‘F3’ movie update : ఎఫ్‌3 షూటింగ్‌‌‌‌‌‌లో అడుగు పెట్టిన మిల్కీబ్యూటీ.. వైరల్ అవుతున్న ఫోటో..

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో అనీల్ రావిపూడి ఒకరు. వరుసగా హిట్లు కొడుతూ దూసుకుపోతున్నాడు అనీల్. గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ విజయాన్ని..

'F3' movie update : ఎఫ్‌3 షూటింగ్‌‌‌‌‌‌లో అడుగు పెట్టిన మిల్కీబ్యూటీ.. వైరల్ అవుతున్న ఫోటో..
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 01, 2021 | 6:39 PM

‘F3’ movie update : టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో అనీల్ రావిపూడి ఒకరు. వరుసగా హిట్లు కొడుతూ దూసుకుపోతున్నాడు అనీల్. గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు అనీల్. ఇప్పడు ఎఫ్ 3 సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. తమన్నా, మెహరీన్‌ కథానాయికలు. కాగా. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఎఫ్‌2కు సీక్వెల్‌గా ఈ మూవీ వ‌స్తోంది. అయితే ఎఫ్‌2 బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని న‌మోదు చేసుకున్న విష‌యం తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే వెంకటేష్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. కాగా తాజాగా హీరోయిన్ తమన్నా కూడా సెట్లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఎఫ్3 లో నటించే నటీనటులతో వెంకటేష్ తమన్నా దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో ఎఫ్ 2 లో తమన్నా ఫ్యామిలీగా నటించిన నటులు ఉన్నారు. త్వరలోనే వరుణ్ తేజ్, మెహరీన్ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నారు. వెంకటేష్ ఇటీవలే నారప్ప సినిమా షూటింగ్ ను పూర్తి చేసాడు. మరో వైపు వరుణ్ తేజ్ ‘ఘని’ అనే సినిమా చేస్తున్నాడు. ఎఫ్‌3 సినిమాను ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ఇటీవల తెలిపింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Khiladi Movie : మాస్ మాహారాజ్ రవితేజ ‘ఖిలాడి’లో మరో మలయాళీ హీరో.. కీలక పాత్రలో కనిపించనున్న ఎన్టీఆర్ తమ్ముడు