Bigg Boss 5 Telugu: అంతా సిద్ధం.. బుల్లితెరపై అసలైన వినోదం ఈరోజే.. టైమింగ్ గుర్తుందిగా ?

బిగ్‏బాస్ 5 తెలుగు: బుల్లితెరపై అసలైన సందడి ఈరోజు ప్రారంభం కాబోతుంది. తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 5కు అంతా సిద్దమైంది. ఈరోజు సాయంత్రం

Bigg Boss 5 Telugu: అంతా సిద్ధం.. బుల్లితెరపై అసలైన వినోదం ఈరోజే.. టైమింగ్ గుర్తుందిగా ?
Bigg Boss 5
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 05, 2021 | 9:50 AM

బుల్లితెరపై అసలైన సందడి ఈరోజు ప్రారంభం కాబోతుంది. తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 5కు అంతా సిద్దమైంది. ఈరోజు సాయంత్రం బిగ్‌బాస్ షో ఘనంగా ప్రారంభం కానుంది. గత కొద్ది రోజులుగా ఈ షో గురించి నెట్టింట్లో జరుగున్న హడావిడి తెలిసిందే. ఇందులో పాల్గోనే కంటెస్టెంట్స్ ఎవరెవరు అనేదానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పలుమార్లు కంటెస్టెంట్స్ పేర్లు లీకవుతూ వచ్చాయి. అయితే వాటిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. అలాగే గతంలో ఈ షో హోస్ట్ మారతాడంటూ గాసిప్స్ వచ్చాయి. కానీ వాటికి చెక్ పెడుతూ వరుస అప్డేట్స్ ఇస్తూ.. హోస్ట్‏గా నాగార్జున వ్యవహరించనున్నట్లుగా ప్రకటించారు నిర్వహకులు. ఇక ఇప్పటికే ఈ షో కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో పాల్గోనే కంటెస్టెంట్స్ ఎవరు అని తెలుసుకోవడానికి ఎగ్జ‌యిట్‌మెంట్ పెరిగిపోయింది. ఇప్పటికే నిన్న శనివారం కంటెస్టెంట్స్ బిగ్‌బాస్ ఇంట్లోకి వెళ్లారు. ఇక ఇవాళ్టి షో మొత్తం నిన్నటే షూట్ జరిగిపోయింది కూడా. ఇక ఆ షూట్ మొత్తాన్ని ఈరోజు సాయంత్రం ప్రసారం కానుంది.

ఎన్నో రోజుల వెయిటింగ్ తర్వాత ఎట్టకేలకు ఈరోజు సాయంత్రం ప్రేక్షకుల ముందుకు బిగ్‌బాస్ షో రాబోతుంది. దీంతో మళ్లీ బుల్లితెరపై సందడి మొదలుకానుంది. ఈరోజు (ఆదివారం) సాయంత్రం 6 గంటలకు బిగ్‌బాస్ షో గ్రాండ్‏గా ప్రారంభం కానుంది. ఈ షోకు నాగార్జున హస్ట్‏గా వ్యవహరించనున్నారు. ఇక ఈరోజు తర్వాత బిగ్‌బాస్ షో.. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10.00 గంటలకు స్టార్ మాలో ప్రసారం కానుంది. అలాగే శని, ఆదివారాలు ఈ షో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. అటు ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రోమోలను విడుదల చేస్తూ వస్తుంది స్టార్ మా. ఈరోజు నుంచి బుల్లితెరపై అసలైన సందడి మొదలుకాబోతుంది.

Also Read: Sonu Sood: ప్రమాదకరమైన స్టంట్స్ చేసిన సోనూసూద్.. కట్ చేస్తే.. అసలు విషయం తెలిస్తే షాకవుతారు..

Bandla Ganesh: హీరోగా బండ్ల గణేష్.. పట్టాలెక్కిన సినిమా… ఆకట్టుకుంటున్న లుక్..

Pooja Hegde: సినిమాల్లో రాణించాలంటే అది తప్ప నాకు మరో మార్గం లేదనిపించింది.. పూజా ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌.