మెగాస్టార్ హిట్ సినిమాకి ఇది కాపీనా..!

మెగాస్టార్ హిట్ సినిమాకి ఇది కాపీనా..!

తమిళ హీరో శివ కార్తికేయన్, నయనతార కలిసి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ మిస్టర్ లోకల్’. వేలైక్కారాన్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం ఇది. దీని టీజర్ ని నిన్న విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే రొటీన్ ఫార్ములా తో ఈ సినిమాని తెరకెక్కించారని తెలుస్తోంది. లోకల్ గా ఉంటూ సరదాగా జీవితాన్ని గడిపేసే హీరో. డబ్బున్న అహంకారం, కంపెనీ సీఈఓననే గర్వంతో తక్కువ స్థాయి వాళ్ళని కించపరిచే హీరోయిన్. […]

TV9 Telugu Digital Desk

|

Feb 18, 2019 | 4:46 PM

తమిళ హీరో శివ కార్తికేయన్, నయనతార కలిసి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ మిస్టర్ లోకల్’. వేలైక్కారాన్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం ఇది. దీని టీజర్ ని నిన్న విడుదల చేశారు.

టీజర్ చూస్తుంటే రొటీన్ ఫార్ములా తో ఈ సినిమాని తెరకెక్కించారని తెలుస్తోంది. లోకల్ గా ఉంటూ సరదాగా జీవితాన్ని గడిపేసే హీరో. డబ్బున్న అహంకారం, కంపెనీ సీఈఓననే గర్వంతో తక్కువ స్థాయి వాళ్ళని కించపరిచే హీరోయిన్. ఒక సందర్భంలో హీరోతో సవాల్ చేయాల్సి వస్తుంది. దానితో తన పొగరును, తనని సొంతం చేసుకోవాలని టార్గెట్ పెట్టుకుంటాడు హీరో. ఇదే సింపుల్ గా మిస్టర్ లోకల్ స్టోరీ.

కానీ ఇదే లైన్ తో సుమారు ఇరవై ఏళ్ళ క్రితమే మెగాస్టార్ చిరంజీవి, నగ్మా జంటగా ‘ఘరానా మొగుడు’ వచ్చింది. అందులో కూడా కోటీశ్వరాలైన నగ్మా పొగరు అణిచే కార్మికుడుగా చిరంజీవి నటించాడు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీని ఒరిజినల్ తమిళ సినిమా కూడా అప్పట్లో ఈ స్థాయిలో ఆడలేదు.

సరిగ్గా ఈ లైన్ తోనే మిస్టర్ లోకల్ సినిమా రూపొందడం విశేషం. రాజేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి హిప్-హాప్ తమిజా సంగీతం అందిస్తున్నాడు. ధృవ, కృష్ణార్జున యుద్ధం సినిమాలతో ఇతను తెలుగువారికి సుపరిచితమే. నేచురల్ స్టార్ నానికి ‘నేను లోకల్’ లాగా శివ కార్తికేయన్ కి ‘మిస్టర్ లోకల్’ పెద్ద హిట్ అవ్వాలని ఆశిద్దాం.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu