ఈ ఏడాది మరో రికార్డు క్రియేట్ చేసిన తమిళ దళపతి.. పండగ చేసుకుంటున్న మాస్టర్ ఫ్యాన్స్..

సినీతారలకు ఉండే క్రేజీయే వేరు.. అందులో స్టార్ హీరోలకు తిరుగే ఉండదు. వారు ఏది చేసినా ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే అంత ప్యాన్ ఫాలోయింగ్

  • uppula Raju
  • Publish Date - 5:38 am, Wed, 9 December 20
ఈ ఏడాది మరో రికార్డు క్రియేట్ చేసిన తమిళ దళపతి.. పండగ చేసుకుంటున్న మాస్టర్ ఫ్యాన్స్..

సినీతారలకు ఉండే క్రేజీయే వేరు.. అందులో స్టార్ హీరోలకు తిరుగే ఉండదు. వారు ఏది చేసినా ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే అంత ప్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది వారికి. తాజాగా తమిళ సూపర్ స్టార్ విజయ్‌కు సంబంధించిన సెల్ఫీ ఫొటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
తమిళనాడులో విజయ్‌కు పాపులారిటీ ఓ రేంజ్‌లో ఉంటుంది. రజినీకాంత్ తర్వాత మళ్లీ అంత రేంజ్‌లో ఎవరైనా ఉన్నారంటే అది విజయే.

ఈ ఏడాది ఫిబ్రవరిలో నైవేలిలో ‘మాస్టర్’ సినిమా షూటింగులో ఉండగా ఆదాయపు పన్ను అధికారులు విజయ్‌ను తీసుకెళ్లి రెండు రోజుల పాటు విచారించారు. విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళనతో వేలాదిగా నైవేలీలోని షూటింగ్ స్పాట్ కి చేరుకున్నారు. ఈ సందర్బంగా అశేష అభిమాన జన సందోహం నడుమ విజయ్ సెల్ఫీ తీసుకుని, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిని అభిమానులు విపరీతంగా షేర్ చేస్తూ, ఒక లక్షా 45 వేల రీట్వీట్లు చేశారు. దీంతో రీట్వీట్ల పరంగా ఇదొక రికార్డు అయింది. ట్విట్టర్ ‘దిస్ హ్యపెండ్ 2020’ పేరిట ఈ ఏడాది అత్యధిక రీట్వీట్ పొందిన ఫొటోగా గుర్తించింది. దీంతో విజయ్ మరోసారి సోషల్‌మీడియాలో హాట్‌టాఫిక్‌గా నిలిచారు.