బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ తుది అంకానికి చేరుకుంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ రియాలిటీ షోకు ఆదివారం (డిసెంబర్ 14)తో ఎండ్ కార్డ్ పడనుంది. మెయిన్ కంటెస్టెంట్లు 14 మంది, వైల్డ్ కార్ట్ ఎంట్రీలతో మరో 8 మంది మొత్తం 2 మంది కంటెస్టెంట్లు ఈ సీజన్ లో పాల్గొన్నారు. వీరిలో ఐదుగురు ఫైనల్ కు చేరుకున్నారు. నిఖిల్, నబీల్, ప్రేరణ, గౌతమ్, అవినాష్ బిగ్ బాస్ టైటిల్ కోసం పోటీపడుతున్నారు. పేరుకు ఐదుగురే అయినా పోటీ మాత్రం ప్రధానంగా ఇద్దరి మధ్యనే ఉంది. గౌతమ్, నిఖిల్.. నువ్వా?నేనా? అంటూ ఓటింగ్ లో టాప్ లో దూసుకుపోయారు. మరి ఈ సీజన్ లో ఎవరు విజేతగా నిలవనున్నారనేది మరికొన్ని గంటల్లో తెలియనుంది. కాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజేతను ప్రకటించేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా గ్రాండ్ ఫినాలేకు వస్తాడని ప్రచారం జరిగింది. పుష్ప 2 సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బిగ్ బాస్ లో బన్నీ సందడి చేస్తాడేమోనని ఫ్యాన్స్ ఎదురుచూశారు. అయితే ఇప్పుడు అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు.
ఈ కేసు లో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ శుక్రవారం రాత్రంతా చంచల్ గూడ జైల్లోనే గడిపాడు అల్లు అర్జున్. శనివారం ఉదయం అతనిని రిలీజ్ చేశారు.దీంతో అల్లు అర్జున్‌కు సంఘీభావం తెలిపేందుకు సినిమా సెలబ్రిటీలు అతని ఇంటికి క్యూ కడుతున్నారు. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ బిగ్‌బాస్ షోకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో గత సీజన్ లాగే హోస్ట్ నాగార్జున చేతులమీదుగానే విన్నర్‌కు ట్రోఫీ ఇచ్చేయనున్నారని టాక్.
🏆✨ Who will claim the Bigg Boss Telugu 8 trophy? Share your guess! 👑🔥#BiggBossTelugu8 #StarMaa #Nagarjuna @DisneyPlusHSTel pic.twitter.com/pkHyKRWXsU
— Starmaa (@StarMaa) December 14, 2024
కాగా గతంలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ వేర్వేరు సీజన్లలో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్టులుగా వచ్చారు. ఇక గత సీజన్ ఫైనల్స్‌లోనూ సూపర్ స్టార్ మహేశ్‌బాబు ముఖ్య అతిథిగా వస్తున్నాడని టాక్ నడిచింది. కానీ అదేమీ జరగలేదు. ఇప్పుడు కూడ అల్లు అర్జున్ వస్తాడని ప్రచారం జరిగినా అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
Who will claim the Bigg Boss Telugu 8 title and secure their spot in the elite winners’ list? 🏆✨ #BiggBossTelugu8 #StarMaa #Nagarjuna @DisneyPlusHSTel pic.twitter.com/kE9CvNDOZH
— Starmaa (@StarMaa) December 13, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.