అనారోగ్యానికి గురైన రజినీకాంత్.. టెన్షన్ ఫీలవుతున్న అభిమానులు..

సూపర్ స్టార్ రజినీకాంత్ అనారోగ్యానికి గురైనట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిపారు.

  • uppula Raju
  • Publish Date - 4:17 pm, Sun, 22 November 20
అనారోగ్యానికి గురైన రజినీకాంత్.. టెన్షన్ ఫీలవుతున్న అభిమానులు..

సూపర్ స్టార్ రజినీకాంత్ అనారోగ్యానికి గురైనట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిపారు. కరోనా సోకిందేమోనన్న అనుమానంతో టెస్ట్‌లు చేయించగా అలాంటిదేమీ లేదని తేలింది. కేవలం వైరల్ ఫీవర్‌గా ప్రచారం జరుగుతోంది. రజినీకాంత్ కొన్ని సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందుకే ఆయన చేసే సినిమాల సంఖ్య కూడా తగ్గించారు. ఒక సినిమా పూర్తయ్యాక మరో సినిమా చేస్తున్నారు. రజినీకాంత్ రాజకీయ పార్టీ స్థాపించినా పార్టీ కార్యక్రమాల్లో మాత్రం చురుగ్గా పాల్గొనడం లేదు. ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు.

ఇదిలా ఉంటే రజినీకాంత్ అస్వస్థతకు గురయ్యాడని తెలియడంతో అభిమానులు, పార్టీ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది. ఆయన రాజకీయంలోకి రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ప్రస్తుతం ఆయన సిరుత్తై దర్శకత్వంలో అన్నాత్తై సినిమా చేస్తున్నారు. ఈ మధ్యే అన్ని జాగ్రత్తలు తీసుకొని షూటింగ్‌లో కూడా పాల్గొన్నారు. ఇంతలోనే ఇలా జరిగింది. అయితే ఆయనకు వచ్చింది సాధారణ జ్వరమే అని త్వరలోనే కోలుకొని అభిమానుల ముందుకు వస్తాడన కుటుంబసభ్యులు వెల్లడించారు.