Bigg Boss 7 Telugu: స్పూన్‏తో స్విమ్మింగ్ ఫూల్ ఖాళీ చేయ్ అమర్‏‏దీప్.. సీరియల్ హీరోను ఓ ఆటాడుకున్న బిగ్‏బాస్..

అయినప్పటికీ అదేం పట్టించుకోకుండా హౌస్మేట్స్ నిర్ణయం ప్రకారం ప్రశాంత్‏ను కెప్టెన్ గా తొలగించారు. ఇక ఆ ప్రోమోతో ప్రశాంత్ రేంజ్ మరింత పెరిగిందని చెప్పడంలో సందేహం లేదు. ఇక తాజాగా విడుదల చేసిన ప్రోమోలో మాత్రం కంటెస్టెంట్లను పరుగులు పెట్టించాడు బిగ్‏బాస్. కలర్ కలర్ విచ్ కలర్ అంటూ టాస్క్ ఇచ్చి.. ఒక్కొక్కరికి చుక్కలు చూపించాడు. ఇక ఆటలో హీరో అవుతాడనుకుని జోకర్ అయిన అమర్ దీప్ ను మరోసారి ఓ ఆటాడుకున్నాడు బిగ్‏బాస్.

Bigg Boss 7 Telugu: స్పూన్‏తో స్విమ్మింగ్ ఫూల్ ఖాళీ చేయ్ అమర్‏‏దీప్.. సీరియల్ హీరోను ఓ ఆటాడుకున్న బిగ్‏బాస్..
Bigg Boss 7 Telugu Promo
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 11, 2023 | 3:31 PM

గత ప్రోమోలో రైతు బిడ్డకు షాకిచ్చాడు బిగ్‏బాస్ . అతడి కెప్టెన్సీని రద్దు చేస్తున్నామని అనౌన్స్ చేసి తిరిగి కెప్టెన్ బ్యాడ్జ్ ని వెనక్కు తీసేసుకున్నారు. హౌస్ మొత్తం కలిసి ప్రశాంత్ కెప్టెన్ గా అర్హుడు కాదంటూ చేతులెత్తడంతో అతడిని కెప్టెన్ గా తొలగించాడు. దీంతో ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన మాట ఎవరు వినడం లేదంటూ అంతకుముందే బిగ్‏బాస్ ముందు మొర పెట్టుకున్నాడు ప్రశాంత్. అయినప్పటికీ అదేం పట్టించుకోకుండా హౌస్మేట్స్ నిర్ణయం ప్రకారం ప్రశాంత్‏ను కెప్టెన్ గా తొలగించారు. ఇక ఆ ప్రోమోతో ప్రశాంత్ రేంజ్ మరింత పెరిగిందని చెప్పడంలో సందేహం లేదు. ఇక తాజాగా విడుదల చేసిన ప్రోమోలో మాత్రం కంటెస్టెంట్లను పరుగులు పెట్టించాడు బిగ్‏బాస్. కలర్ కలర్ విచ్ కలర్ అంటూ టాస్క్ ఇచ్చి.. ఒక్కొక్కరికి చుక్కలు చూపించాడు. ఇక ఆటలో హీరో అవుతాడనుకుని జోకర్ అయిన అమర్ దీప్ ను మరోసారి ఓ ఆటాడుకున్నాడు బిగ్‏బాస్.

తాజాగా విడుదలైన ప్రోమోలో.. ఆటగాళ్లు, పోటుగాళ్లకు మూడో టాస్క్‏లో భాగంగా.. కలర్ కలర్ విచ్ కలర్ గేమ్ ఆడించారు. ఈ టాస్కులో భాగంగా బిగ్‏బాస్ చెప్పిన కలర్ ఉన్న వస్తువులు ఇంట్లో నుంచి తీసుకువచ్చి బయట వెయ్యాల్సి ఉంటుంది. ఇందులో ముందుగా కలర్ కలర్ విచ్ కలర్ బిగ్‏బాస్.. అని అడగ్గా.. ముందుగా గ్రీన్ అని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడే గ్రీన్ గడ్డిని తీసి బాక్స్ లో వేసింది అశ్విని. దీంతో ఆమె వేసిన వస్తువును గుర్తించి తనకు చూపించాలని అడగ్గా.. తను వేసిన వస్తువును తనే చూపించలేకపోయింది. ఇక ఆ తర్వాత లెమన్ కలర్ అని బిగ్‏బాస్ చెప్పగా.. సందీప్ గ్రీన్, అర్జున్ అంబటి ఎల్లో కలర్ చైర్స్ తీసుకువచ్చారు. దీంతో వీరిద్దరు స్కూల్లో కలర్స్ సరిగ్గా నేర్చుకోలేదంటూ కౌంటరిచ్చాడు బిగ్‏బాస్..

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

ఇక పెద్ద స్పూన్ తీసుకురావాలని చెప్పగా.. అశ్విని, అమర్ దీప్ స్పూన్స్ తీసుకువచ్చారు. దీంతో ఆ రెండు స్పూన్లలో దేనితో స్విమ్మింగ్ ఫూల్‏ను ఖాళీ చేయొచ్చు అని అడగ్గా.. తన చేతిలో ఉన్న స్పూన్ తో చేయోచ్చు అంటూ అతి తెలివి ప్రదర్శించాడు అమర్ దీప్. దీంతో తన చేతిలోని స్పూన్ తో స్విమ్మింగ్ ఫూల్ ఖాళీ చేయాలని ఆదేశించాడు బిగ్‏బాస్. నువ్వు తినేస్తావ్, చేసేస్తావ్ అంటూ సెటైర్స్ వేశాడు శివాజీ. చివరకు స్పూన్ తో స్విమ్మింగ్ ఫూల్ లోని నీటిని బయటకు తీసేందుకు ట్రై చేశాడు అమర్ దీప్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.