Aathmika : ప్రేమలో మోసపోయిన హీరోయిన్.. రాత్రిళ్లు ఒంటరిగా ఏడుస్తూ.. చివరకు..

ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆత్మీక తన ప్రేమ.. బ్రేకప్ స్టోరీని బయటపెట్టింది.

Aathmika : ప్రేమలో మోసపోయిన హీరోయిన్.. రాత్రిళ్లు ఒంటరిగా ఏడుస్తూ.. చివరకు..
Aathmika
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 15, 2023 | 10:21 AM

సౌత్ ఇండస్ట్రీలో భారీ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో ఆత్మిక ఒకరు. మీసేయ మీరుక్కు సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆత్మిక.. ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తొలి సినిమాతోనే విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీకి అవకాశాలు కూడా ఎక్కువగానే వచ్చాయి. తమిళ్ స్టార్ విజయ్ సరసన కోటియిల్ ఒరువన్ చిత్రంతోపాటు.. కాటేరి, నరకాసురన్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ జోడిగా కన్నెనంబాదే చిత్రంలో నటిస్తోంది. క్రైమ్, థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా ఈనెల 17న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆత్మీక తన ప్రేమ.. బ్రేకప్ స్టోరీని బయటపెట్టింది.

తాను ఓ వ్యక్తిని మనసార ప్రేమించానని.. కానీ ఆ ప్రేమ తన జీవితంలో ఎంతో కాలం నిలవలేదని తెలిపింది. ప్రేమను కావాలనుకున్న తనకు.. ఏ కారణం లేకుండానే బ్రేకప్ చెప్పి వెళ్లిపోయాడని.. లవ్ బ్రేకప్ కారణంగా కొన్ని రోజులు రాత్రిళ్లు ఒంటరిగా ఏడ్చానని చెప్పింది. అయితే లవ్ ఫెయిల్ కావడం అనేది ఇప్పుడు సంతోషంగా ఉన్నట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి

అయితే ఇకపై ప్రేమ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని.. తనకు రగ్డ్ వ్యక్తి.. స్మార్ట్ గా ఉండే వ్యక్తి వద్దని.. సాధారణంగా ఉండే మంచి మనసున్న అబ్బాయి అయితే చాలంటూ చెప్పుకొచిచింది. కానీ ప్రస్తుతం పేరు, డబ్బు ప్రధాన అంశాలుగా ఉన్నాయని.. తాను మాత్రం తొలి ప్రాధాన్యం డబ్బుకే ఇస్తానని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఆత్మిక తెలుగు తెరకు పరిచయం కాలేదు. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడుకు భారీగానే ఫాలోయింగ్ ఉంది.

View this post on Instagram

A post shared by Aathmika ? (@iamaathmika)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.