Bigg Boss 7 Telugu: పట్టువదలని సుబ్బు, ప్రశాంత్, యావర్.. కదలొద్దంటూ ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్..
ప్రశాంత్, సుబ్బు పవరాస్త్ర కోసం పోటీ పడే కంటెండర్స్ గా నిలిచారు. దీంతో ఈరోజు ఈ ముగ్గురిలో ఒకరికి పవరాస్త్ర రావాల్సి ఉంది. ఇప్పుడు ఈ ముగ్గురికి విచిత్ర టాస్కులు ఇస్తున్నారు బిగ్‌బాస్. తాజాగా విడుదలైన ప్రోమోలో ఈవారం నాలుగో పవరాస్త్రతోపాటు.. రెండు వారాల ఇమ్యూనిటీ కోసం పట్టువదలకు రా డింబకా అనే టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్. ముగ్గురు ఒకేసారి కలిసి పవరాస్త్రను పట్టుకొని ఉండాలి. చివరి వరకు ఎవరు విడిచిపెట్టకుండా ఉంటారో వాళ్లే విజేత అని అన్నారు బిగ్‌బాస్.
బిగ్‌బాస్ నాలుగో వారం పవరాస్త్ర కోసం పోటి జరుగుతుంది. ఇక ఈసారి సీరియల్ బ్యాచ్‌ను వెనక్కు నెట్టి మరోసారి కంటెండర్ అయ్యాడు యావర్. ఇక ఆ తర్వాత ప్రశాంత్ గెలవగా.. గాలా ఈవెంట్ లో సుబ్బును విజేతగా అనౌన్స్ చేశారు. వీరు ముగ్గురు పవరాస్త్ర కోసం పోటీ పడే కంటెండర్స్ గా నిలిచారు. దీంతో ఈరోజు ఈ ముగ్గురిలో ఒకరికి పవరాస్త్ర రావాల్సి ఉంది. ఇప్పుడు ఈ ముగ్గురికి విచిత్ర టాస్కులు ఇస్తున్నారు బిగ్‌బాస్. తాజాగా విడుదలైన ప్రోమోలో ఈవారం నాలుగో పవరాస్త్రతోపాటు.. రెండు వారాల ఇమ్యూనిటీ కోసం పట్టువదలకు రా డింబకా అనే టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్. ముగ్గురు ఒకేసారి కలిసి పవరాస్త్రను పట్టుకొని ఉండాలి. చివరి వరకు ఎవరు విడిచిపెట్టకుండా ఉంటారో వాళ్లే విజేత అని అన్నారు బిగ్‌బాస్.
దీంతో ప్రశాంత్, యావర్, రతిక ముగ్గురు పవరాస్త్ర పట్టుకోగా.. రతిక, అమర్ వారిని డిస్టర్బ్ చేసేందుకు ట్రై చేశారు. ముఖ్యంగా రతిక, అమర్ ఎక్కువగా ప్రశాంత్, యావర్ ను తప్పించేందుకు ట్రై చేసినట్లుగా ప్రోమో చూస్తే తెలుస్తోంది. అయితే ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు పవరాస్త్ర వదలకపోవడంతో టాస్కును రద్దు చేసి మరో కొత్త టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్. కదలకురా.. వదలకురా అనే కొత్త టాస్క్ ఇచ్చారు. ఇందులో ముగ్గురి ఎదురుగా మూడు స్టాండ్స్ పై ఉన్న పవరాస్త్రలను పడిపోకుండా పట్టుకోవాలి. అయితే ఇక ఇందులో ఎవరు గెలిచారనేది ఈరోజు ఎపిసోడ్ లో చూడాల్సిందే.
View this post on Instagram
ఇక అంతకు ముందు ప్రోమోలో.. గాలా ఈవెంట్ లో చిత్ర విచిత్ర వేషాధారణలతో కనిపించి ఎంటర్టైన్ చేయాలని ఆదేశించాడు బిగ్‌బాస్. ఇక ఈ పోటీల్లో ఎవరో ఒకరిని విజేతగా ప్రకటించాల్సిన బాధ్యత శివాజీ, శోభా శెట్టి, సందీప్ లకు ఇచ్చాడు. అయితే ఇందులో శుభ శ్రీని విజేతగా అనౌన్స్ చేయగా.. అమర్ దీప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మీ జడ్జ్మెంట్ పై నాకు అనుమానం ఉంది.. మీకు ఇష్టమైనవారినే విజేతలుగా అనౌన్స్ చేస్తారా అంటూ సీరియస్ అయ్యాడు. ఈ క్రమంలో శివాజీ, అమర్ దీప్ మధ్య మరోసారి డైలాగ్ వార్ నడిచింది.
View this post on Instagram