Best Smartphones: స్మార్ట్ఫోన్ కొనాలి అనుకొంటున్నారా..టాప్ 5 బెస్ట్ మొబైల్స్ ఇవే..!
మంచి పర్ఫామెన్స్ కలిగి ఉండే స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఇక ఆందోళన చెందకండి.. రూ.15,000 బడ్జెట్లో మీరు ఒక మంచి ఫోన్ను పొందవచ్చు. మీ బడ్జెట్ రూ. 15,000 వరకు ఉంటే, మీరు ఈ 5 స్మార్ట్ఫోన్లను తప్పకుండా కన్సిడర్ చేయవచ్చు.
Top 5 Best Mobiles
Follow us
IQOO Z9x: ఈ సంవత్సరం మేలో IQOO Z9x విడుదలైంది. ఈ ఫోన్ ధర రూ.12,499 నుంచి ప్రారంభమవుతుంది. ఇది స్నాప్డ్రాగన్ 6 Gen 1 చిప్సెట్ ద్వారా ఆధారితమైనది. ఇంతే కాకుండా 8GB RAM, 128GB స్టోరేజ్ ఉంది.ఈ ఫోన్ సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్ వంటి పనులను సౌకర్యవంతంగా చేస్తుంది. అత్యుత్తమ బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉంది.
Vivo T3: ఈ సంవత్సరం ఏప్రిల్లో Vivo T3విడుదలైంది. ఇది స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ కలిగి ఉంది.ఈ ఫోన్ రూ. 15,000 కంటే తక్కువ ఉంది, 8GB RAM, 128GB స్టోరేజ్ ఉంది. Vivo T3X ప్రారంభ ధర రూ. 12,999, ఈ సెగ్మెంట్లోని అత్యుత్తమ గేమింగ్ ఫోన్లలో ఇది ఒకటి..
Moto G64: ఈ ఫోన్లో MediaTek Dimension 7025 చిప్సెట్ సపోర్ట్ ఉంది. 8GB RAM,128GB స్టోరేజ్ ఉంది. ఈ ఫోన్ ధర రూ.13,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ Geekbench, AnTuTu, Burnout Throttle పరీక్షలో మంచి స్కోర్లను పొందింది. ఈ ఫోన్ అత్యంత వేగంగా ఛార్జింగ్ ఎక్కుతుంది.
Moto G45: Moto G45 కూడా అద్భుతమైన పనితీరుతో కూడిన ఫోన్, ఈ ఫోన్ ఆగస్టులో ప్రారంభమైంది. ఈ ఫోన్ Snapdragon 6s Gen 3 చిప్సెట్తో పనిచేస్తుంది. ఇది మీ రోజువారీ పని, మల్టీ టాస్కింగ్లో మీకు బాగా సహాయపడుతుంది. ఈ ఫోన్ ధర రూ.10,999 నుంచి ప్రారంభమవుతుంది.
Redmi 13: అద్భుతమైన పనితీరుతో రూ. 15,000 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది. Snapdragon 4 Gen 2 ప్రాసెసర్ కలిగి ఉంది. 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది.