బిగ్‌బాస్‌లో అడుగుపెట్టెటప్పుడు ఇనాయా సుల్తానా వీక్ కంటెస్టెంట్ అని చాలామంది పెదవి విరిచారు. అన్నట్లే షో ప్రారంభంలో తన ప్రవర్తనతో ఎంతో చిరాకు తెప్పించిందామె. ఫిజికల్ అండ్ గేమ్స్ టాస్క్‌ల్లోనూ పెద్దగా ఆకట్టుకోలేదు. ఎంటర్‌టైన్మెంట్ అందించడంలోనూ ఫెయిలయ్యింది. దీంతో హౌస్ నుంచి త్వరగానే బయటకు వెళ్లిపోతుందని భావించారు. అయితే ఉన్నట్లుండి ఇనాయా ఆటతీరు మెరుగుపడింది. టాస్క్‌ల్లోనూ ట్యాలెంట్ చూపించింది. టాప్ కంటెస్టెంట్లుగా భావించిన వారితో సై అంటే సై అంది. ఆటతీరుతో పాటు మాట తీరు మెరుగుపర్చుకుంది. సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. తనలోని ఫైర్‌ను చూసి టాప్-3లో కచ్చితంగా ఉంటుందని భావించారు. అయితే ఎలిమినేషన్ ప్రక్రియలో ఎప్పటికప్పుడు ట్విస్టులు ఇస్తోన్న బిగ్‌బాస్ గతవారం ఇనాయాకు బిగ్ షాక్ ఇచ్చాడు. ఫినాలేకు ఒక వారం ముందే హౌస్ నుంచి ఆమెను ఎలిమినేట్ చేసి బయటకు పంపించేశాడు. ఈ నేపథ్యంలో ఇనయది అన్ ఫెయి ర్ ఎలిమినేషన్ అంటూ సోషల్ మీడియా హోరెత్తింది. టాప్ 3లో ఉండాల్సిన కంటెస్టెంట్‌ను అలా ఎలా పంపించేస్తారని అభిమానులు బిగ్‌బాస్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దీంతో ఇనయ అన్‌ఫెయి ర్ ఎలిమినేషన్ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా నెట్టింట్లో ట్రెండ్ అయ్యింది.
ఇదిలా ఉంటే బిగ్‌బాస్ ద్వారా బోలెడు పాపులారిటీ, ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్న ఇనయ ఎంత రెమ్యునరేషన్ తీసుకుందనేది ఆసక్తిగా మారింది. నెట్టింట చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం బిగ్‌బాస్ షో ద్వారా ఇనాయా బాగానే వెనకేసిందని తెలుస్తోంది. వారానికి సుమారు రూ. లక్ష రూపాయల పైనే రెమ్యునరేషన్ అందుకున్న ఇనాయా మొత్తం 14 వారాలకు గానూ దాదాపు రూ.15 లక్షలకుపైనే పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.