AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucky Zodiac Signs: అరుదైన నాలుగు రాజయోగాలు.. ఈ రాశులవారికి అదృష్టం, డబుల్ జాక్‌పాట్

February Raja Yogas: ఫిబ్రవరి నెలలో ఏకంగా నాలుగు శక్తివంతమైన రాజయోగాలు ఒకేసారి ఏర్పడబోతున్నాయి. వీటి ప్రభావం వ్యక్తుల జీవితాలకే కాదు.. దేశం, ప్రపంచ స్థాయిలోనూ కనిపించే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ నెలలో లక్ష్మీనారాయణ రాజయోగం, శుక్రాదిత్య రాజయోగం, ఆదిత్య మంగళ రాజయోగం, బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతున్నాయి. ఈ రాజయోగాలతో లాభం పొందే రాశలు గురించి తెలుసుకుందాం.

Rajashekher G
|

Updated on: Feb 01, 2026 | 10:13 AM

Share

Raja Yoga February Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు 12 రాశులపై ప్రభావం చూపిస్తాయి. గ్రహాల సంచారంతో పలుమార్లు కొన్ని శక్తివంతమైన యోగాలు ఏర్పడతాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కూడా ఇలాంటి అరుదైన యోగాలు ఏర్పడబోతున్నాయి. 
సాధారణంగా ఒక రాజయోగం ఏర్పడితేనే దాని ఫలితంగా చాలా ప్రభావవంతంగా ఉంటుందని చెబుతారు.

Raja Yoga February Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు 12 రాశులపై ప్రభావం చూపిస్తాయి. గ్రహాల సంచారంతో పలుమార్లు కొన్ని శక్తివంతమైన యోగాలు ఏర్పడతాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కూడా ఇలాంటి అరుదైన యోగాలు ఏర్పడబోతున్నాయి. సాధారణంగా ఒక రాజయోగం ఏర్పడితేనే దాని ఫలితంగా చాలా ప్రభావవంతంగా ఉంటుందని చెబుతారు.

1 / 6

 కానీ, ఈ ఫిబ్రవరి నెలలో ఏకంగా నాలుగు శక్తివంతమైన రాజయోగాలు ఒకేసారి ఏర్పడబోతున్నాయి. వీటి ప్రభావం వ్యక్తుల జీవితాలకే కాదు.. దేశం, ప్రపంచ స్థాయిలోనూ కనిపించే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ నెలలో లక్ష్మీనారాయణ రాజయోగం, శుక్రాదిత్య రాజయోగం, ఆదిత్య మంగళ రాజయోగం, బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతున్నాయి.

కానీ, ఈ ఫిబ్రవరి నెలలో ఏకంగా నాలుగు శక్తివంతమైన రాజయోగాలు ఒకేసారి ఏర్పడబోతున్నాయి. వీటి ప్రభావం వ్యక్తుల జీవితాలకే కాదు.. దేశం, ప్రపంచ స్థాయిలోనూ కనిపించే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ నెలలో లక్ష్మీనారాయణ రాజయోగం, శుక్రాదిత్య రాజయోగం, ఆదిత్య మంగళ రాజయోగం, బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతున్నాయి.

2 / 6

సూర్యుడు, బుధుడు, శుక్రుడు, మంగళుడు కలిసి ఏర్పడే ఈ యోగాలు కొన్ని రాశులకు చాలా శుభఫలితాలు ఇవ్వనున్నాయి. ముఖ్యంగా కొంతమంది జీవితాల్లో కొత్త ఉత్సాహం, అదృష్టం, డబ్బు పెరుగుదల మొదలయ్యే సూచనలున్నాయి. ఆ మూడు రాశులు, ఏయే ఫలితాలను పొందుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

సూర్యుడు, బుధుడు, శుక్రుడు, మంగళుడు కలిసి ఏర్పడే ఈ యోగాలు కొన్ని రాశులకు చాలా శుభఫలితాలు ఇవ్వనున్నాయి. ముఖ్యంగా కొంతమంది జీవితాల్లో కొత్త ఉత్సాహం, అదృష్టం, డబ్బు పెరుగుదల మొదలయ్యే సూచనలున్నాయి. ఆ మూడు రాశులు, ఏయే ఫలితాలను పొందుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

3 / 6

మేష రాశి
ఫిబ్రవరి నెల మేష రాశి వారికి చాలా ప్రత్యేకంగా ఉండనుంది. ఈ నాలుగు రాజయోగాలతో ఈ రాశి వారి ఆదాయం ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. దీంతో ఆదాయంలో ఊహించని పెరుగుదలను చూస్తారు. కొత్త వ్యాపారం పెట్టాలనుకునేవారికి ఇదే ఉత్తమ సమయం. వ్యాపారంలో పెద్ద ఒప్పందం దక్కే సూచను ఉన్నాయి. చదువు, విద్య విషయాల్లో మంచి ఫలితాలు రావచ్చు. పెట్టుబడులు పెట్టిన వారికి లాభం కనిపించవచ్చు. షేర్ మార్కెట్ లేదా ఇతర మార్గాల్లోనూ ఆర్థికంగా మేలు చేస్తుంది.

