డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంజనా బెయిల్‌లో‌ ట్విస్ట్.. వైద్యపరీక్షలు ఆదేశించిన కోర్టు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో కన్నడ సినీ తార సంజన అరెస్ట్ అయినా విషయం తెలిసిందే. పక్క ఆధారాలతో పట్టుబడ్డ ఈ హీరోయిన్ ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తుంది.

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంజనా బెయిల్‌లో‌ ట్విస్ట్.. వైద్యపరీక్షలు ఆదేశించిన కోర్టు
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 08, 2020 | 2:35 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో కన్నడ సినీ తార సంజన అరెస్ట్ అయినా విషయం తెలిసిందే. పక్క ఆధారాలతో పట్టుబడ్డ ఈ హీరోయిన్ ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తుంది. అయితే తనకు ఆరోగ్యం సరిగా లేదని ఆస్తమాతో బాధపడుతున్న అని, చలికాలం కావడంతో ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉందని కాబట్టి బెయిల్ ఇవ్వాలని సంజనా గల్రానీ కోర్టును అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో సంజనాకు వైద్యపరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించి. వాణి విలాస్ వైద్యశాలలో ఆమెకు పరీక్షలు నిర్వహించాలని కోర్టు జైలు అధికారులను ఆదేశించింది. నిజంగా ఆమెకు అనార్యోగం ఉంటే బెయిలు మంజూరు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యంగా ఉందని తేలితే మాత్రం సంజన తిరిగి జైలుకు వెళ్లసిందే. గురువారం లోపు వైద్యపరీక్షలకు సంబంధించిన నివేదిక తమకు సమర్పించాలని కూడా జస్టిస్ శ్రీనివాస్ హరీశ్కుమార్ అధికారులను ఆదేశించారు. సంజనా ఇప్పటికే బెయిల్ కోసం రెండు సార్లు పిటిషన్ను దాఖలు చేశారు. కానీ ఆమె అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.