Bigg Boss 5 Telugu: సన్నీపై రెచ్చిపోయిన యానీ మాస్టర్.. నాగార్జున క్లాస్ మాములుగా లేదుగా..

గత సీజన్లకు భిన్నంగా ఈసారి బిగ్‏బాస్ సాగుతోంది. ఇక ఈ వారం ఇంట్లో హీట్ వాతావరణం కొనసాగుతోంది. కెప్టెన్సీ టాస్కులో

Bigg Boss 5 Telugu: సన్నీపై రెచ్చిపోయిన యానీ మాస్టర్.. నాగార్జున క్లాస్ మాములుగా లేదుగా..
Bigg Boss
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 31, 2021 | 7:12 AM

గత సీజన్లకు భిన్నంగా ఈసారి బిగ్‏బాస్ సాగుతోంది. ఇక ఈ వారం ఇంట్లో హీట్ వాతావరణం కొనసాగుతోంది. కెప్టెన్సీ టాస్కులో భాగంగా ఇంటి సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతోంది. వ్యక్తిగత దూషణలతో ఇంట్లో పెద్ద రచ్చే సృష్టించారు.. ఇక నిన్నటి ఎపిసోడ్‏లో యానీ మాస్టర్.. సన్నీపై శివాలెత్తింది. ప్రాంతీయ విద్వేషాలతో లెవనెత్తింది.

ఇంటి సభ్యులకు పూరీలు చేసే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో హౌస్ మేట్స్ రెండు గ్రూపులుగా విడిపోయారు. యానీ మాస్టార్, శ్రీరామ్, విశ్వ, రవి, లోబో ఒక టీం కాగా.. మిగిలిన వారు రెండో టీంగా ఏర్పడ్డారు. అయితే ఇందులో ముందుగా కాజల్ టీం 50 చపాతీలు చేసినా.. సరిగ్గా లేవని యానీ మాస్టర్ టీంను విజేతగా ప్రకటించాడు షన్నూ. దీంతో సరిగ్గా లేవని.. కాదు.. ఎవరు ముందుగా చేసారనేది చూడాలని.. ఒకసారి రూల్స్ బుక్ సరిగ్గా చూసుకోవాలని సూచించాడు జైల్లో ఉన్న సన్నీ. ఇంకేముంది యానీ మాస్టర్ రెచ్చిపోయింది. నీకు నీ ఫ్రెండ్స్ కష్టం తప్ప మిగతవారిది కనిపించదా అంటూ యాద్దానికి దిగింది. ఇక మాట మాటా పెరిగి ఇద్దరూ సౌత్.. నార్త్ ఇండియా అంటూ ప్రాంతీయ విద్వేశాలను రెచ్చగొట్టేంతవరకు వెళ్లింది.

అయితే వీరిద్దరి మధ్య గొడవ జరుగుతుంటే కెప్టెన్ గా ఉన్న షణ్ముఖ్ మాత్రం పక్కన కూర్చుని నవ్వుతున్నాడు. దీంతో సన్నీకి మరింత కోపం వచ్చేసింది. ఇద్దరూ గొడవ జరుగుతుంటే అలా ఎంజాయ్ చేయడం కరెక్ట్ కాదంటూ వారించాడు. దీంతో నాకు నవ్వు వచ్చింది నవ్వాను… కొడతావా నన్ను అంటూ సన్నీని మరింత రెచ్చగొట్టాడు షన్నూ. మొత్తానికి యానీ మాస్టర్, సన్నీ, షణ్ముఖ్ మధ్య చిన్నపాటి భీకరపాటి యుద్ధం జరిగింది.

ఇక ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన నాగ్.. ఒక్కో కంటెస్టెంట్‏కు కాస్త ఎక్కువగానే క్లాస్ తీసుకున్నాడు.. ముందుగా కెప్టెన్‏గా ఎన్నికైన షన్నూను అభినందించాడు. అనంతరం యాంకర్ రవిని దారుణంగా అవమానించాడు.. షణ్ముఖ్ బ్యాచ్‏తో మాట్లాడిన వీడియో క్లిప్ చూపించి మరీ క్లాస్ పీకాడు. నీకోసం రూల్స్ మార్చలేమని.. డబ్బు కోసం రాలేదు అంటున్నావ్.. ఇప్పుడే గేట్స్ ఓపెన్ చేస్తాను వెళ్లిపో అంటూ ఫైర్ అయ్యారు.. ఇక యానీ మాస్టర్ గివ్ అప్ ఇవ్వడం పై ప్రశ్నించిన నాగ్.. ఆ తర్వాత కాజల్ ను పద్దతిగా గేమ్ ఆడాలన్నారు. ఇక ఆ తర్వాత సన్నీ ఫోటో చింపేసి.. జైలుకు వెళ్లిన నీలో మార్పు రాలేదా అంటూ పైర్ అయ్యారు. ఇక ఆ తర్వాత ఇంటి సభ్యులతో వైకుంఠపాలీ ఆడించాడు నాగ్. ఇందులో ఎక్కువ మంది ఇంటి సభ్యులు కాజల్‏ను పాముతో పోల్చారు.

Also Read: Puneeth Rajkumar Daughter: ‘డాడీ.. మమ్మల్ని వదిలి వెళ్లావా’.. కన్నీటి పర్యంతమైన పునీత్ కుమార్తె

Rajamouli: ప్రభాస్‌తో పోటీపై స్పందించిన రాజమౌళి.. జక్కన్న ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా.?

Puneeth Rajkumar: పునీత్‌ రాజ్‌ కుమార్‌ మరణంపై భావోద్వేగానికి గురైన బన్నీ, విజయ్‌.. ఏమన్నారంటే..