానీ ఇదంతా అన్ ఫేయిర్ అని తనకు అనిపిస్తుందని తెలిపింది. అలాగే.. మీరు రీఎంట్రీ ఇవ్వాలని వచ్చారు. బిగ్ బాస్ వల్ల మంచి జరిగిందా ? చెడా ? అని ప్రశ్నించగా.. అసలు తనను చూపిస్తేనే కదా.. మంచి..చెడు అని చెప్పడానికి.. కచ్చితంగా బ్యాడే జరిగింది. రీఎంట్రీ అనే కలతో వచ్చాను. కానీ నా కల నెరవేరలేదు అంటూ చెప్పుకొచ్చింది.