Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌ ఫ్యాన్స్‌ అలెర్ట్‌.. 7 సీజన్‌ టెలికాస్ట్‌ టైమింగ్స్‌లో మార్పులు.. వారమంతా సందడే

గత సీజన్‌లో చోటు చేసుకున్న కొన్ని చేదు అనుభవాల దృష్ట్యా తాజా సీజన్‌లో భారీ మార్పులు చేయనున్నారు బిగ్‌బాస్‌ నిర్వాహకులు. ముఖ్యంగా హౌస్‌మేట్స్‌ ఎంపికలో ఆచి తూచి నిర్ణయం తీసుకుంటున్నారట. అందరికీ తెలిసిన వాళ్లు, బాగా ఫేమస్‌ అయిన వాళ్లనే కంటెస్టెంట్స్‌గా హౌస్‌లోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఇక గేమ్‌ షోకు సంబంధించి కూడా ఈసారి చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయని టాక్ వినిపిస్తోంది. ఇది వరకు రిలీజైన బిగ్‌బాస్‌ ప్రోమోస్‌లో హోస్ట్‌ నాగార్జున చెప్పినట్లు

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌ ఫ్యాన్స్‌ అలెర్ట్‌.. 7 సీజన్‌ టెలికాస్ట్‌ టైమింగ్స్‌లో మార్పులు.. వారమంతా సందడే
Bigg Boss 7 Telugu
Follow us

|

Updated on: Aug 27, 2023 | 3:14 PM

బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న బిగ్‌ బాస్ రియాల్టీ షో మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. సెప్టెంబర్‌ 3న ఈ బిగ్గెస్ట్‌ తెలుగు రియాలిటీ షో లాంఛ్‌ కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత సీజన్‌లో చోటు చేసుకున్న కొన్ని చేదు అనుభవాల దృష్ట్యా తాజా సీజన్‌లో భారీ మార్పులు చేయనున్నారు బిగ్‌బాస్‌ నిర్వాహకులు. ముఖ్యంగా హౌస్‌మేట్స్‌ ఎంపికలో ఆచి తూచి నిర్ణయం తీసుకుంటున్నారట. అందరికీ తెలిసిన వాళ్లు, బాగా ఫేమస్‌ అయిన వాళ్లనే కంటెస్టెంట్స్‌గా హౌస్‌లోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఇక గేమ్‌ షోకు సంబంధించి కూడా ఈసారి చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయని టాక్ వినిపిస్తోంది. ఇది వరకు రిలీజైన బిగ్‌బాస్‌ ప్రోమోస్‌లో హోస్ట్‌ నాగార్జున చెప్పినట్లు ‘ఉల్టా పుల్టా’ అంటూ సరికొత్త కాన్సెప్ట్‌తో గేమ్‌ షోను ప్లాన్‌ చేశారట. గత సీజన్లలో మాదిరిగా కాకుండా న్యూ రూల్స్‌, న్యూ గేమ్స్‌ ఉంటాయిని నాగ్‌ చెప్పుకొస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌కు సంబంధించి కీలక అప్డేట్‌ఇచ్చారు మేకర్స్‌. షో లాంఛింగ్‌ టైమింగ్స్‌తో పాటు టెలికాస్ట్‌ టైమింగ్స్‌ను కూడా అధికారికంగా ప్రకటించారు. బిగ్ బాస్ ఏడో సీజన్ సెప్టెంబర్ 3వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం అవుతుందని స్టార్‌ మా ప్రకటించింది. ఇక టెలికాస్ట్‌ విషయానికొస్తే.. సోమవారం నుంచి శుక్రవారం వరకూ రాత్రి 9.30 గంటలకు స్టార్ మాలో షో ప్రసారమవుతుంది. శని, ఆదివారాల్లో మాత్రం రాత్రి 9 గంటలకు షో టెలికాస్ట్‌ అవుతుందని బిగ్‌బాస్‌ టీమ్‌ ప్రకటించింది.

అందుకే టైమింగ్స్‌ లో మార్పులు

కాగా గతంలో బిగ్ బాస్ షోను సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు ప్రసారం చేసేవారు. అయితే ఐదో సీజన్‌ నుంచి టైమింగ్స్‌లో మార్పలు చేశారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు షోను టెలికాస్ట్‌ చేశారు. షో రేటింగ్‌ దిగజారడానికి ఇది కూడా ఒక కారణమని నిర్వాహకులు చెబుతున్నారు. అందుకే గతంలో మాదిరిగానే ఏడో సీజన్‌ను కూడా సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకే టెలికాస్ట్‌ చేయనున్నారట. మొత్తానికి ఒక అరగంట ముందుగానే బిగ్‌ బాస్‌ షో ప్రసారం కానుందట. ఇక బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ల విషయానికి సంబంధించి కొత్త కొత్త పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా సీరియల్‌ నటుడు అమర్‌ దీప్‌, కార్తీక దీపం ఫేమ్‌ శోభా శెట్టి, సింగర్‌ శుభశ్రీ, సింగర్‌ దామిని, యూట్యూబ్‌ సెన్సేషన్‌ శీతల్‌ గౌతమన్‌, కమెడియన్‌ మహేష్‌, శుభశ్రీ, అంజలి పవన్‌, పల్లవి ప్రశాంత్‌ (యూట్యూబర్‌), మై విలేజ్‌ షో (అనిల్‌ గీలా), శ్వేతానాయుడు, సింగర్‌ మోహన భోగరాజు, ఆర్కే సాగర్‌.. ఇలా చాలామంది పేర్లు తెరమీదకు వస్తున్నాయి. అయితే వీరిలో హౌస్‌లోకి అడుగుపెడుతున్నారో మాత్రం తెలియాలంటే మరో వారం రోజలు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ లేటెస్ట్ అప్ డేట్

బిగ్ బాస్ లేటెస్ట్ ట్వీట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.