అతి కొద్ది మంది సన్నిహితుల మధ్యే మా పెళ్ళి.. వివాహంపై క్లారిటీ ఇచ్చిన సునిత..

ప్రముఖ గాయని సునీత త్వరలో తన వైవాహిక జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. సోమవారం మ్యాంగో మీడియా గ్రూప్ హెడ్ రామ్ వీరపనేనినితో సునిత నిశ్చితార్థం చేసుకున్న

అతి కొద్ది మంది సన్నిహితుల మధ్యే మా పెళ్ళి.. వివాహంపై క్లారిటీ ఇచ్చిన సునిత..
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 08, 2020 | 2:44 PM

ప్రముఖ గాయని సునీత త్వరలో తన వైవాహిక జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. సోమవారం మ్యాంగో మీడియా గ్రూప్ హెడ్ రామ్ వీరపనేనినితో సునీత నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ పెళ్ళికి సంబంధించి ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడుకొని ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. జనవరిలో తమ పెళ్ళి జరగనున్నట్లు ఓ ఆంగ్ల పత్రికకు సునీత వెల్లడించారు. అయితే తమ పెళ్ళి కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య నిరాడంబరంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. సునీతకు, రామ్ ఇద్దరికీ ఇది రెండో వివాహమన్న విషయం తెలిసిందే. కాగా గత కొంత కాలంగా సునిత రెండో పెళ్ళి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగింది. సోమవారం సునీత స్వయంగా తాను వివాహం చేసుకోబోతున్నట్లుగా ప్రకటించడంతో.. ప్రముఖులు, అభిమానులు సునీతకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.