రికార్డు క్రియేట్ చేసిన స్టార్ హీరో.. ఫస్ట్ లుక్ పోస్టర్‏ను ఎక్కడా విడుదల చేశాడో తెలిస్తే షాకే..

తెలుగులో దర్శకధీరుడు రాజమౌళీ తెరకెక్కించిన 'ఈగ' సినిమాలో విలన్‏గా నటించి మంచి గుర్తింపు పొందాడు కిచ్చా సుదీప్. అటు కన్నడలో స్టార్ హీరోగా ఉన్న సుదీప్.. తెలుగు

రికార్డు క్రియేట్ చేసిన స్టార్ హీరో.. ఫస్ట్ లుక్ పోస్టర్‏ను ఎక్కడా విడుదల చేశాడో తెలిస్తే షాకే..
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 01, 2021 | 6:06 PM

తెలుగులో దర్శకధీరుడు రాజమౌళీ తెరకెక్కించిన ‘ఈగ’ సినిమాలో విలన్‏గా నటించి మంచి గుర్తింపు పొందాడు కిచ్చా సుదీప్. అటు కన్నడలో స్టార్ హీరోగా ఉన్న సుదీప్.. తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఈగ విలన్‏గానే పరిచయమయ్యడు. ఇక ఆ మూవీ తర్వాత బహుబలి సినిమా చిన్నా పాత్రలో కనిపించాడు హీరో. తాజాగా కిచ్చా సుదీప్ అరుదైన రికార్డు సాధించాడు.

ప్రస్తుతం కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘విక్రాంత్ రానా’. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్‏గా రూపొందుతున్న ఈ సినిమాకు అనూప్ బండారి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ మూవూ ఫస్ట్ లుక్‏తోపాటు వీడియోను కూడా రివీల్ చేశారు. అది కూడా ప్రపంచంలోనే ఎత్తైన బూర్జ్ ఖలీఫాపై వీటిని ఆవిష్కరించారు. దాదాపు 2000 ఫీట్ల పొడవుతో సుదీప్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‏ను విడుదల చేశారు చిత్రయూనిట్. దీంతో సుదీప్ రికార్డ్ సృష్టించారు. ఇక సినీ ఇండస్ట్రీలోకి సుదీప్ అడుగుపెట్టి ఈ ఏడాదితో 25 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్బంగా విక్రాంత్ రానా మేకర్స్ బూర్జ్ ఖలీఫాపై పోస్టర్‏తోపాటు 180 సెకండ్ల నిడివిగల స్నేక్ పీక్‏ను విడుదల చేశారు. ఈ విషయాన్ని సుదీప్ తన ట్విట్టర్‏లో షేర్ చేశారు.

Also Read:

ఎమ్మెల్యేగా కనిపించనున్న నారా రోహిత్.. బాలయ్య కోసం సరికొత్తగా.. ట్విస్ట్ ఇవ్వడం కోసమేనంటా ?