శ్లోకాలు వల్లిస్తున్న మెగామేనల్లుడు.. ‘పెళ్లిచేసుకున్నవాడు ప్రతిరోజు ఫూల్ అవుతాడట’..
మెగామేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం'సోలో బ్రతుకే సో బెటర్'ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయనున్నారు.
మెగామేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం’సోలో బ్రతుకే సో బెటర్’ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నభనటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పాటలు,టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కరోనా టైం లో ఈ మూవీని ఓటీటీ వెదికాగా విడుదల చేస్తారని ప్రచారం జరిగిన థియేటర్స్ ఓపెన్ ఆయేంతవరకు మేకర్స్ ఎదురుచూసారు.
తెలుగులో థియేటర్స్ రీ ఓపెన్ అయిన తర్వాత విడుదల అవుతున్న తెలుగు సినిమా ఇదే. ఇక తాజాగా విరాట్ ఫిలాసఫీ పేరుతో ఓ గ్లిమ్స్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో శ్లోకం నెం.14గా ”ఏప్రిల్ ఫస్ట్ కి ఫూల్స్ డే అని తెలిసి కూడా ఫూల్ అయ్యేవాడు.. ప్రతిరోజూ ఫూల్ అవుతాడని తెలిసి కూడా పెళ్ళి చేసుకునే వాడు.. ఈ చరిత్రలో సుఖపడినట్లే లేదు” అని సాయి ధరమ్ తేజ్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. ‘అమ్మమ్మ కోసం పెళ్లి చేసుకుంటా.. అమ్మ కోసం తాళి కడతా.. నాన్న కోసం పిల్లల్ని కంటానంటావేంటి’ అని శ్లోకం నెం.27 చూపించారు ..త్వరలోనే మరిన్ని శ్లోకాలు ముందుకు తీసుకువస్తా అని సాయి ధరమ్ తేజ్ చెప్పడం ఫన్నీగా ఉంది. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.