Bigg Boss 5: అరె.. కింగ్ నాగార్జునను జాంబీరెడ్డిగా మార్చిందెవరు?

Bigg Boss 5: అరె.. కింగ్ నాగార్జునను జాంబీరెడ్డిగా మార్చిందెవరు?
Akkineni Nagarjuna

మొన్నీమధ్యే వైల్డ్ డాగ్ మూవీలో రియల్ మెషిన్ గన్స్ తో డేర్ ఫీట్స్ చేసిన నాగార్జున చేతిలో... ఇప్పుడు పిల్లలాడుకునే బొమ్మ తుపాకీ పెట్టి..

Venkata Chari

|

Aug 15, 2021 | 10:03 PM

Bigg Boss 5: ”బోర్ డమ్ కి చెప్పేయ్ గుడ్ బై… వచ్చేసింది మీ బిగ్ బాస్…” అంటూ ఫిఫ్త్ సీజన్ ప్రమోషన్ గ్రాండ్ గా మొదలైంది. గతంలో రెండుసార్లు హోస్ట్ గా చేసిన నాగార్జునకే హ్యాట్రిక్ ఛాన్స్ ఇచ్చారన్నది కొత్త ప్రోమో ద్వారా నిర్వాహకులు చెప్పాలనుకున్న కీలక సారాంశం. లాక్ డౌన్ తో థియేటర్లు లేక వినోదం కోసం మొహం వాచిన ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఈ ప్రోమో స్పెషల్ గా టార్గెట్ చేసింది. కానీ… చివర్లో నాగార్జున అప్పియరెన్స్ మీదే ఫోకస్ ఎక్కువగా వుంది. దీన్ని డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చిన నాగార్జునకు థాంక్స్ అంటూ ప్రశాంత్ వర్మ పెట్టిన ట్వీట్ చూసి. ఇదంతా నీ చేతివాటమేనా నాయనా అంటూ ట్రోలింగ్ మొదలైంది.

మొన్నీమధ్యే వైల్డ్ డాగ్ మూవీలో రియల్ మెషిన్ గన్స్ తో డేర్ ఫీట్స్ చేసిన నాగార్జున చేతిలో… ఇప్పుడు పిల్లలాడుకునే బొమ్మ తుపాకీ పెట్టి.. టోటల్ ట్రాన్స్ ఫర్మేషన్ అంటే ఇదే మరి… అనిపించారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. టెలివిజన్ ఆడియెన్స్ అంటే ఏ ఒక్క సెక్షనో కాదని, పిల్లా పెద్దా అన్ని వయసుల వారూ ఉంటారని చక్కగా గ్రహించారు గనుకే.. ఇలా ఇంటిల్లిపాదినీ ఆకట్టుకునేలా 360 డిగ్రీస్ ఎంటర్ టైన్మెంట్ మోడ్ తో ప్రోమోని డిజైన్ చేశారట. కానీ ఇందులో జాంబీ ఫ్లేవర్స్ మేజర్ గా కనిపిస్తున్నాయని, కింగ్ నాగార్జునతో కూడా ఇలా చేయిస్తారా? అనేది బిగ్ బాస్ పై వినిపిస్తున్న లేటెస్ట్ బజ్.

కామెడీని, హర్రర్ నీ కలిపి ప్రేక్షకుడ్ని ఒక అబ్నార్మల్ సిట్యువేషన్లోకి తీసుకెళ్లే జాంబీ జానర్ ని తెలుగులో ఇంట్రడ్యూస్ చేశారు ప్రశాంత్ వర్మ. కలెక్షన్ల లెక్కలు అటుపెడితే క్రేజ్ పరంగా ఈ సినిమా ఎబోవ్ యావరేజ్ అనిపించుకుంది. ఆ ఊపులోనే జాంబీరెడ్డి సీక్వెల్ కి కూడా ప్లాన్ చేస్తున్నారట. ఈ చిన్న గ్యాప్ లో ఇలా నాగ్ తో ట్రయల్ వేసి… ఇందులో కూడా తన ఒరిజినల్ ఫ్లేవర్ ని వదులుకోలేకపోయారు. ఆయన డెబ్యూ మూవీ ‘అ!’ స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో నేషనల్ అవార్డు దక్కించుకుంది. అటువంటి వెరీ స్పెషల్ ఎఫెక్ట్స్ నే బిగ్ బాస్ ప్రమోషన్లో వాడేస్తున్నారా? అని లైట్ గా సెటైర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హనుమాన్ అనే సూపర్ హీరో మూవీ చేస్తున్నారు ప్రశాంత్ వర్మ.

(శ్రీహరి రాజా, ET డెస్క్, TV9 తెలుగు)

Also Read:

Raja Raja Chora: ‘రాజా రాజా చోరా’ మూవీ ప్రీరీజ్ ఈవెంట్‌లో ఫన్నీ సీన్స్.. లైవ్

Serial Dater Sundar Ramu: ఇతనొక సీరియ‌ల్ డేట‌ర్.. ఇప్పటి వరకు 335 మంది మహిళలతో డేటింగ్..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu