Trending Song : 2 ఏళ్లుగా యూట్యూబ్‌ను ఊపేస్తోన్న ఊర మాస్ సాంగ్.. డీజేలో వింటే దద్దరిల్లిపోవాల్సిందే.. గూస్ బంప్స్ పక్కా..
కొన్ని పాటలు మనసుకు ప్రశాంతత కలిగిస్తాయి. మరికొన్ని మాత్రం ఒత్తిడిని తగ్గించి మాస్ వైబ్ ఇస్తుంటాయి. ఇటీవల కాలంలో యూట్యూబ్ లో ఫోక్ సాంగ్స్ తెగ ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. అలాగే కొన్ని చిత్రాల్లోని ఊర మాస్ పాటలు శ్రోతలకు మెంటలెక్కిస్తున్నాయి. అలాంటి వాటిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పాట ఒకటి. ఆ సాంగ్ డీజేలో పెట్టి వింటే గూస్ బంప్స్ రావడం మాత్రం పక్కా. ఇంతకీ ఆ పాట సంగతేంటో చూద్దామా.

కొన్ని పాటలు పదే పదే వినాలనిపిస్తుంది. మనసుకు ప్రశాంతత కలిగిస్తూ హాయి కలిగించే పాటలు చాలా ఉన్నాయి. అలాగే మరికొన్ని మాస్ పాటలు మాత్రం శ్రోతలకు మరింత ఊపునిస్తాయి. కొన్ని పాటలు సినిమాతోపాటు థియేటర్లలో వింటే వచ్చే అనుభూతి మాటల్లో చెప్పలేము. అద్భుతమైన బీజీఎమ్ తో సాగే పాటలు చాలానే ఉన్నాయి. దాదాపు రెండేళ్లుగా ఒక పాట యూట్యూబ్ ను ఊపేస్తుంది. పక్కా ఊర మాస్ సాంగ్ అది. థియేటర్లలో ప్రేక్షకులకు మంచి మాస్ వైబ్ ఇచ్చింది. ఇక కాలేజీ పార్టీలలో ఈ సాంగ్ తో కుర్రాళ్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా అనిరుథ్ రవిచంద్రన్ అందించిన ఆ సాంగ్ బీజీఎమ్ వేరేలెవల్ అనే చెప్పాలి. అదే హుకుమ్ అనే పాట.
ఎక్కువమంది చదివినవి : Jabardasth Sujatha: యూబ్యూబ్ నుంచి మాకు ఎన్ని కోట్లు వస్తాయంటే.. జబర్దస్త్ సుజాత కామెంట్స్ వైరల్..
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలోనిది. హుకుమ్ పాట ఇప్పటివరకు 200 మిలియన్ వ్యూస్ సాధించింది. అంటే 200 కోట్లకు పైగా వ్యూస్ తో రికార్డ్ సృష్టించింది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన రజనీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రం 2023లో థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో రమ్య కృష్ణన్, మిర్నా మీనన్, వినాయగన్, శివరాజ్‌కుమార్ మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలోని ‘హుకుమ్ – తలైవర్ అలప్పరై’ పాట జూలై 17, 2023న విడుదలైంది. ఈ పాటకు సూపర్ సుప్పు సాహిత్యం రాశారు. దీనిని అనిరుధ్ పాడారు. సంగీతంతో నిండిన ఈ పాట 2 సంవత్సరాలుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఇద్దరూ అక్కాచెల్లెల్లు.. ఒకరు స్టార్ హీరోయిన్.. మరొకరి జీవితం విషాదం.. ఎవరంటే..
ప్రస్తుతం ఈ పాట 200 మిలియన్ల వ్యూస్ దాటింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. రజనీకాంత్ తదుపరి ‘జైలర్ 2’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా నెల్సన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్‌లో విడుదల కానుందని చెబుతున్నారు.
ఎక్కువమంది చదివినవి : Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ? బుల్లితెర సూపర్ స్టార్ నిరుపమ్ పరిటాల..
ఎక్కువమంది చదివినవి : Trending Song : 6 నెలలుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్.. క్రేజ్ వేరేలెవల్..
