అఖిల్ కోసం ఆ ముగ్గురు..?

‘అఖిల్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు అఖిల్ అక్కినేని. ఇప్పటికి మూడు చిత్రాలు చేసినా అఖిల్ కి సరైన హిట్ దక్కలేదు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన తన లేటెస్ట్ చిత్రం ‘మిస్టర్ మజ్ను’ కూడా అఖిల్ కి నిరాశే మిగిల్చింది. దీనితో ఎలాగైనా హిట్ కొట్టాలని తన తదుపరి సినిమాపై జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆది పినిశెట్టి సోదరుడు సత్య ప్రభాస్ ఇదివరకే అఖిల్ కి లైన్ చెప్పి ఓకే చేయించుకున్నాడని ఆ మధ్య […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:25 pm, Mon, 18 February 19
అఖిల్ కోసం ఆ ముగ్గురు..?

‘అఖిల్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు అఖిల్ అక్కినేని. ఇప్పటికి మూడు చిత్రాలు చేసినా అఖిల్ కి సరైన హిట్ దక్కలేదు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన తన లేటెస్ట్ చిత్రం ‘మిస్టర్ మజ్ను’ కూడా అఖిల్ కి నిరాశే మిగిల్చింది. దీనితో ఎలాగైనా హిట్ కొట్టాలని తన తదుపరి సినిమాపై జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ఆది పినిశెట్టి సోదరుడు సత్య ప్రభాస్ ఇదివరకే అఖిల్ కి లైన్ చెప్పి ఓకే చేయించుకున్నాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయనతో పాటు మరో ఇద్దరు కూడా ఈ లిస్ట్ లో చేరినట్లు తెలుస్తోంది. ఒకరు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ కాగా మరొకరు ‘గీతగోవిందం’ డైరెక్టర్ పరశురామ్.

డైరెక్టర్ భాస్కర్ అఖిల్ కోసం ఒక కథను రెడీ చేశాడని, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఇది తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. ఇక నిర్మాత అల్లు అరవింద్ తన హోమ్ బ్యానర్ గీతా ఆర్ట్స్ లో అఖిల్ కోసం డైరెక్టర్ పరశురామ్ ని బ్లాక్ చేశాడని టాక్. చూడాలి ఈ ముగ్గురిలో అఖిల్ ఎవరితో సినిమా చేస్తాడో.?