Bigg Boss 5 Telugu: షణ్ముఖ్‏ను ఓ ఆటాడుకున్న ప్రియ.. దండం పెట్టేసిన షన్నూ..

బిగ్‏బాస్ సండే ఫన్ డే ముగిసింది. అలాగే ఏడోవారం ఎలిమినేషన్ ప్రక్రియ సైతం పూర్తైంది. ఆదివారం నాటి ఎపిసోడ్‏లో ఇంటి సభ్యులతో

Bigg Boss 5 Telugu: షణ్ముఖ్‏ను ఓ ఆటాడుకున్న ప్రియ.. దండం పెట్టేసిన షన్నూ..
Priya
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 25, 2021 | 6:36 AM

బిగ్‏బాస్ సండే ఫన్ డే ముగిసింది. అలాగే ఏడోవారం ఎలిమినేషన్ ప్రక్రియ సైతం పూర్తైంది. ఆదివారం నాటి ఎపిసోడ్‏లో ఇంటి సభ్యులతో ఫన్నీ గేమ్స్ ఆడించి..చివరకు ఎలిమినేట్ అయిన సభ్యుల పేరు ప్రకటించాడు నాగ్.. అయితే ఈ వారం (అక్టోబర్ 24న) డేంజర్ జోన్‏లో ఉన్న ఇద్దరూ కంటెస్టెంట్స్‏తోపాటు.. ఇంటి సభ్యులను సైతం కాసేపు ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఇక మొదటి నుంచి వినిపిస్తున్నట్టుగానే బిగ్ బాస్ ఏడోవారం ఎలిమినేట్ అయ్యింది ప్రియ. ఎలిమినేషన్ అనంతరం స్టేజ్ పైకి వచ్చిన ప్రియతో గేమ్ ఆడించాడు నాగార్జున.

ఇంట్లోని ప్రతి సభ్యునికి రిపోర్ట్ కార్డ్ ఇవ్వాలని ఆదేశించాడు.. దీంతో కంటెస్టెంట్స్ అందరికి ఒక్కో మార్క్ ఇస్తూ వివరణ ఇచ్చింది ప్రియ. ముందుగా లోబో.. తనకు అర్థం కాడంటూ ఐదు మార్కులిచ్చింది.. ఆ తర్వాత.. ఎవరూ హర్డ్ కాకుండా. నువ్వు కూడా హర్ట్ కాకుండా గేమ్ ఆడు అంటూ ఐదు మార్కులిచ్చింది. ఇక రవి గేమ్ బాగా ఆడుతున్నాడని ఏడు మార్కులిచ్చింది. ఇక షణ్ముఖ్ వండర్ ఫుల్ పర్సన్ అని… తన మైండ్ తో గేమ్ ఆడుతున్నాడని… తనలాంటి ఫ్రెండ్ అందరికి ఉండాలంటూ ఎనిమిది మార్కులిచ్చింది. అలాగే సిరికి కూడా ఎనిమిదిన్నర మార్కులిచ్చింది.. ఇక శ్రీరామ్ తనకు కనెక్ట్ కాలేదంటూనే ఎనిమిది మార్కులేసింది. బయటకు వచ్చాక తనకు సాంగ్ నేర్పించాలని గుర్తుచేసింది.

ఇక ఆ తర్వాత.. తనకు ఎంతో ఇష్టమైన ప్రియాంకకు పదికి 100 మార్కులు ఇచ్చేసింది. పొద్దున లేవగానే పింకీని చూస్తానని.. ఆమెను చూడకుండా నిద్ర లేచిన రోజు ఏదో ఒక గొడవ జరుగుతుందని చెప్పుకొచ్చింది. అలాగే యానీ మాస్టర్ అందరినీ సులువుగా నమ్మేస్తారని పది మార్కులేసింది. అలాగే.. జెస్సీ గేమ్ బాగా ఆడుతున్నాడంటూ ఎనిమిది మార్కులేసింది. ఇక చివరకు నీ గర్ల్ ఫ్రెండ్ దీప్తికి ఏమైనా చెప్పాలా ? అని షణ్ముఖ్ ను అడగ్గా.. ఆ మాత్రం అడిగారు చాలంటూ దండం పెట్టాడు.. అలాగే తనను మర్చిపోయి హాయిగా ఉంటున్నావని ఆమెకు చెప్తానని అనడంతో.. వద్దని ఇంట్లో ఎవరికీ భయపడను… కానీ ఆ అమ్మాయికి భయపడతానంటూ చెప్పుకొచ్చాడు షణ్ముఖ్.

ఇక కాజల్ కు ఏడు మార్కులేసింది. అలాగే మానస్ బంగారుకొండ అంటూ పది మార్కులేసింది. చిన్నవయసులోనే చాలా మెచ్యూరిటీ ఉందని చెప్పుకొచ్చింది.. ఇక సన్నీకి 9 మార్కులేస్తూ.. తన ప్లేటులో తినే రైట్.. నా కప్పులో తాగే హక్కు నీకు మాత్రమే ఉందని చెప్పుకొచ్చింది ప్రియ.

Also Read: Bigg Boss 5 Telugu Promo: బిగ్ షాకిచ్చిన నాగార్జున.. ఆ ఇద్దరిని ఎలిమినేట్ ?..

Bigg Boss 5 Telugu Promo: అడగండి.. లాక్కోండి.. దొంగిలించండి.. ఇంటి సభ్యులను ముప్పుతిప్పలు పెట్టిన నాగ్..