Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu Promo: బిగ్ షాకిచ్చిన నాగార్జున.. ఆ ఇద్దరిని ఎలిమినేట్ ?..

వారం మొత్తం జరిగిన విషయాలు.. సంఘటనలపై శనివారం తీరిగ్గా క్లా్స్ తీసుకుంటాడు హోస్ట్ నాగార్జున.. అనంతరం నామినేట్ అయిన

Bigg Boss 5 Telugu Promo: బిగ్ షాకిచ్చిన నాగార్జున.. ఆ ఇద్దరిని ఎలిమినేట్ ?..
Bigg Boss Promo 2
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 24, 2021 | 5:50 PM

వారం మొత్తం జరిగిన విషయాలు.. సంఘటనలపై శనివారం తీరిగ్గా క్లా్స్ తీసుకుంటాడు హోస్ట్ నాగార్జున.. అనంతరం నామినేట్ అయిన సభ్యులలో ఒకరిద్దరిని సేవ్ చేసి వెళ్లిపోతాడు.. ఇక సండే ఫన్ డే అంటూ వచ్చి.. ఇంటి సభ్యులతో ఓ ఆటాడుకుంటాడు.. సరదా.. ఫన్ని టాస్క్‏లు ఇచ్చి హౌస్‏మేట్స్‏ను సంతోషపరుస్తాడు.. ఇక అంతలోనే.. ఎలిమినేషన్ అంటూ ఇంటి సభ్యులకు దడ పుట్టిస్తాడు.. అయితే ఈరోజు (ఆదివారం అక్టోబర్ 24న) హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులకు బిగ్ షాకిచ్చినట్లుగా తెలుస్తోంది.. తాజాగా విడుదలైన ప్రోమోలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‏ విషయంలో ఇంటి సభ్యులకే కాదు.. ప్రేక్షకులకు కూడా షాకిచ్చాడు..

తాజా వీడియోలో.. యానీ మాస్టర్, ప్రియా డేంజర్ జోన్‏లో ఉన్నట్లుగా ప్రకటించాడు నాగ్.. అనంతరం వారిద్దరిని ఇంటి సభ్యులకు గుడ్ బాయ్ చెప్పేసి గార్డెన్ ఏరియాలోకి వెళ్లమన్నాడు.. ఇద్దరూ గుడ్ బాయ్ చెప్పాలి అనడంతో ఇంటి సభ్యులు ఒకింత షాకయ్యారు.. ఇక అనంతరం వారిద్దరు గార్డెన్ ఏరియాలో ఉన్న రూమ్స్‏లోకి వెళ్లి లాక్ చేసుకోగా.. ఏ రూమ్ లైట్ ఆఫ్ అయి ఎవరు ఆ రూంలో ఉండనివారు ఎలిమినేట్ అంటూ చెప్పుకొచ్చాడు నాగ్… అయితే ఇద్దరి రూమ్స్ బయట ఉన్న లైట్స్ ఆఫ్ కావడంతో.. కంటెసెంట్స్ పరుగున వెళ్లి చూడగా.. ఇద్దరి రూమ్స్ ఖాళీగా ఉన్నాయి.. దీంతో ఇద్దరూ స్టేజ్ పైకి వస్తారని షాకిచ్చాడు నాగ్.. ఇక ప్రోమోను బట్టి చూస్తే.. నిజాంగానే ఈరోజు ఇద్దరూ ఎలిమినేట్ కాబోతున్నారా ? లేదా ? ఎప్పటిలాగే.. చివర్లో ట్విస్ట్ ఇస్తారా అనేది చూడాలి.. అలాగే.. ఒకవేళ ఈరోజు డబుల్ ఎలిమినేషన్ జరిగితే మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతుంది అనేది స్పష్టంగా తెలుస్తోంది.

Also Read: Bigg Boss 5 Telugu Promo: అడగండి.. లాక్కోండి.. దొంగిలించండి.. ఇంటి సభ్యులను ముప్పుతిప్పలు పెట్టిన నాగ్..

Trailer Talk: నెట్టింట్లో సంచలనం సృష్టిస్తున్న ఎనిమి ట్రైలర్.. విశాల్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదుగా..

RajiniKanth: అక్టోబర్ 25న రజినీకి ప్రత్యేకం.. తన జీవితంలో రేపు స్పెషల్ అంటున్న తలైవా.. ఎందుకంటే..