Flash News: అవును ‘ఆర్ఆర్ఆర్’‌లో నటిస్తున్నా.. ఏ పాత్రంటే: శ్రియ

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం). ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీని దాదాపు 300 కోట్లతో దానయ్య నిర్మిస్తున్నారు.

Flash News: అవును 'ఆర్ఆర్ఆర్'‌లో నటిస్తున్నా.. ఏ పాత్రంటే: శ్రియ
Follow us

| Edited By:

Updated on: Jun 07, 2020 | 9:02 PM

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం). ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీని దాదాపు 300 కోట్లతో దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ సగానికి పైగా పూర్తైంది. కాగా ఈ చిత్రంలో శ్రియ కూడా నటించబోతుందని ఆ మధ్యన వార్తలు వచ్చాయి. ఇక ఆ వార్తలపై తాజాగా క్లారిటీ ఇచ్చేసింది ఈ నటి.  తాను నటిస్తున్నానని రివీల్ చేశారు శ్రియ. అభిమానులతో చిట్‌చాట్‌లో పాల్గొన్న శ్రియ.. తన తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తెలుగులో రెండు చిత్రాలకు ఓకే చెప్పానని తెలిపిన ఈ నటి.. అందులో ‘ఆర్ఆర్ఆర్’ ఒకటని అన్నారు. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లలో అజయ్ దేవగన్ సరసన తాను నటించబోతున్నట్లు శ్రియ వివరించారు. అయితే ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతిలో శ్రియ హీరోయిన్‌గా నటించగా.. దాదాపు 15 సంవత్సరాల తరువాత ఆయనతో మళ్లీ పనిచేయబోతున్నారు. అంతేకాదు ఇంతవరకు అనుష్కను మాత్రమే జక్కన్న తన సినిమాల్లో రిపీట్ చేయగా.. ఇప్పుడు ఆ లిస్ట్‌లో శ్రియ కూడా చేరిపోయింది.

కాగా ఈ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, చెర్రీ అల్లూరి సీతారామరాజుగా కనిపించనుండగా.. వారి గురువుగా అజయ్ దేవగన్ నటిస్తున్నారు. అలియా భట్, ఒలివియా హీరోయిన్లుగా కనిపించనున్నారు. వీరితో పాటు సముద్రఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తోన్న ఈ మూవీని పలు భారతీయ భాషల్లో విడుదల చేయబోతున్నారు. బాహుబలి తరువాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

Read This Story Also: ఆయన నా వీరాభిమాని.. అప్పట్లో…: జగన్‌పై బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు

Latest Articles
నువ్వు చాలా మంచోడివి కమిన్స్ మామా!.SRH కెప్టెన్ ఏం చేశాడో తెలుసా?
నువ్వు చాలా మంచోడివి కమిన్స్ మామా!.SRH కెప్టెన్ ఏం చేశాడో తెలుసా?
వెచ్చటి వేసవిలో ఏసీలపై కూల్ కూల్ ఆఫర్స్..!
వెచ్చటి వేసవిలో ఏసీలపై కూల్ కూల్ ఆఫర్స్..!
ఈసారైన జులై టెన్షన్.. కడెం ప్రాజెక్ట్ గట్టెక్కగలుగుతుందా..?
ఈసారైన జులై టెన్షన్.. కడెం ప్రాజెక్ట్ గట్టెక్కగలుగుతుందా..?
వర్షం మూవీలో ప్రభాస్ మేనల్లుడు గుర్తున్నాడా.. ?
వర్షం మూవీలో ప్రభాస్ మేనల్లుడు గుర్తున్నాడా.. ?
పిన్ లేకుండానే యూపీఐ చెల్లింపులు..పేటీఎంలో అందుబాటులోకి నయా ఫీచర్
పిన్ లేకుండానే యూపీఐ చెల్లింపులు..పేటీఎంలో అందుబాటులోకి నయా ఫీచర్
కదులుతున్న రైలు నుంచి పడి మరణిస్తే పరిహారం ఉంటుందా?నిబంధనలు ఏంటి?
కదులుతున్న రైలు నుంచి పడి మరణిస్తే పరిహారం ఉంటుందా?నిబంధనలు ఏంటి?
కేవైసీ విషయంలో సెబీ కీలక నిర్ణయం.. లావాదేవీలు మరింత సులభం
కేవైసీ విషయంలో సెబీ కీలక నిర్ణయం.. లావాదేవీలు మరింత సులభం
కిర్గిస్థాన్‌లో ప్రాణభయంతో వణికిపోతున్న తెలుగు విద్యార్ధులు
కిర్గిస్థాన్‌లో ప్రాణభయంతో వణికిపోతున్న తెలుగు విద్యార్ధులు
టీ20 వరల్డ్ కప్‌లో ఈ 5 రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే!
టీ20 వరల్డ్ కప్‌లో ఈ 5 రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే!
కూరల్లో ఉప్పు బాగా ఎక్కువైందా.. ఇలా చేస్తే సరి!
కూరల్లో ఉప్పు బాగా ఎక్కువైందా.. ఇలా చేస్తే సరి!