మధురమైన గాత్రం.. గమ్మత్తైన గమకాలతో పాటకు ప్రాణం పోస్తాడు.. మ్యూజిక్ లవర్స్‏కు మోస్ట్ వాంటెడ్ సింగర్‏గా సిధ్ శ్రీరామ్

Sid Sriram: ప్రేమికులైనా.. ప్రేమలో విఫలమైనా... విరహ వేధనను అనుభవించే వారైనా.. విజయాన్ని సాధించినవారైనా. వారి గుండెలోని భావాలకు.. తన గొంతులో ప్రాణం పోస్తాడు సిధ్ శ్రీరామ్.

మధురమైన గాత్రం.. గమ్మత్తైన గమకాలతో పాటకు ప్రాణం పోస్తాడు.. మ్యూజిక్ లవర్స్‏కు మోస్ట్ వాంటెడ్ సింగర్‏గా సిధ్ శ్రీరామ్
Sid Sriram
Follow us
Rajitha Chanti

|

Updated on: May 19, 2021 | 2:39 PM

Sid Sriram: ప్రేమికులైనా.. ప్రేమలో విఫలమైనా… విరహ వేధనను అనుభవించే వారైనా.. విజయాన్ని సాధించినవారైనా. వారి గుండెలోని భావాలకు.. తన గొంతులో ప్రాణం పోస్తాడు సిధ్ శ్రీరామ్. ట్యూన్ కు తగ్గట్టుగా తన పాటను పొందుపరుస్తాడు. వినేవారికి అద్భుతంగా కన్వే చేస్తాడు. సిధ్ శ్రీరామ్.. ప్రస్తుత మ్యూజిక్ లవర్స్ కు మోస్ట్ వాంటెడ్ సింగర్‏గా మారిపోయాడు ఈ యంగ్ సింగర్. పాటలో పూర్తిగా మమేకమై తన భాషతో సంబంధం లేకుండా అలవోకగా పాడేస్తాడు. తన పాటల ద్వారానే ఎన్నో చిత్రాలకు హిట్ అందించిన సిధ్ శ్రీరామ్ బర్త్ డే ఈరోజు.

సిధ్ శ్రీరామ్ అసలు పేరు సిద్ధార్థ్ శ్రీరామ్. 1990లో మే 19న శ్రీరామ్, లత దంపతులకు జన్మించారు. సంగీత నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన సిధ్ శ్రీరామ్ కు చిన్ననాటి నుంచే పాటలంటే ఇష్టం. చిన్నప్పుడే ఆల్బమ్స్ తయారుచేసి.. యూ ట్యూబ్ లో పెట్టేవాడు. ఈ పాటలను చూసిన ఏఆర్ రెహమాన్.. సిధ్ శ్రీరామ్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ‘కడలి’లో తొలిసారి పాట పాడిన సిధ్ కు.. ‘ఐ’ మూవీలో మరోసారి అవకాశం ఇచ్చాడు రెహమాన్. దాంతో సిధ్ శ్రీరామ్ కెరీర్ మలుపు తిరిగింది. అప్పటి నుంచి రెహమాన్ మ్యూజిక్ డైరెక్షన్ లో చాలా పాటలు ఆలపించాడు. ‘అదిరింది’, ’24’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రాల్లో తన గళం వినిపించాడు. అయితే విజయ్ దేవరకొండ, రష్మిక కాంబినేషన్ లో వచ్చిన ‘గీత గోవిందం’.. సిధ్ కు బ్రేక్ ఇచ్చింది. ఈ పాటతో తెలుగు ఆడియన్స్ కు ఫేవరేట్ సింగర్ గా మారిపోయాడు. దీంతో సిధ్ పాట ఉంటే చాలు.. సినిమా తేలిగ్గా ఆడియన్స్ కు రీచ్ అవుతుందని.. డైరెక్టర్లు చెప్పేవరకు వచ్చింది.

గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ మూవీలో సిధ్ పాట కంపల్సరీగా వినిపిస్తుంది. ట్యాక్సీవాలా, డియర్ కామ్రెడ్ మూవీస్ లో సిధ్ పాటలు.. మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకున్నాయి. అమ్మాయి అందాన్ని వర్ణించాలంటే.. అది సిధ్ గొంతు నుంచి వస్తేనే బాగుంటుంది. ఆడియన్స్ ను అంతలా మెస్మరైజ్ చేస్తాడు సిధ్ శ్రీరామ్. ఇటు చిన్న చిత్రాల పాటలైనా.. శ్రీరామ్ పాడిన పాటలు ప్రేక్షకుల చెవుల్లో మార్మోగాయి. ఎన్నిసార్లు విన్నా.. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉన్న కొన్ని పాటలు.. ఆయన శ్రావ్యమైన గొంతుకు మచ్చుతునకలు. మహిళ గొప్పతనాన్ని ప్రపంచానికి వినిపించేలా సిధ్ పాడిన పాట.. అందరిచేతా శభాష్ అనిపించుకుంది. లోకానికి తెలుసా నీ విలువా అంటూ మగువ సహనానికి ఆయన ఇచ్చిన గాత్రం శ్రోతలను కట్టిపడేసింది. పాటలు పాడటమే కాదు.. సంగీత దర్శకుడిగా కూడా సిధ్ తన ప్రతిభను చాటుకున్నాడు. మణిరత్నం నిర్మించిన తమిళ మూవీ వానమ్ కొట్టాట్టమ్ మూవీకి బాణీలు సమకూర్చాడు. ఇలా తెలుగు, తమిళ, కన్నడ, మళయాల భాషల్లో తిరుగులేని అభిమానులను సంపాదించుకున్నాడు సిధ్ శ్రీరామ్.

Also Read: ఆ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త.. ఇక డెబిట్ కార్డ్ అక్కర్లేదు.. మొబైల్‏తోనే డబ్బులు విత్ డ్రా..

కరోనా కష్టాల్లో కేంద్రం గుడ్‏న్యూస్.. అకౌంట్లోకి ఉచితంగా రూ.50 వేలు.. సూపర్ ఛాన్స్.. ఇలా చేస్తే చాలు..