మేష రాశి ఫిబ్రవరి నెల మేష రాశి వారికి చాలా ప్రత్యేకంగా ఉండనుంది. ఈ నాలుగు రాజయోగాలతో ఈ రాశి వారి ఆదాయం ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. దీంతో ఆదాయంలో ఊహించని పెరుగుదలను చూస్తారు. కొత్త వ్యాపారం పెట్టాలనుకునేవారికి ఇదే ఉత్తమ సమయం. వ్యాపారంలో పెద్ద ఒప్పందం దక్కే సూచను ఉన్నాయి. చదువు, విద్య విషయాల్లో మంచి ఫలితాలు రావచ్చు. పెట్టుబడులు పెట్టిన వారికి లాభం కనిపించవచ్చు. షేర్ మార్కెట్ లేదా ఇతర మార్గాల్లోనూ ఆర్థికంగా మేలు చేస్తుంది.

4 / 6

కన్య రాశి
ఈ నాలుగు రాజయోగాలు కన్యా రాశి వారికి కూడా శుభ ఫలితాలు కలిగిస్తాయి. ఈ యోగాలు మీ జాతకంలో ఆరో, పని సంబంధిత స్థానంలో ఏర్పడుతున్నాయి. దీని వల్ల న్యాయపరమైన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారం చేసే వారి ఆదాయం పెరగవచ్చు. చాలా కాలంగా ప్రయత్నిస్తూ వచ్చిన పనులు ఇప్పుడు ఫలితాలు ఇస్తాయి. డబ్బుతో సంబంధం ఉన్న అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగం మార్చాలనుకునేవారికి ఇదే సమయం. వారికి కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది.

కన్య రాశి ఈ నాలుగు రాజయోగాలు కన్యా రాశి వారికి కూడా శుభ ఫలితాలు కలిగిస్తాయి. ఈ యోగాలు మీ జాతకంలో ఆరో, పని సంబంధిత స్థానంలో ఏర్పడుతున్నాయి. దీని వల్ల న్యాయపరమైన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారం చేసే వారి ఆదాయం పెరగవచ్చు. చాలా కాలంగా ప్రయత్నిస్తూ వచ్చిన పనులు ఇప్పుడు ఫలితాలు ఇస్తాయి. డబ్బుతో సంబంధం ఉన్న అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగం మార్చాలనుకునేవారికి ఇదే సమయం. వారికి కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది.

5 / 6
కుంభ రాశి

ఫిబ్రవరి నెలలో ఏర్పడే ఈ నాలుగు రాజయోగాలు కుంభరాశి వారికి శుభాలను తీసుకొస్తాయి. కుంభ రాశి లగ్నంలోనే ఏర్పడుతుండటంతో వీరిలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. సమాజంలో గౌరవం, గుర్తింపు పొందే అవకాశాలున్నాయి. వివాహితుల జీవితంలో ఆనందం, పరస్పర అవగాహన పెరుగుతాయి. పనులు చేసే విధానంలో మార్పు వస్తుంది. మీ కృషికి గుర్తింపు లభిస్తుంది. చాలా రోజులుగా నిలిచిపోయిన పనుల్లో పురోగతి ఉంటుంది. మీకున్న కొన్ని కోరికలు ఈ నెలలో తీరే అకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది.

కుంభ రాశి ఫిబ్రవరి నెలలో ఏర్పడే ఈ నాలుగు రాజయోగాలు కుంభరాశి వారికి శుభాలను తీసుకొస్తాయి. కుంభ రాశి లగ్నంలోనే ఏర్పడుతుండటంతో వీరిలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. సమాజంలో గౌరవం, గుర్తింపు పొందే అవకాశాలున్నాయి. వివాహితుల జీవితంలో ఆనందం, పరస్పర అవగాహన పెరుగుతాయి. పనులు చేసే విధానంలో మార్పు వస్తుంది. మీ కృషికి గుర్తింపు లభిస్తుంది. చాలా రోజులుగా నిలిచిపోయిన పనుల్లో పురోగతి ఉంటుంది. మీకున్న కొన్ని కోరికలు ఈ నెలలో తీరే అకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది.

6 / 6
Follow Us