AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 8 Telugu: ఫుడ్డు కోసం చుక్కలు చూపించిన బిగ్‏బాస్.. టాస్కులలో అల్లాడించేసిన సీత..

సరుకులు గెలిచేదెవరో.. ఒట్టి చేతులతో వెనుదిరిగేదెవరో తెలుసుకునేందుకు బిగ్‏బాస్ ఇస్తున్న ఆఖరి అవకాశం ఉంటూ చెప్పుకొచ్చాడు బిగ్‏బాస్. నిఖిల్ టీమ్ నుంచి మణికంఠ రాగా.. నైనిక టీమ్ నుంచి కిర్రాక్ సీత పోటీపడింది. హౌస్ లో ఒక్కో చోట కొన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టి చెప్పిన వెంటనే వాటిని ఎవరు ఫస్ట్ తీసుకువస్తారో వాళ్లే విన్నర్స్ అని చెప్పాడు.

Bigg Boss 8 Telugu: ఫుడ్డు కోసం చుక్కలు చూపించిన బిగ్‏బాస్.. టాస్కులలో అల్లాడించేసిన సీత..
Bigg Boss 8 Telugu
Rajitha Chanti
|

Updated on: Sep 11, 2024 | 3:38 PM

Share

హౌస్ లో రేషన్ లాగేసుకున్నాడు బిగ్‏బాస్. ఇక ఫుడ్డు కావాలంటే టాస్కులు గెలవాల్సిందే అంటూ రూల్స్ పెట్టాడు. ఇక ఈరోజు విడుదలైన ప్రోమోలో రేషన్ కోసం మూడు టాస్కుల మధ్య ఓ టాస్కు పెట్టాడు బిగ్‏బాస్. అయితే మొదటి టాస్కులో యష్మీ టీమ్ గెలవగా.. వారికి మాత్రమే రేషన్ ఇచ్చాడు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో నిఖిల్, నైనిక టీమ్స్ మధ్య మరో టాస్క్ ఇచ్చాడు. సరుకులు గెలిచేదెవరో.. ఒట్టి చేతులతో వెనుదిరిగేదెవరో తెలుసుకునేందుకు బిగ్‏బాస్ ఇస్తున్న ఆఖరి అవకాశం ఉంటూ చెప్పుకొచ్చాడు బిగ్‏బాస్. నిఖిల్ టీమ్ నుంచి మణికంఠ రాగా.. నైనిక టీమ్ నుంచి కిర్రాక్ సీత పోటీపడింది. హౌస్ లో ఒక్కో చోట కొన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టి చెప్పిన వెంటనే వాటిని ఎవరు ఫస్ట్ తీసుకువస్తారో వాళ్లే విన్నర్స్ అని చెప్పాడు.

ఇక ముందుగా శనగపప్పు తీసుకురావాలని చెప్పడంతో మణికంఠతో పోటీపడి మరీ ముందుగా తీసుకువచ్చింది సీత. ఇక ఆ తర్వాత టమాటో బుట్టలో యాపిల్ అడగ్గా.. ఇద్దరూ తీవ్రంగా శ్రమించగా.. మణికంఠ గెలిచాడు. చివరగా కొలతకు ఏం ఇవ్వకుండా 250 గ్రాముల మరమరాలు తీసుకురావాలని అడగడంతో ఇద్దరూ పట్టుకోచ్చారు. అయితే ఆ రెండింటిని తూకం వేసి ఎవరు కరెక్ట్ గా తెచ్చారో చెప్పే బాధ్యత యష్మీకి ఇచ్చాడు. ఇక ఇద్దరూ సరిగ్గా తీసుకురాలేదని.. అసలు ఎవరు గెలవలేదని చెప్పింది. దీంతో యష్మీతో వాదించాడు మణికంఠ.

తాను 290 గ్రాములు పట్టుకొచ్చానని.. ఎగ్జాక్ట్ గా లేదంటే ఎలా.. దగ్గరగా ఉన్న పాయింట్ ఇవ్వొచ్చు అని మాట్లాడగా.. ఎవరికీ పాయింట్ ఇవ్వనంటూ అరిచేసింది యష్మీ. ఇదెక్కడి అన్యాయం, మేము ఏమైనా రోబోలమా.. అలా ఎలా తెస్తామంటూ మణికంఠ అడగ్గా.. సంచాలక్ డెసిషన్ ఫైనల్.. అంతా నా ఇష్టమంటూ రెచ్చిపోయింది యష్మీ. మొత్తానికి ఈ టాస్కులో నైనిక టీం గెలిచినట్లు సమాచారం.

బిగ్‏బాస్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?