Bigg Boss 9 Telugu : భరణితో బాండింగ్.. మొత్తం చెప్పేసిన దివ్య తల్లి..బిగ్‌బాస్‏కు రాకముందే..

బిగ్‌బాస్ సీజన్ 9.. ఇప్పుడు ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. ఇప్పటివరకు తనూజ, సుమన్ శెట్టి ఫ్యామిలీస్ ఎంటర్ కాగా.. నిన్నటి ఎపిసోడ్ లో డీమాన్ పవన్, దివ్య, సంజన కుటుంబాలు ఎంట్రీ ఇచ్చాయి. ముఖ్యంగా ఎంట్రీతోనే ఫుల్ ఎనర్జీ.. అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ తీసుకువచ్చింది దివ్య మదర్. డీలా పడిపోయిన హౌస్మేట్స్ కు ఫుల్ ఛార్జ్ ఇచ్చి.. పాజిటివ్ ఎనర్జీ ఇచ్చారు దివ్య తల్లి శ్రీలక్ష్మ.

Bigg Boss 9 Telugu : భరణితో బాండింగ్.. మొత్తం చెప్పేసిన దివ్య తల్లి..బిగ్‌బాస్‏కు రాకముందే..
Bigg Boss 9 Telugu

Updated on: Nov 20, 2025 | 7:27 AM

బిగ్‌బాస్ సీజన్ 9.. ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ రన్ అవుతుంది. చాలా కాలం తర్వాత తమ కుటుంబ సభ్యులను చూసిన కంటెస్టెంట్స్ ఎమోషనల్ అవుతున్నారు. తనూజ, సుమన్ శెట్టి ఫ్యామిలీస్ ఎంటర్ కాగా.. నిన్నటి ఎపిసోడ్ లో దివ్య తల్లి శ్రీలక్ష్మీ హౌస్ లోకి వచ్చారు. రావడంతో ఫుల్ ఎనర్జీతో ఎంట్రీ ఇచ్చి హౌస్మేట్స్ ను నవ్వించారు. తన మాటలతో అందరిని ఎంటర్టైన్ చేశారు. హౌస్ లోకి రాగానే అందరిని మాట్లాడించి.. తన స్టై్ల్లో పంచులు వేసింది. ఒక మనిషి ఎప్పుడూ తన క్యారెక్టర్ మార్చుకోలేడు.. అలా మార్చుకుంటే అది టెంపరెరీయే… ప్రతి విషయం ఆలోచిస్తే ముందుకు ఎలా వెళ్లాలో తెలియదు.. వెనక్కి రావాలో తెలియదు… మీరు ఎలా ఉన్నారో అలాగే ముందుకెళ్లండి.. అంటూ అందరికీ సలహా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి : Actress : 19 ఏళ్ల వయసులో 32 ఏళ్ల హీరోతో ప్రేమ, పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

ఆ తర్వాత భరణితో బాండింగ్ గురించి అసలు విషయం చెప్పుకొచ్చారు. దివ్య తల్లి శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. “మా అన్నయ్య..చదువులో అందరూ ముందుకు వెళ్లిపోతున్నారు. నేను వెళ్లలేకపోతున్నానని ఒత్తిడికి గురై.. 25 ఏళ్ల క్రితం సూసైడ్ చేసుకున్నారు. అప్పుడు నాది కూడా చిన్న వయసే. పెళ్లైన కొత్తలోనూ అదే ట్రోమాలో ఉండిపోయాను. మా అన్నయ్య ఎప్పుడూ గుర్తొచ్చేవాడు. టీవీలో ఒక పర్సన్ ను (భరణి) చూశా.. అతడు నాకు అన్నయ్యలా అనిపించాడు. దివ్యకు అదే విషంయ చెప్పాను. అన్నయ్య ఫీలింగ్ రావాలంటే అతడి ఒక్కడిలోనే ఉన్నాయి. ఆయన నాకు అన్నయ్య అనే ఫీలింగ్. అదే విషయాన్ని దివ్యకు చెప్పాను. నా బ్రదర్ ను మామ మామ అని పిలవలేవు కాబట్టి.. లోపలికెళ్లా.. బ్రదర్ అని పిలిస్తే చాలు నేను పిలిచిన ఫీలింగ్.. అలాగే పిలువు అని చెప్పాను ” అంటూ ఎమోషనల్ అయ్యారు. దీంతో భరణి సైతం భావోద్వేగానికి గురై ఆమెను దగ్గరికి తీసుకుని కంటతడి పెట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి : Nayanthara : అతడితో నటించాలా.. ? వంద కోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయను.. నయనతార..

దివ్య భరణిని అన్నయ్య అని పిలవడానికి రీజన్ అదే.. నేను చెప్పడంతోనే పిలిచింది. నేను ఏం చెప్తే అదే ఫాలో అయ్యింది అంటూ అసలు విషయం చెప్పారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి తనదైన స్టైల్లో పంచులు వేశారు. తనూజ.. ఇంట్లో పెద్ద కూతురులాంటిది.. మన చేతిలోని బాధ్యతతోపాటు అన్ని లాగేసుకుంటుంది. కానీ తీసుకున్నట్లు కూడా తెలియదు అంటూ పంచ్ వేసింది. ఇక ఇమ్మాన్యుయేల్ అందరివాడు అని తెలిపింది. దాదాపు ఆమె ఉన్న 15 నిమిషాలు హౌస్ లో ఫుల్ ఎంటర్టైన్ చేసింది.

ఇవి కూడా చదవండి : Racha Movie : ఏంట్రా బాబూ ఈ అమ్మాయి.. హీరోయిన్లకు మించిన అందం.. రచ్చ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు గ్లామర్ సెన్సేషన్..