AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puneeth Rajkumar: ఆ సమయంలో తమ్ముడిని అలా చూడడం మనసుకు కష్టంగా అనిపించింది.. మరోసారి భావోద్వేగానికి గురైన శివరాజ్ కుమార్..

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ( Puneeth Rajkumar) గతేడాది అక్టోబర్‌లో గుండెపోటుతో మరణించారు. సినిమా రంగం(Cinema industry) లో ఎన్నో మైలురాళ్లు అందుకోవాల్సిన ఆయన హఠాత్తుగా మరణించడం ఆయన కుటుంబ సభ్యులతో సహా సన్నిహితులు, అభిమానులను తీవ్రంగా కలచి వేసింది

Puneeth Rajkumar: ఆ సమయంలో తమ్ముడిని అలా చూడడం మనసుకు కష్టంగా అనిపించింది.. మరోసారి భావోద్వేగానికి గురైన శివరాజ్ కుమార్..
Basha Shek
|

Updated on: Jan 30, 2022 | 11:44 AM

Share

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ( Puneeth Rajkumar) గతేడాది అక్టోబర్‌లో గుండెపోటుతో మరణించారు. సినిమా రంగం(Cinema industry) లో ఎన్నో మైలురాళ్లు అందుకోవాల్సిన ఆయన హఠాత్తుగా మరణించడం ఆయన కుటుంబ సభ్యులతో సహా సన్నిహితులు, అభిమానులను తీవ్రంగా కలచి వేసింది. ఈ విషాదంతో పునీత్ ఒప్పుకున్న సినిమాలకు కూడా బ్రేక్ పడింది. అయితే  ఇప్పుడు ఎలాగోలా వాటిని పూర్తి చేసి విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా అప్పూ నటించిన ఆఖరి ‘జేమ్స్’ (James) సినిమా ఫస్ట్ లుక్ ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు మూవీ మేకర్స్.  ఇది పవర్ స్టార్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

తమ్ముడిని అలా చూడడం కష్టంగా అనిపించింది..

కాగా ‘జేమ్స్’ సినిమాలోని తన పాత్రకు పూర్తిగా డబ్బింగ్ చెప్పకముందే పునీత్ తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో  ఆయన గొంతుకు సరిపోయే వాయిస్‌ కోసం ఆ సినిమా చిత్రబృందం ఎంతో అన్వేషించింది. చివరకు పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ నే పర్ఫెక్ట్ చాయిస్ అని భావించి ఆయనతోనే మిగతా సీన్లకు డబ్బింగ్ చెప్పారు. కాగా దీనిపై శివరాజ్ కుమార్ స్పందించారు.  ‘నేను ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు డబ్బింగ్ చెప్పేందుకు  ప్రయత్నించాను.  అయితే ఆ సమయంలో పునీత్ అలా చూసేసరికి తట్టుకోలేకపోయాను.   మనసుకి ఎంతో కష్టంగా అనిపించింది.  తమ్ముడికి డబ్బింగ్ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నా. అది ఎలా ఉంటుందో, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో ‘ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.  కాగా   ‘జేమ్స్’ సినిమాలో పునీత్ సోదరులు శివ రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్ కూడా  ప్రత్యేక పాత్రల్లో నటించనున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి . ముగ్గురు అన్నదమ్ములను కలిపి ఒకేసారి వెండితెరపై  చూసేందుకు వారి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా ‘జేమ్స్’ సినిమాకు పునీత్ సతీమణి అశ్విని పునీత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చేతన్ కుమార్ దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.  ఈక్రమంలో పునీత్ పుట్టిన రోజును పురస్కరించుకుని మార్చి 17న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

Also read:Andhra pradesh: ఆ బాలికకు ఉచిత వైద్యం అందించండి.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు..

Tirupati: తిరుపతిలో దారుణం.. జనసేన కార్యకర్తను కత్తులతో నరికి చంపిన దుండగులు..

Guntur: దొంగతనానికి వచ్చి దర్జాగా బెడ్ పై నిద్రపోయాడు.. తెల్లారగానే ఏం జరిగిందో తెలుసా?

రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?