వాయిదా పడనున్న ‘అర్జున్ సురవరం’..!

వాయిదా పడనున్న ‘అర్జున్ సురవరం’..!

నిఖిల్‌కు కాలం కలిసి రావట్లేదు. టీఎన్ సంతోశ్ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించినప్పటి నుంచి అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. మొదట ఈ మూవీ టైటిల్ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సినిమాకు ‘ముద్ర’ అనే టైటిల్‌ను మొదట ఫిక్స్ చేసుకోగా.. అదే టైటిల్‌తో జగపతిబాబు మరో సినిమాను చేశారు. ఆ సినిమా నిర్మాత ముందుగానే ‘ముద్ర’ టైటిల్‌ను రిజిస్టర్ చేసుకోవడంతో నిఖిల్ తన సినిమాకు ‘అర్జున్ సురవరం’ అనే టైటిల్ మార్చక తప్పలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 22, 2019 | 12:37 PM

నిఖిల్‌కు కాలం కలిసి రావట్లేదు. టీఎన్ సంతోశ్ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించినప్పటి నుంచి అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. మొదట ఈ మూవీ టైటిల్ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సినిమాకు ‘ముద్ర’ అనే టైటిల్‌ను మొదట ఫిక్స్ చేసుకోగా.. అదే టైటిల్‌తో జగపతిబాబు మరో సినిమాను చేశారు. ఆ సినిమా నిర్మాత ముందుగానే ‘ముద్ర’ టైటిల్‌ను రిజిస్టర్ చేసుకోవడంతో నిఖిల్ తన సినిమాకు ‘అర్జున్ సురవరం’ అనే టైటిల్ మార్చక తప్పలేదు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా విడుదల వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. మార్చి 29న ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉండగా.. ఆ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి ఉంటుంది. అప్పుడు రిలీజ్ చేస్తే సినిమా వసూళ్లపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక కాస్త జరిగి ఏప్రిల్‌లో విడుదల చేయాలి అనుకున్నా.. ఆ నెలలో అన్ని తేదీలు ఫుల్ అయిపోయాయి. దీంతో మే1న అర్జున్ సురవరంకు తేదిని ఫిక్స్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఈ విషయంపై త్వరలోనే మూవీ యూనిట్ స్పష్టత ఇవ్వనుంది. కాగా తమిళ్‌లో విజయం సాధించిన కణిథన్ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కగా.. ఇందులో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి నటించింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu